ఆ 42 డీఎడ్ కాలేజీల్లో చేరొద్దు | a d-ed 42 colleges don"t join | Sakshi
Sakshi News home page

ఆ 42 డీఎడ్ కాలేజీల్లో చేరొద్దు

Published Wed, Feb 11 2015 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM

a d-ed 42 colleges  don"t join

నేటి కౌన్సెలింగ్‌లో వాటిని ఎంచుకోవద్దు
మైనారిటీ హోదాపై ప్రభుత్వ నిర్ణయం
వచ్చే వరకు ఆగాల్సిందే
కౌన్సెలింగ్ వాయిదా వేయాలని
కన్వీనర్‌కు విద్యాశాఖ లేఖ

 
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 42 డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీలకు మైనారిటీ హోదాపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, బుధవారం జరిగే డీఎడ్ కౌన్సెలింగ్ విద్యార్థులు అందులో చేరవద్దని పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం వెలువడే వరకు ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. వాటిలో చేరితే ఆ ప్రవేశాలకు విద్యాశాఖ బాధ్యత వహించదని వివరించారు. మరోవైపు ఆ 42 కాలేజీల మైనారిటీ హోదాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రానందున, ఈ నెల 11 నుంచి తలపెట్టిన కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని డీఈఈసెట్-ఈసీ-ఎస్‌డబ్ల్యూ-2 కన్వీనర్‌కు లేఖ రాశారు.
 మైనారిటీ హోదా నిర్ణయం వెలువడని కాలేజీల వివరాలు.
.
నల్లగొండ: అల్ జిహాన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-వెంకటాద్రిపాలెం, డాన్ కాలేజీ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఖతీజాఖతూన్ డిప్లొమా ఇన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-వేంపహాడ్, నౌమాన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్, జోసఫ్ యువ డీఎడ్ కాలేజ్, సనా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్, తేజ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-కోదాడ, కేజీఎన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-జీవీగూడెం, షయాన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-దేవరకొండ, సోఘ్రా కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్-కొండభీమనపల్లి, తుమారా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-గొల్లగూడ, మదర్ మేరీ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్-చింతల్, భగత్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-ఆకుపాముల.

ఖమ్మం: హోలీపాథ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హోలీ ఫెయిత్ మైనారిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-ఓల్డ్ పాల్వంచ.
 రంగారెడ్డి: కరుణోదయ డీఎడ్ కాలేజ్-హైదర్శకోటే, లయోలా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-యాప్రాల్, విశ్వభారతి డీఎడ్ కాలేజ్-చేవెళ్ల, రవీంద్రనాథ్ ఠాగూర్ టీచర్ ట్రైనింగ్ కాలేజీ-కుమ్మెర, ఎస్‌ఆర్‌ఎం డీఎడ్ కాలేజీ- గుర్రంగూడ, ప్రజ్ఞ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-సీతారామ్‌పేట, అసిఫియా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-చింతుల్ల, ఐన్‌స్టీన్ డీఎడ్ కాలేజ్-చేవెళ్ల.
 
హైదరాబాద్: మొఘల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-బండ్లగూడ, ఇస్లామియా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-ఎస్‌ఆర్‌టీకాలనీ యాకత్‌పురా, వీపీఈఎస్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-తిలక్‌నగర్ నల్లకుంట, ప్రెసిడెన్సీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-ఫలక్‌నుమా బస్టాప్, గులామ్ అహ్మద్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-బంజారాహిల్స్, ఎస్‌ఎస్‌వీ డీఈడీ కాలేజ్-ఆల్మాస్‌గూడ.
 
వరంగల్: రహమాన్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-యశ్వంతపూర్.ఆదిలాబాద్: పంచశీల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్-గాజులపేట.
 మెదక్: గజ్వేల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-పాములపర్తి, నేషనల్ టీచర్ ట్రైనింగ్ కాలేజ్-మునిదేవనపల్లి, ఇస్లామియా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్-సిద్ధిపేద్, రీమన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-సంగారెడ్డి, డెక్కన్ కాలేజ్ ఆఫ్ డీఎడ్-పాములపర్తి.
 మహబూబ్‌నగర్: నూర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-సోలిపూర్.నిజామాబాద్: సెయింట్ థామస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-ఆచన్‌పల్లి, అహ్మద్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-రామేశ్వరపల్లి, అహ్మద్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-ఆచ న్‌పల్లి. కరీంనగర్: క్రిసెంట్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్-కరీంనగర్, అలెగ్జాండర్ కాలేజ్ ఆఫ్ డీఎడ్ ఎడ్యుకేషన్-ముగ్దుంపూర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement