
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెండో దశ లాక్‌డౌన్ మే 3వ తేదీన ముగియనుంది. కానీ, కరోనా పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోగా, కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నానాటికీ దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో లాక్‌డౌన్ పొడిగించక తప్పదని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో చెప్పుకోదగ్గ మినహాయింపులు ఇస్తారని సమాచారం. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం సంకేతాలు ఇచ్చింది. ఇప్పటిదాకా అమలు చేసిన లాక్‌డౌన్‌తో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొంది. లాక్‌డౌన్‌తో ఇప్పటికే మనం సాధించింది నిష్ఫలం కాకుండా ఉండాలంటే మరికొన్ని రోజులు ఓర్చుకోక తప్పదని కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment