Minority status
-
సీజేఐ లాస్ట్ వర్కింగ్ డే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ:సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా డీవై చంద్రచూడ్ చివరి పనిదినమైన శుక్రవారం(నవంబర్ 8) సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదాపై సీజేఐ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4:3 మెజారిటీతో తీర్పు చెప్పింది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ అయినంత మాత్రాన మైనార్టీ హోదా ఉండదనే సుప్రీంకోర్టు 1967లో ఇచ్చిన తీర్పును ధర్మాసనంలో సీజేఐ డీవై చంద్రచూడ్ సహా జస్టిస్ సంజీవ్ కన్నా,జస్టిస్ జేబీ పార్థీవాలా,జస్టిస్ మనోజ్మిశ్రాలు తోసిపుచ్చారు. ఇక ఈ తీర్పుతో ధర్మాసనంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్సీ శర్మ విభేదించారు. అయితే అలీగఢ్ యూనివర్సిటీకి మైనార్టీ హోదా ఉంటుందా ఉండదా అనే అంశాన్ని తేల్చేపనని ధర్మాసనం ముగ్గురు జడ్జిల ప్రత్యేక బెంచ్‌కు అప్పగించింది. కాగా, ఈ ఏడాది జనవరి చివరిలో ఈ కేసులో ఎనిమిది రోజుల పాటు వాదనలు విన్న అనంతరం ఫిబ్రవరి 1న సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు చేసింది. శుక్రవారం సీజేఐ చంద్రచూడ్ చివరి పనిదినం కావడం గమనార్హం. ఆయన నవంబర్ 10 (ఆదివారం) రిటైర్ అవుతున్నారు.ఇదీ చదవండి: కోల్‌కతా హత్యాచార కేసు బదిలీకి సుప్రీం నో -
మైనారిటీ శాఖ పరిధిలో ‘లింగాయత్’ హోదా
న్యూఢిల్లీ: లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా కల్పించే అంశం తమ పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. మైనారిటీ వ్యవహారాల శాఖ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని హోంశాఖ గురువారం వెల్లడించింది. అయితే.. కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున మైనారిటీ హోదాపై ఇప్పట్లో నిర్ణయం తీసుకోబోమని హోంశాఖ ప్రతినిధి తెలిపారు. ‘మత హోదాపై నిర్ణయం తీసుకోవటం హోంశాఖ పరిధిలోకి రాదు. అందుకే దీన్ని మైనారిటీ వ్యవహారాల శాఖకు బదిలీ చేశాం. కర్ణాటక సర్కారు ప్రతిపాదనను పరిశీలించటం, నిర్ణయం తీసుకోవటంలో మైనారిటీ శాఖకే పూర్తి అధికారాలున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. -
ప్రత్యేక మతంగా లింగాయత్!
సాక్షి, బెంగళూరు: ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కర్ణాటకలో అధికార కాంగ్రెస్ మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్‌లు, వీరశైవ లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ.. మతపరమైన మైనారిటీ హోదాను కల్పించే వ్యూహంపై ముందడుగేసింది. సోమవారం సమావేశమైన కర్ణాటక కేబినెట్.. లింగాయత్ సామాజికవర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ.. వారికి మతపరమైన మైనారిటీ హోదా కల్పించాలన్న రిటైర్డ్ జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీ సిఫారసులను ఆమోదించింది.ఈ సిఫారసులను త్వరలో కేంద్రానికి పంపనుంది. కన్నడ మంత్రి టీబీ జయచంద్ర మాట్లాడుతూ.. ‘రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. ఈ నిర్ణయం ద్వారా తదుపరి విస్తృతమైన సంప్రదింపులు, చర్చలు జరుపుతాం’ అని పేర్కొన్నారు. దీని ద్వారా ప్రస్తుతం మైనారిటీ హోదాను అనుభవిస్తున్న వారికి ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. కొందరు లింగాయత్ స్వాములు.. సోమవారం సీఎం సిద్దరామయ్యను కలిసి కమిటీ రిపోర్టు వీలైనంత త్వరగా అమలయ్యేలా చూడాలని కోరారు. కేబినెట్ నిర్ణయంతో హర్షిస్తూ.. లింగాయత్‌లు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకోగా.. వీరశైవులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్బుర్గీతోపాటు దావణగెరె, బిజాపుర ప్రాంతాల్లో లింగాయత్‌లు, వీరశైవులకు మధ్య ఘర్షణలు జరిగాయి. కాగా, ఈ రిజర్వేషన్‌పై తమ వైఖరిని వెల్లడించాలని బీజేపీ చీఫ్ అమిత్‌షా, యడ్యూరప్పలు రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. నిప్పుతో ఆటలొద్దు.. బీజేపీ: లింగాయత్ లు, వీరశైవుల రిజర్వేషన్ల వివాదానికి బీజేపీ సహా పలు హిందూ సామాజిక వర్గాలు మొదటినుంచీ దూరంగా ఉంటున్నాయి. అయితే.. సిద్దరామయ్య సర్కారు తీసుకున్న తాజానిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. రాజకీయ అవసరాలకోసం సిద్దరామయ్య ప్రభు త్వం కులాలు, మతాలను విభజిస్తోందని మం డిపడింది. ఓటుబ్యాంకు రాజకీయాలకోసం సిద్దరామయ్య నిప్పుతో ఆడుతున్నారని కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధర్ రావు విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు.. విభజించు–పాలించు అన్న బ్రిటిషర్ల విధానాన్నే కాంగ్రెస్ అమలుచేస్తోందన్నారు. ‘వీరశైవులు, లింగాయత్‌లు ఒక్కటే. ఈ రెండు సామాజిక వర్గాలూ హిందుత్వంలో భాగమే. రాజకీయ లాభం కోసం వీరిని విడగొడుతున్నారు’ అని కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి య డ్యూరప్ప మండిపడ్డారు. కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. చాలాకాలంగా డిమాండ్ లింగాయత్‌లు చాలాకాలంగా ప్రత్యేక మతంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా ఇవ్వాలన్న అంశం చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఇలాంటి కీలకమైన అంశాన్ని.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో లేవనెత్తడం కాంగ్రెస్‌కు మేలు చేస్తుందని భావిస్తున్నారు. యడ్యూరప్ప కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారే. దీంతో ఆయన్ను, బీజేపీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ ఉన్నపళంగా ప్రత్యేక మతం పేరుతో మైనారిటీ అంశాలను తెరపైకి తెచ్చింది. 17 శాతం లింగాయత్‌ల ఓట్లకోసం.. అఖిల భారత వీరశైవ మహాసభ.. లింగాయత్‌లు, వీరశైవులు ఒక్కటేనని అందరికీ ప్రత్యేక మత హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా.. మరో గ్రూపు కేవలం లింగాయత్‌లకు మాత్రమే ఈ హోదాను ఇవ్వాలని పట్టుబడుతోంది. కొందరు లింగాయత్‌లు ఓ అడుగు ముందుకేసి.. వీరశైవులను తమలో కలుపు కునేందుకు సిద్ధమేనని.. అయితే వీరశైవులంతా లింగాయత్లేనని చెప్పుకోవాలనే షరతుపెట్టారు. దీనిపై కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనికితోడు ఎన్నికలు సమీపిస్తుండటంతో 17 శాతం ఉన్న వీరశైవులు, లింగాయత్‌ల ఓట్ల కోసం సిద్దరామయ్య సర్కారు.. హైకోర్టు రిటైర్డ్ జడ్జి హెచ్ఎన్ నాగమోహన్‌దాస్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ మార్చి 2న తన నివేదికను అందజేసింది. ‘కర్ణాటకలోని లింగాయత్, వీరశైవ లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా ఇవ్వవచ్చు’ అని ఈ కమిటీ సూచించింది. లింగాయత్ X వీరశైవం! కర్ణాటక రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందుండే లింగాయత్‌లు చాలాకాలంగా మతపరమైన మైనారిటీ హోదా కోసం పోరాడుతున్నారు. లింగాయత్‌లు రెండు వర్గాలు. ఇందులో ఒకరు లింగాయత్‌లు, రెండోవారు వీరశైవ లింగాయత్‌లు. 