Minority Affairs Department
-
అజ్మీర్ దర్గాపై కొత్త వివాదం
అజ్మీర్/న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని ప్రఖ్యాత అజ్మీర్ దర్గాపై కొత్త వివాదం మొదలైంది. ప్రస్తుతం దర్గా ఉన్న స్థలంలో గతంలో శివాలయం ఉండేదని పేర్కొంటూ కొందరు స్థానిక సివిల్ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. శివాలయాన్ని కూల్చివేసి, సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ పేరిట దర్గా నిర్మించారని వారు పేర్కొన్నారు. దర్గా ప్రాంగణాన్ని దేవాలయంగా గుర్తించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై న్యాయస్థానం స్పందించింది. పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ బుధవారం అజ్మీర్ దర్గా కమిటీకి, మైనార్టీ వ్యవహారాల శాఖకు, భారత పురావస్తు సర్వే విభాగానికి(ఏఎస్ఐ)కి నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పట్టణంలో షాహీ జామా మసీదు సర్వే వ్యవహారంలో ఘర్షణ జరిగి నలుగు మృతిచెందిన కొన్ని రోజులకే అజ్మీర్ దర్గాపై కోర్టు నోటీసులు జారీ చేయడం గమనార్హం. అజ్మీర్ సైతం మత ఘర్షణలకు కేంద్రంగా మారుతుందా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో అలజడి సృష్టించడానికే పిటిషన్ ఇదిలా ఉండగా, అజ్మీర్ దర్గా వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. దీనిపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్పందించారు. మతాల పేరిట చిచ్చురేపి, సమాజంలో అలజడి సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగానే ఈ పిటిషన్ దాఖలు చేశారని అజ్మీర్ దర్గాను పర్యవేక్షించే అంజుమన్ సయీద్ జద్గాన్ కార్యదర్శి సయీద్ సర్వర్‌చిïÙ్త ఆరోపించారు. మతాలవారీగా సమాజాన్ని ముక్కలు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మత సామరస్యానికి, లౌకికవాదానికి ప్రతీక అయిన అజ్మీర్ దర్గా మైనార్టీ వ్యవహారాల శాఖ పరిధిలోకి వస్తుందని, దీంతో ఏఎస్ఐకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏమిటీ వివాదం?: అజ్మీర్ దర్గాను సంకట్ మోచన్ మహాదేవ్ ఆలయంగా ప్రకటించాలని కోరుతూ సెప్టెంబర్ నెలలో అజ్మీర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అక్కడ పూజలు చేసుకొనే అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింన తర్వాత తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. అజ్మీర్ దర్గాకు ఏదైనా రిజి్రస్టేషన్ ఉంటే వెంటనే రద్దు చేయాలని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా డిమాండ్ చేశారు. ఏఎస్ఐ ద్వారా అక్కడ సర్వే చేపట్టాలని, దర్గా ప్రాంగణంలో పూజలు చేసుకొనే హక్కు హిందువులకు కల్పించాలని పేర్కొన్నారు. దర్గా ఉన్నచోట శివాలయం ఉండేదని, హరవిలాస్ సర్దా రాసిన పుస్తకంలో ఈ విషయం ప్రస్తావించారని గుర్తుచేశారు. సర్వే చేస్తే నష్టమేంటి? గిరిరాజ్ సింగ్ అజ్మీర్ దర్గాలో సర్వే చేయాలని కోర్టు ఉత్తర్వు ఇచ్చింందని, సర్వే చేస్తే వచ్చిన సమస్య ఏమిటి? కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు. మొఘల్ రాజులు మన దేశంపైకి దండెత్తి వచ్చారని, ఇక్కడి ఆలయాన్ని కూల్చేశా రని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చే స్తోందని విమర్శించారు. జవహర్లాల్ నెహ్రూ 1947లోనే ఈ బుజ్జగింపు రాజకీయాలు ఆపేసి ఉంటే ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు: ఒవైసీ అజ్మీర్ దర్గా 800 ఏళ్లుగా ఉందని ఐఎంఐ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఉర్స్ సందర్భంగా ప్రధానమంత్రి అక్కడ చాదర్ సమరి్పంచడం సంప్రదాయంగా వస్తోందని, ఇప్పటిదాకా పనిచేసిన ప్రధానులంతా ఈ సంప్రదాయం పాటించారని వెల్లడించారు. దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యవహారాలతో దేశానికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రార్థనా స్థలాల చట్టం–1991 ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ప్రార్థనా స్థలాలను యథాతథంగా కొనసాగించాలని, వాటిలో ఎలాంటి మార్పులు చేయరాదని ఒవైసీ తేల్చిచెప్పారు. దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం: కపిల్ సిబల్ అజ్మీర్ దర్గా విషయంలో రగడ జరుగుతుండడం బాధాకరమని ఎంపీ కపిల్ సిబల్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మన దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం? ఇదంతా ఎందుకు? అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అని నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రాకపోవడంతో కొందరు వ్యక్తులు ఓ వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకొని, గొడవలు సృష్టిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ మొహిబుల్లా నద్వీ ఆరోపించారు. సివిల్ కోర్టు ఉత్తర్వును పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జాద్‌గనీ లోన్ తప్పుపపట్టారు. -
‘ఉర్దూ’ ఉద్యోగాలు సర్దేశారు!
