సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థత ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఘటనకు సంబంధించిన వివరాలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరాతీశారు. ఈమేరకు ఆదివారం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఫోన్‌లో చర్చించారు. అవసరం మేరకు కేంద్ర వైద్య బృందం సహాయం అందించేందకు సిద్ధంగా ఉందన్నారు. ఆస్పత్రిలో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
కాగా, ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య ఇప్పటివరకు 270కి చేరింది. అస్వస్థతకు గురైన బాధితులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఇప్పటివరకు 117 మందిని డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం పదిమందిని అధికారులు విజయవాడ తరలించారు. బాధితులకు వైద్యసిబ్బంది అలుపెరగకుండా సేవలు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment