
అధిష్టానం నుంచి పిలుపు, శుక్రవారం ఢిల్లీకి కిరణ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. దాంతో ఆయన శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. దాంతో ఆయన శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో కేంద్ర హోం శాఖ అన్ని పార్టీలతో సమావేశమవుతున్న నేపథ్యంలో సీఎంకు పిలుపురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరోవైపు తాను ఫోన్ చేసినా అధిష్టానం ప్రతినిధులు స్పందించడం లేదని ముఖ్యమంత్రి వాపోతున్న సందర్భంలో ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. సమైక్యవాదినని గట్టిగా చెప్పుకుంటున్న కిరణ్... ఢిల్లీ పెద్దలతో ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.