సాక్షి, హైదరాబాద్ : సర్కారీ కొలువుల భర్తీలో నిబంధనలు మాయమయ్యాయి. మైనారిటీ సంక్షేమ శాఖ లో ఇటీవల భర్తీ చేసిన ఉర్దూ అధికారి (గ్రేడ్–2) పోస్టుల నియామకంలో రిజర్వేషన్లు అటకెక్కాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ నియామకాలు చేపట్టాల్సి ఉన్నా అందుకు భిన్నంగా మైనార్టీ సంక్షేమ శాఖ నియామకాలు పూర్తిచేసింది. భర్తీ చేసిన 60 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ–ఏ కేటగిరీ అభ్యర్థులే లేరు. మొత్తం 60 పోస్టులు జిల్లా కలెక్టరేట్లు, జీఏడీ, మైనారిటీ సంక్షేమ శాఖ, ఉర్దూ అకాడమీ, పోలీస్ ఉన్నతాధికారి కార్యాలయా ల్లో పని చేసేందుకు ఉర్దూ అధికారి గ్రేడ్–2 పోస్టుల ను సర్కారు మంజూరు చేసింది. ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపట్టింది. నిబంధనల ప్రకారం 50% పోస్టులు రిజర్వేషన్ల పద్ధతిలో, మిగతావి మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయాలి. అందులో 30% దివ్యాంగులకూ అవకాశం ఇవ్వాలి. కానీ ఉర్దూ గ్రేడ్–2 కేటగిరీలో 60 పోస్టులుండగా 80% పోస్టులు ఓపెన్‌లో సర్దుబాటు చేశారు. మిగతా 20% పోస్టుల్లో మెజారిటీ సంఖ్యను బీసీ–ఈ కేటగిరీతో భర్తీ చేశారు. క్యారీ ఫార్వర్డ్ లేకుండానే ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులు లేకుంటే వాటిని క్యారీఫార్వర్డ్ చేస్తారు. తర్వాత ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేస్తారు. ఉర్దూ అధికారి గ్రేడ్–2 పోస్టుల్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ పోస్టులను జనరల్ కేటగిరీకి మార్చుతున్నట్లు కనీసం ప్రకటన కూడా ఇవ్వకపోవడం విస్మయం కలిగిస్తోందంటున్నారు. 60 పోస్టుల్లో ఎస్సీలకు 15 శాతం చొప్పున 9 పోస్టులు, ఎస్టీలకు 6 శాతం చొప్పున 4 పోస్టులు కేటాయించాలి. కానీ అభ్యర్థులు లేరని ఎస్సీ, ఎస్టీల పోస్టులను ఇతర అభ్యర్థులతో మైనార్టీ సంక్షేమ శాఖ భర్తీ చేసింది. ఓ మాజీ ఐపీఎస్ ఒత్తిడి! ఓ మాజీ ఐపీఎస్ అధికారి ఒత్తిడి మేరకు అధికారులు ఇలా ఏకపక్షంగా చర్యలు తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. అందుకే జాబితాను గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తూ చేపట్టిన ఈ భర్తీకి సంబంధించి ఉర్దూ అకాడమీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలతో ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ఉర్దూ అకాడమీ వెబ్సైట్లో మైనారిటీ సంక్షేమ శాఖ తాజాగా ప్రదర్శించింది. కేటగిరీ పోస్టులు ఓసీ 9 బీసీ–బీ 7 బీసీ–సీ 1 బీసీ–డీ 1 బీసీ–ఈ 42 కేటగిరీల వారీగా నియమితులైన అభ్యర్థుల వివరాలు ఓపెన్ కేటగిరీ జనరల్ కోటాలో 29 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో ఏడుగురు ఓసీ అభ్యర్థులు, 22 మంది బీసీ–ఈ అభ్యర్థులు. ఓపెన్ కేటగిరీ వుమెన్ కోటాలో 19 పోస్టులు భర్తీ చేశారు. వీరిలో ఒకరు ఓసీ, 17 మంది బీసీ–ఈ, ఒకరు బీసీ–బీ. బీసీ–బీ జనరల్ కేటగిరీలో ముగ్గురు, వుమెన్ కేటగిరీలో ఇద్దరు చొప్పున నియమితులయ్యారు. బీసీ–సీ జనరల్, బీసీ–డీ జనరల్, బీసీ–ఈ జనరల్, బీసీ–ఈ వుమెన్ కేటగిరీల్లో ఒక్కొక్కరు చొప్పున నలుగురు ఎంపికయ్యారు. దివ్యాంగుల కేటగిరీలో 3 పోస్టులు భర్తీ చేయ గా ఇందులో అంధుల కోటాలో ఒకరు (బీసీ–బీ), బధిరుల కోటాలో ఒకరు(ఓసీ), ఆర్థో కోటాలో ఒకరు (బీసీ–ఈ) చొప్పున నియమితులయ్యారు. -
మైనారిటీ శాఖ పరిధిలో ‘లింగాయత్’ హోదా
న్యూఢిల్లీ: లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా కల్పించే అంశం తమ పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. మైనారిటీ వ్యవహారాల శాఖ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని హోంశాఖ గురువారం వెల్లడించింది. అయితే.. కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున మైనారిటీ హోదాపై ఇప్పట్లో నిర్ణయం తీసుకోబోమని హోంశాఖ ప్రతినిధి తెలిపారు. ‘మత హోదాపై నిర్ణయం తీసుకోవటం హోంశాఖ పరిధిలోకి రాదు. అందుకే దీన్ని మైనారిటీ వ్యవహారాల శాఖకు బదిలీ చేశాం. కర్ణాటక సర్కారు ప్రతిపాదనను పరిశీలించటం, నిర్ణయం తీసుకోవటంలో మైనారిటీ శాఖకే పూర్తి అధికారాలున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. -
కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా రాజీవ్ మహర్షి
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా రాజీవ్ మహర్షి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అర్వింద్ మాయారామ్ స్థానంలో వచ్చిన రాజీవ్ 1978 బ్యాచ్ ఐఏఎస్ రాజస్థాన్ కేడర్ ఆఫీసర్, అర్వింద్ మాయారామ్, రాజీవ్ మహర్షి ఇద్దరూ బ్యాచ్మేట్లు కావడం విశేషం. సంస్కరణలకు అనుకూలవాది అని పేరుబడ్డ రాజీవ్ మహర్షి రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు కార్మిక చట్టాలకు సవరణల విషయంలో చురుకుగా వ్యవహరించారు. అర్వింద్ మాయారామ్ను మొదటగా పర్యాటక శాఖకు, ఆ తర్వాత మైనారిటీ వ్యవహారాల శాఖకు బదిలీ చేశారు. ఆర్థిక శాఖలో మొత్తం ఐదుగురు కార్యదర్శులుం టారు. వారు.. ఆర్థిక వ్యవహారాలు, వ్యయ, రెవెన్యూ, డిజిన్వెస్ట్‌మెంట్, ఆర్థిక సేవలు. వీరందరిలోకి సీనియర్ అధికారి ఆర్థిక కార్యదర్శిగా(ప్రస్తుతం రాజీవ్) వ్యవహరిస్తారు. ప్రస్తుతం వ్యయ కార్యదర్శిగా రతన్ పి. విఠల్, ఆర్థిక సేవల కార్యదర్శిగా గుర్దయాళ్ సింగ్ సంధు, రెవెన్యూ కార్యదర్శిగా శక్తికాంత దాస్, డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శిగా ఆరాధన జోహ్రిలు వ్యవహరిస్తున్నారు.