padmanabhayya
-
బీచ్ శాండ్ పరిశ్రమలో అవకాశాలు అపారం
సాక్షి, విశాఖపట్నం: బీచ్ శాండ్ ఇండస్ట్రీలో అపారమైన అవకాశాలున్నాయని.. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను మార్చేఖనిజాలు బీచ్ సొంతమని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, కేంద్ర పెట్రోలియం నేచురల్ గ్యాస్ మాజీ జాయింట్ సెక్రటరీ, ఆస్కీ చైర్మన్ పద్మభూషణ్ ప్రొ.పద్మనాభయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ తీరంలోనూ అపారమైన తీర ప్రాంత ఖనిజ సంపద ఉందని పలు అధ్యయనాలు వెల్లడించాయన్నారు.అవసరమైన మేరకే ఖనిజాలు వెలికితీస్తే మంచిదని.. అదే సమయంలో అక్రమ మైనింగ్ నియంత్రించాలి్సన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. లేదంటే పర్యావరణ విఘాతం తప్పదని హెచ్చరించారు. కేంద్ర మైనింగ్ మంత్రిత్వ శాఖ, ఏపీ మినరల్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలో కరెంట్ ట్రెండ్స్ ఇన్ మైనింగ్, బీచ్ శాండ్ ఇండస్ట్రీలో ఉన్న అవకాశాలు అనే అంశంపై శుక్రవారం ఏయూలో జాతీయస్థాయి సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొ. పద్మనాభయ్య ‘సాక్షి’తో పలు అంశాలు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..దేశంలో 130 బీచ్ మైనింగ్ డిపాజిట్స్..దేశంలోని తీర ప్రాంతాల్లో 130 మైనింగ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఒడిశాలోని ఛత్రపూర్, తమిళనాడులోని మనవల్లకురిచి, కేరళలోని చేవరాలో మాత్రమే పనులు నడుస్తున్నాయి. అన్ని మైనింగ్ బ్లాక్స్‌ను ప్రారంభిస్తే అద్భుతంగా ఉంటుంది. నిజానికి.. బీచ్ శాండ్ మైనింగ్ ఇండస్ట్రీలో మేజర్ గ్లోబల్ ప్లేయర్‌గా భారత్ మారేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడాలేని అత్యంత విలువైన నాణ్యమైన అరుదైన ఖనిజ సంపద భారత సాగర తీరంలో ఉంది. అద్భుతమైన ఎలిమినైట్ ఖనిజం నిల్వలున్న దేశంగా మూడో స్థానంలో ఉంది. అదేవిధంగా.. మన దేశ తీర ప్రాంతంలో మోనోజైట్ ఖనిజం కూడా అత్యధికంగా లభ్యమవుతుంది. ఇవన్నీ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వెలికితీసే ప్రక్రియ ప్రారంభిస్తే.. భారత్ ప్రపంచంలోనే మంచి స్థానంలో ఉంటుంది. ప్రభుత్వాలే ఖనిజ సంపదను వెలికితీసే బాధ్యతని భుజానికెత్తుకోవాలి. ముఖ్యంగా పీపీపీ విధానాన్ని ఇందులో అవకాశాలు కల్పించాలి. అప్పుడే అక్రమ మైనింగ్‌ని నిరోధించవచ్చు. అలాగే, బీచ్ శాండ్ అక్రమ తవ్వకాలపై నమోదవుతున్న కేసుల విచారణ ఆలస్యమవుతుండటం విచారకరం. వీలైనంత త్వరగా.. ఈ తరహా అక్రమ కేసుల విచారణ వేగవంతమైతే వీటిని నియంత్రించే అవకాశం ఉంటుంది. -
మాజీ IAS పద్మనాభయ్యతో మనసులో మాట
-
‘అస్కి’ని నిత్యనూతనంగా నిలబెడతాం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో పద్మనాభయ్య దేశంలోనే తొలి మేనేజ్మెంట్ శిక్షణ కేంద్రమైన ‘అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా’ (అస్కి)ని కాలానుగుణంగా నిత్యనూతనంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని సంస్థ కోర్ట్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలన వ్యవస్థ సామర్థ్యం పెంపు, పథకాల అమలు, పరిశోధన, ఉన్నతాధికారులకు నాయకత్వ శిక్షణ తదితరాల్లో పేరున్న అస్కి బుధవారంతో 60 వసంతాలు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు... అస్కి 60 ఏళ్ల ప్రస్థానంపై.... దేశంలోనే తొలి మేనేజ్మెంట్ సంస్థగా 1956లో పురుడు పోసుకుంది మొదలు నేటిదాకా అస్కి ఎన్నో మైలురాళ్లు దాటింది. దేశ పురోగతిలో తనవంతు పాత్ర పోషిస్తూ వస్తోం ది. అనేకానేక ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయానికి, ఉన్నతాధికారుల మధ్య సత్సం బంధాల సాధనకు, నాయకత్వ, నైపుణ్య శిక్షణలకు వేదికగా మారింది. పథకాల అమలు తీరుతెన్నులు, లోటుపాట్లను విశ్లేషించి, పలు అంశాలపై పరిశోధన చేసి ప్రభుత్వాలకు నివేదిస్తాం. ఎంతో అనుభవమున్న నిపుణులున్నారిక్కడ. సార్క్ దేశాల నుంచి అధికార బృం దాలు శిక్షణకు వస్తాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, యునిసెఫ్, యూరోపియన్ యూనియన్ అస్కి సేవలను వినియోగించుకుంటున్నాయి! మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌కు చెందిన దాతృత్వ సంస్థ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌కు కూడా అస్కి కన్సల్టెన్సీ సేవలందిస్తోంది. ఆర్థిక కష్టాలను అధిగమించాం ప్రభుత్వాల నుంచి అస్కి రూపాయి సాయం కూడా పొందదు. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు సొంతగా సిబ్బంది శిక్షణ కాలేజీలు ప్రారంభించుకోవడం మొదలవడంతో మా సేవలకు డిమాండ్ తగ్గింది. 2011 నుంచి ఐదేళ్లు వరుసగా నష్టాలే. 2014–15లో రూ.3.8 కోట్ల నషమొచ్చింది. సంస్థ సేవలు వాడుకునే వారి సంఖ్య పెంచడం, కోర్సులను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చడంపై దృష్టి పెట్టాం. అస్కిలో శిక్షణ పొంది ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులతో మాట్లాడి, మా సేవలు వాడుకునేలా ఒప్పించాం. 2015– 16 ముగిసేసరికి రూ.58 లక్షల లాభం వచ్చిం ది. 2015–16లో రూ.1.5 కోట్ల లాభం ఆశిస్తున్నాం. లాభాలు ముఖ్యం కాదు. సంస్థ దీర్ఘకాల మనుగడకు ఆర్థిక పరిపుష్టత అవసరం. పూర్వవైభవం దిశగా వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పెద్దనోట్లపై అపోహల తొలగింపునకు సదస్సులు
బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై ప్రజల్లో అవగాహనను కల్పించడంతో పాటు అపోహలు తొలగించేందుకు సదస్సులను నిర్వహిస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ తెలిపారు. పార్టీ పాలసీ రీసెర్చ్ గ్రూప్ ఆధ్వర్యంలో శనివారం ‘‘పెద్ద నోట్ల రద్దు-ఆవశ్యకత, ప్రభావం, పరిణామాలు’’అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశ బాగోగుల కోసం తీసుకున్న నిర్ణయమని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇదెంతో ఉపకరిస్తుందన్నారు. ఈ నిర్ణయం దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలగకుండా సేవలందించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నల్లధనం, అవినీతి నియంత్రణకు మోదీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని విపక్షాలు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో న్యాయ, బ్యాంకింగ్, పోలీస్, ఆర్థిక నిపుణులను భాగస్వాములను చేసి ప్రజల అపోహలను దూరం చేసేందుకు పార్టీ ఆధ్వర్యంలో చర్చా గోష్టులను నిర్వహిస్తు న్నామన్నారు. రూ. 2వేల నోటు ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలి ఈ సదస్సులో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మళ్లీ రూ.2 వేల నోటును ఎందుకు తీసుకొచ్చారో చెప్పాల్సి ఉందని అన్నారు. వివిధ ప్రజావసరాలకు ప్రజలు చెల్లించే బిల్లులను రెండు నెలల పాటు వారుుదా వేయాలని సూచించారు. దేశానికి పట్టిన కుళ్లు వదలాలంటే మోదీ మరో రెండు పర్యాయాలు గెలవాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి అభిప్రాయపడ్డారు. మోడీకి సంకల్పం, ధైర్యం రెండూ ఉన్నారుు కాబట్టి ఈ నిర్ణయాన్ని అమలు చేయగలిగారన్నారు. మోదీ కారణజన్ముడని.. ఇది అతిశయోక్తి ఎంతమాత్రం కాదని అన్నారు. పెద్దనోట్ల రద్దుతో ఉగ్రవాదులు, విభజన శక్తులు జమ్మూ కశ్మీర్లోనో, మరోచోటో ఏదో ఒక చర్యకు దిగే అవకాశం ఉందని మాజీ డీజీపీ అరవిందరావు అభిప్రాయపడ్దారు. ఈ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోదని, రియల్ ఎస్టేట్ అసంఘటిత రంగంపై కొంత ప్రభావం పడుతుందని క్రెడాయ్ మాజీ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి అన్నారు. బీజేపీ పాలసీ రీసెర్చ్ గ్రూప్ కన్వీనర్ జీఆర్ కరుణాకర్ అధ్యక్షతన జరిగిన ఈ గోష్టిలో ఎస్బీఎం మాజీ ఎండీ ఎం. సీతారామమూర్తి, ఆర్థిక నిపుణులు కె.నరసింహమూర్తి, పారిశ్రామికవేత్త అనిల్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు జి. వల్లీశ్వర్, ప్రొ. వాసుదేవాచారి (ఓయూ) తదితరులు పాల్గొన్నారు.