
చొరబాట్ల నియంత్రణకు లేజర్ గోడలు
భారత్-పాకిస్తాన్ సరిహద్దులో చొరబాట్లను అడ్డుకునేందుకు లేజర్ గోడలను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
గురుదాస్‌పూర్: భారత్-పాకిస్తాన్ సరిహద్దులో చొరబాట్లను అడ్డుకునేందుకు లేజర్ గోడలను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సాధారణ కంచె నిర్మించడం సాధ్యం కాని నదీ ప్రవాహ, పర్వత ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మరో ఏడాదిలో ఈ పనిని పూర్తి చేస్తామని చెప్పారు.
పంజాబ్‌లో ఇప్పటికే 12 లేజర్ గోడలను ఏర్పాటు చేసి వాడుకలోకి తెచ్చినట్లు ఆయన సమాచారమిచ్చారు. వీటిని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) పర్యవేక్షిస్తుంది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్‌ల్లో పాక్ సరిహద్దు వద్ద బీఎస్‌ఎఫ్ జవాన్లే పహారా కాస్తుంటారు.