‘అస్కి’ని నిత్యనూతనంగా నిలబెడతాం | Padmanabhayya sakshi interview | Sakshi
Sakshi News home page

‘అస్కి’ని నిత్యనూతనంగా నిలబెడతాం

Published Thu, Dec 22 2016 3:16 AM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM

‘అస్కి’ని నిత్యనూతనంగా నిలబెడతాం

‘అస్కి’ని నిత్యనూతనంగా నిలబెడతాం

‘సాక్షి’ ఇంటర్వ్యూలో పద్మనాభయ్య

దేశంలోనే తొలి మేనేజ్‌మెంట్‌ శిక్షణ కేంద్రమైన ‘అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా’ (అస్కి)ని కాలానుగుణంగా నిత్యనూతనంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని సంస్థ కోర్ట్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్మన్, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలన వ్యవస్థ సామర్థ్యం పెంపు, పథకాల అమలు, పరిశోధన, ఉన్నతాధికారులకు నాయకత్వ శిక్షణ తదితరాల్లో పేరున్న అస్కి బుధవారంతో 60 వసంతాలు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు...

అస్కి 60 ఏళ్ల ప్రస్థానంపై....
దేశంలోనే తొలి మేనేజ్‌మెంట్‌ సంస్థగా 1956లో పురుడు పోసుకుంది మొదలు నేటిదాకా అస్కి ఎన్నో మైలురాళ్లు దాటింది. దేశ పురోగతిలో తనవంతు పాత్ర పోషిస్తూ వస్తోం ది. అనేకానేక ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయానికి, ఉన్నతాధికారుల మధ్య సత్సం బంధాల సాధనకు, నాయకత్వ, నైపుణ్య శిక్షణలకు వేదికగా మారింది. పథకాల అమలు తీరుతెన్నులు, లోటుపాట్లను విశ్లేషించి, పలు అంశాలపై పరిశోధన చేసి ప్రభుత్వాలకు నివేదిస్తాం. ఎంతో అనుభవమున్న నిపుణులున్నారిక్కడ. సార్క్‌ దేశాల నుంచి అధికార బృం దాలు శిక్షణకు వస్తాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, యునిసెఫ్, యూరోపియన్‌ యూనియన్‌ అస్కి సేవలను వినియోగించుకుంటున్నాయి! మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌కు చెందిన దాతృత్వ సంస్థ బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌కు కూడా అస్కి కన్సల్టెన్సీ సేవలందిస్తోంది.

ఆర్థిక కష్టాలను అధిగమించాం
ప్రభుత్వాల నుంచి అస్కి రూపాయి సాయం కూడా పొందదు. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు సొంతగా సిబ్బంది శిక్షణ కాలేజీలు ప్రారంభించుకోవడం మొదలవడంతో మా సేవలకు డిమాండ్‌ తగ్గింది. 2011 నుంచి ఐదేళ్లు వరుసగా నష్టాలే. 2014–15లో రూ.3.8 కోట్ల నషమొచ్చింది. సంస్థ సేవలు వాడుకునే వారి సంఖ్య పెంచడం, కోర్సులను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చడంపై దృష్టి పెట్టాం. అస్కిలో శిక్షణ పొంది ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులతో మాట్లాడి, మా సేవలు వాడుకునేలా ఒప్పించాం. 2015– 16 ముగిసేసరికి రూ.58 లక్షల లాభం వచ్చిం ది. 2015–16లో రూ.1.5 కోట్ల లాభం ఆశిస్తున్నాం. లాభాలు ముఖ్యం కాదు. సంస్థ దీర్ఘకాల మనుగడకు ఆర్థిక పరిపుష్టత అవసరం. పూర్వవైభవం దిశగా వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది.
    – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement