Government-owned companies
-
‘అస్కి’ని నిత్యనూతనంగా నిలబెడతాం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో పద్మనాభయ్య దేశంలోనే తొలి మేనేజ్మెంట్ శిక్షణ కేంద్రమైన ‘అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా’ (అస్కి)ని కాలానుగుణంగా నిత్యనూతనంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని సంస్థ కోర్ట్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలన వ్యవస్థ సామర్థ్యం పెంపు, పథకాల అమలు, పరిశోధన, ఉన్నతాధికారులకు నాయకత్వ శిక్షణ తదితరాల్లో పేరున్న అస్కి బుధవారంతో 60 వసంతాలు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు... అస్కి 60 ఏళ్ల ప్రస్థానంపై.... దేశంలోనే తొలి మేనేజ్మెంట్ సంస్థగా 1956లో పురుడు పోసుకుంది మొదలు నేటిదాకా అస్కి ఎన్నో మైలురాళ్లు దాటింది. దేశ పురోగతిలో తనవంతు పాత్ర పోషిస్తూ వస్తోం ది. అనేకానేక ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయానికి, ఉన్నతాధికారుల మధ్య సత్సం బంధాల సాధనకు, నాయకత్వ, నైపుణ్య శిక్షణలకు వేదికగా మారింది. పథకాల అమలు తీరుతెన్నులు, లోటుపాట్లను విశ్లేషించి, పలు అంశాలపై పరిశోధన చేసి ప్రభుత్వాలకు నివేదిస్తాం. ఎంతో అనుభవమున్న నిపుణులున్నారిక్కడ. సార్క్ దేశాల నుంచి అధికార బృం దాలు శిక్షణకు వస్తాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, యునిసెఫ్, యూరోపియన్ యూనియన్ అస్కి సేవలను వినియోగించుకుంటున్నాయి! మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌కు చెందిన దాతృత్వ సంస్థ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌కు కూడా అస్కి కన్సల్టెన్సీ సేవలందిస్తోంది. ఆర్థిక కష్టాలను అధిగమించాం ప్రభుత్వాల నుంచి అస్కి రూపాయి సాయం కూడా పొందదు. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు సొంతగా సిబ్బంది శిక్షణ కాలేజీలు ప్రారంభించుకోవడం మొదలవడంతో మా సేవలకు డిమాండ్ తగ్గింది. 2011 నుంచి ఐదేళ్లు వరుసగా నష్టాలే. 2014–15లో రూ.3.8 కోట్ల నషమొచ్చింది. సంస్థ సేవలు వాడుకునే వారి సంఖ్య పెంచడం, కోర్సులను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చడంపై దృష్టి పెట్టాం. అస్కిలో శిక్షణ పొంది ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులతో మాట్లాడి, మా సేవలు వాడుకునేలా ఒప్పించాం. 2015– 16 ముగిసేసరికి రూ.58 లక్షల లాభం వచ్చిం ది. 2015–16లో రూ.1.5 కోట్ల లాభం ఆశిస్తున్నాం. లాభాలు ముఖ్యం కాదు. సంస్థ దీర్ఘకాల మనుగడకు ఆర్థిక పరిపుష్టత అవసరం. పూర్వవైభవం దిశగా వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ట్యాక్స్ ఫ్రీ బాండ్ల ద్వారా రూ.40,000 కోట్లు!
ఏడు ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం అనుమతి న్యూఢిల్లీ : పన్ను రహిత బాండ్ల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) రూ.40,000 కోట్లు సమీకరించుకోడానికి కేంద్రం ఏడు ప్రభుత్వ రంగ సంస్థలకు అనుమతి ఇచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఒక నోటిఫికేషన్లో ఈ విషయాలను వెల్లడించింది. ఆ ఏడు సంస్థలు... నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) రూ.24,000 కోట్ల సమీకరణకు అనుమతి ఉంది. ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) రూ.6,000 కోట్లు సమీకరించుకోవచ్చు. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్యూడీసీ) రూ.5,000 కోట్లు సమీకరించుకునే వీలుంది. ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ అథారిటీ విషయంలో ఈ పరిమితి రూ.2,000 కోట్లు. ఎన్టీపీసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్లు రూ. 1,000 కోట్లు చొప్పున సమీకరించుకోవచ్చని నోటిఫికేషన్ వెల్లడించింది. బాండ్లకు కాలపరిమితి 10,15,20 ఏళ్లుగా ఉంటుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ రేట్లకు అనుగుణంగా వడ్డీరేట్లుంటాయి. రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లు, కార్పొరేట్లు, ట్రస్టీలు, పార్ట్నర్షిప్ సంస్థలు, లిమిటెడ్ లయబులిటీ పార్ట్నర్షిప్ సంస్థలు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఇతర చట్టబద్ద సంస్థలు బాండ్లు కొనుగోలు చేయవచ్చు. -
వీరికి పెంపు వర్తించదు
పదవీ విరమణ వయసు పెంపుపై ఏపీ ఆర్థికశాఖ సర్క్యులర్ హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం పదో షెడ్యూల్లోని శిక్షణ సంస్థలు, తొమ్మిదో షెడ్యూల్లోని సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు వర్తించదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజేయ కల్లం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ వయసును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థలు, అసెంబ్లీ, మండలి సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసు పెంపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చిన 89 సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగలకు కూడా పెంపు వర్తించదని వివరించింది.