
న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ మంజూరులో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) జారీ జాప్యాన్ని నివారించేందుకు కేంద్ర హోం శాఖ కొత్త విధానాన్ని ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులే నేరుగా పీసీసీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫలితంగా పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారులు వివరాలను స్థానిక పోలీసులకు పంపించి వాకబు చేసే అవసరం తగ్గి సమయం ఆదా అవుతుంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది.
చదవండి: అన్యాయంపై పోరాటానికే.. జోడో యాత్ర: రాహుల్