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు (బసవణ్ణ) లింగాయత్ సిద్ధాంతాన్ని ఏర్పాటుచేశారు. ‘అనుభవ మంటపం’ అనే వేదికను ఏర్పాటుచేసి అందరినీ ఆదరించారు. విగ్రహారాధన లేకుండా.. నిరాకారుడైన శివుడినే పూజించాలని ప్రబోధించారు. అందరూ ఇష్టలింగం పేరుతో లింగాన్ని మెడలో వేసుకోవాలని, చేసే పని ద్వారానే దైవాన్ని చేరతామని (కాయకేవ కైలాస) ప్రబోధించాడు. ఆయన తర్వాత తరతరాలుగా పలువురు గురువులు మఠాలను స్థాపించి బసవణ్ణ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఈ మఠాలు విద్యాసంస్థలతో బాటు, అనేక సంస్థలు నిర్వహిస్తూ ఆర్థికంగా, సామాజికంగా బలంగా వున్నాయి. గతంలోనే కర్ణాటక ప్రభుత్వం లింగాయత్‌లు, వీరశైవులను (గతంలో వీరంతా ఒకటేననే భావన ఉండేది) 5% రిజర్వేషన్‌తో బీసీ 3–బి కేటగిరీలో చేర్చారు. ప్రస్తుతం వీరంతా హిందువులుగానే పరిగణించబడుతున్నారు. ఇతర మైనారిటీల్లాగే..: లింగాయత్‌లు తాము హిందువులం కాదని.. బౌద్ధులు, జైనులు, సిక్కుల్లాగా తామూ గురువులనే అనుసరిస్తామనీ, కాబట్టి తమను కూడా వారిలాగే మైనారిటీలుగా గుర్తించాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. లింగాయతులు, తాము ఒకటే సమూహమని వీరశైవులంటున్నారు. వీరశైవులు తమను లింగాయత్‌లుగా చెప్పుకోవడం కొందరు లింగాయత్‌లకు నచ్చటం లేదు. నిజానికి వీరశైవం బసవణ్ణ కంటె ముందు నుంచే అస్తిత్వంలో వుంది. హిందూమతంలోని ఓ శాఖే వీరశైవం అంటారు. అయితే శివుణ్ని తప్ప విష్ణువుని కొలవరు వాళ్లు. శివుడికి బలులిస్తారు. వైదికకర్మలను, ఆగమ శాస్త్రాన్ని ఆచరిస్తారు. లింగాయతులు వీటికి వ్యతిరేకం. దీంతో వివిధ లింగాయత్ వర్గాలు తమను వీరశైవుల్లో కలిపి లెక్క వేయవద్దని, తమకు మైనారిటీ హోదా యిచ్చి తీరాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించాయి. కర్ణాటకలో లింగాయత్‌లు రాజకీయంగా కూడా కీలక స్థానాలు అలంకరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక 15 ఏళ్లపాటు లింగాయతులే ముఖ్యమంత్రులుగా వున్నారు (నిజలింగప్ప, బిడి జత్తి, ఎస్ఆర్ కాంతి, వీరేంద్ర పాటిల్). ఆ తర్వాత కూడా లింగాయత్ వర్గానికి చెందిన ఎస్ఆర్ బొమ్మయ్, జెహెచ్ పాటిల్, యడ్యూరప్ప సీఎంలయ్యారు. కన్నడనాట వీరి జనాభా 17 శాతం. దాదాపు 100 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించగలిగే స్థానంలో ఉన్నారు. -
‘లింగాయత్‌లు ప్రత్యేక మతం కాదు’: ఆర్ఎస్ఎస్
సాక్షి, బెంగుళూరు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో లింగాయత్‌ల చుట్టూ కన్నడ రాజకీయాలు తిరుగుతున్నాయి. ‘కర్ణాటకలో లింగాయత్ కమ్యూనిటీని ప్రత్యేక మతంగా అంగీకరించ’ మని నాగ్‌పూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ సభ ప్రకటించింది. లింగాయత్‌లు ప్రత్యేక మతంగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారని, దాన్ని అమలు చేస్తే భవిష్యత్‌లో హిందూ మతం ముక్కలయ్యే ప్రమాదం ఉందని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లింగాయత్‌ల డిమాండ్లకు అంగీకరించారు. లింగాయత్ కమ్యూనిటీని ప్రత్యేక మతంగా పరిగణిస్తామని ప్రకటించారు. వారిని మైనారిటీల్లో కలిపేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి నాగమోహన్ దాస్‌తో కమిటీ వేశారు. హిందూ మతం కులాల కుప్ప.. తమ డిమాండ్ల సాధనలో లింగాయత్ కమ్యూనిటీలోని అన్ని వర్గాలు కలిసిరాకపోవడం గమనార్హం. వీరశైవులు లింగాయత్ స్థాపకుడు బసవన్న బోధనలతో ఆకర్షితులై శివున్ని పూజించే మతస్తులు. తమని వీరశైవ లింగాయత్‌లుగా పిలవాలని వారు కోరుతున్నారు. తమ గురించి వేదాల్లో చెప్పారనీ.. వీరశైవం హిందూ మతంలో భాగమని వారు వాదిస్తున్నారు. వేదాలతో విభేదించే లింగాయత్‌లు మాత్రం తమది ప్రత్యేక మతంగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. లింగాయత్‌లు హిందూ మతంలో భాగం కానేకాదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రత్యేక లింగాయత్ మత ఉద్యమ నాయకుడు ఎస్.ఎం.జామదార్ అన్నారు. ‘మా మతాన్ని బసవన్న స్థాపించాడు. ఇందులో కులాలు ఉండవు. హిందూ మతం కులాల కుప్ప’ని వ్యాఖ్యానించారు. ముస్లిం, క్రిస్టియన్ వర్గాల భయం.. ఈ ఉద్యమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెన్ను దన్నుగా నిలుస్తుండడంతో.. ఆయన ప్రభుత్వం ఈ అంశంపై రెండుగా చీలిపోయింది. లింగాయత్‌లలో ముఖ్యమైన అయిదు వీరశైవ శాఖలు మాత్రం తమకు ప్రత్యేక మతం హోదా అవసరం లేదని అంటున్నాయి. ఇది మిగతా లింగాయత్‌లలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. లింగాయత్‌లను మైనారిటీల్లో చేర్చడం వల్ల.. రాజకీయంగా, ఆర్థికంగా బలమైన సామాజిక వర్గమైన వారు తమను అణగదొక్కుతారని ముస్లిం, క్రిస్టియన్ వర్గాలు బయపడుతున్నాయి. కన్నడ రాష్ట్రంలో 18 శాతం ఉన్న లింగాయత్‌ల ఉద్యమం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆధారపడి ఉంది. -
8 రాష్ట్రాల్లో మైనారిటీలుగా హిందువులు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో హిందువులను మైనారిటీలుగా గుర్తించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఒక దాఖలైంది. ఆయా రాష్ట్రాల్లో నిత్యం హిందువులపై మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని అందులో న్యాయవాదులు పేర్కొన్నారు. మైనారిటీ చట్టం 1992ను అనుసరించి ఎనిమిది రాష్ట్రాల్లో హిందువులును మైనారిటీలుగా గుర్తించాలని కోరుతూ బీజేపీ నేత, సీనియర్ అడ్వకేట్ అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. దేశంలో ప్రస్తుతం మెజారిటీ, మైనారిటీ ప్రాతిపదిక మత రాజకీయాలు పెరిగిపోయాయని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లకు ఆయన లేఖ రాశారు. అంతేకాక ప్రస్తుతం కొనసాగుతున్నర బలవంతవు లౌకిక వ్యవస్థ.. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని పేర్కొన్నారు. లక్షద్వీప్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయా, జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, పంజాబ్‌లలో హిందువుల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో హిందువులను మైనారిటీలుగా గుర్తించాలని సుప్రీంకోర్టును అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ అభ్యర్థించారు. -
గుజరాత్లో జైనులకు ‘మైనారిటీ’
అహ్మదాబాద్: గుజరాత్‌లోని జైనులకు మైనారిటీ హోదా ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. యూపీఏ ప్రభుత్వం 2014 జనవరిలోనే జైనులను మైనారిటీలుగా గుర్తించింది. గుజరాత్ కూడా దీనిపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునేలోపే పటేళ్ల ఆందోళన ఉధృతం అవటంతో.. పక్కన పెట్టిందని. రాష్ట్ర రవాణా మంత్రి, రాష్ట్ర బీజేపీ కమిటీ చీఫ్ రూపానీ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల జైనుల్లోని పేదలకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు. విజయ్ కూడా జైనుడే కావటం విశేషం. -
ఆ 42 డీఎడ్ కాలేజీల్లో చేరొద్దు
నేటి కౌన్సెలింగ్‌లో వాటిని ఎంచుకోవద్దు మైనారిటీ హోదాపై ప్రభుత్వ నిర్ణయం వచ్చే వరకు ఆగాల్సిందే కౌన్సెలింగ్ వాయిదా వేయాలని కన్వీనర్‌కు విద్యాశాఖ లేఖ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 42 డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీలకు మైనారిటీ హోదాపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, బుధవారం జరిగే డీఎడ్ కౌన్సెలింగ్ విద్యార్థులు అందులో చేరవద్దని పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం వెలువడే వరకు ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. వాటిలో చేరితే ఆ ప్రవేశాలకు విద్యాశాఖ బాధ్యత వహించదని వివరించారు. మరోవైపు ఆ 42 కాలేజీల మైనారిటీ హోదాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రానందున, ఈ నెల 11 నుంచి తలపెట్టిన కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని డీఈఈసెట్-ఈసీ-ఎస్డబ్ల్యూ-2 కన్వీనర్‌కు లేఖ రాశారు. మైనారిటీ హోదా నిర్ణయం వెలువడని కాలేజీల వివరాలు. . నల్లగొండ: అల్ జిహాన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-వెంకటాద్రిపాలెం, డాన్ కాలేజీ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఖతీజాఖతూన్ డిప్లొమా ఇన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-వేంపహాడ్, నౌమాన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్, జోసఫ్ యువ డీఎడ్ కాలేజ్, సనా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్, తేజ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-కోదాడ, కేజీఎన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-జీవీగూడెం, షయాన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-దేవరకొండ, సోఘ్రా కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్-కొండభీమనపల్లి, తుమారా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-గొల్లగూడ, మదర్ మేరీ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్-చింతల్, భగత్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-ఆకుపాముల. ఖమ్మం: హోలీపాథ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హోలీ ఫెయిత్ మైనారిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-ఓల్డ్ పాల్వంచ. రంగారెడ్డి: కరుణోదయ డీఎడ్ కాలేజ్-హైదర్శకోటే, లయోలా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-యాప్రాల్, విశ్వభారతి డీఎడ్ కాలేజ్-చేవెళ్ల, రవీంద్రనాథ్ ఠాగూర్ టీచర్ ట్రైనింగ్ కాలేజీ-కుమ్మెర, ఎస్ఆర్ఎం డీఎడ్ కాలేజీ- గుర్రంగూడ, ప్రజ్ఞ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-సీతారామ్పేట, అసిఫియా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-చింతుల్ల, ఐన్‌స్టీన్ డీఎడ్ కాలేజ్-చేవెళ్ల. హైదరాబాద్: మొఘల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-బండ్లగూడ, ఇస్లామియా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-ఎస్ఆర్టీకాలనీ యాకత్పురా, వీపీఈఎస్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-తిలక్‌నగర్ నల్లకుంట, ప్రెసిడెన్సీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-ఫలక్‌నుమా బస్టాప్, గులామ్ అహ్మద్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-బంజారాహిల్స్, ఎస్ఎస్వీ డీఈడీ కాలేజ్-ఆల్మాస్‌గూడ. వరంగల్: రహమాన్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-యశ్వంతపూర్.ఆదిలాబాద్: పంచశీల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్-గాజులపేట. మెదక్: గజ్వేల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-పాములపర్తి, నేషనల్ టీచర్ ట్రైనింగ్ కాలేజ్-మునిదేవనపల్లి, ఇస్లామియా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్-సిద్ధిపేద్, రీమన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-సంగారెడ్డి, డెక్కన్ కాలేజ్ ఆఫ్ డీఎడ్-పాములపర్తి. మహబూబ్‌నగర్: నూర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-సోలిపూర్.నిజామాబాద్: సెయింట్ థామస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-ఆచన్‌పల్లి, అహ్మద్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-రామేశ్వరపల్లి, అహ్మద్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-ఆచ న్‌పల్లి. కరీంనగర్: క్రిసెంట్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-కరీంనగర్, అలెగ్జాండర్ కాలేజ్ ఆఫ్ డీఎడ్ ఎడ్యుకేషన్-ముగ్దుంపూర్.