బాబీ సింహా, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘రజాకర్’. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీ భాషల్లో విడుదల కావాల్సింది. అయితే వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తి కాకపోవడం వల్ల వాయిదా వేసినట్లు శనివారం యూనిట్ ప్రకటించింది.
మార్చి 15న రిలీజ్ చేస్తామని తెలిపారు. ‘‘మా చరిత్ర.. మా పూర్వీకుల బాధలు, త్యాగాలు.. ఈ గడ్డ కోసం పోరాడిన వాళ్ల చరిత్ర చెప్పడానికే ఈ సినిమా తీశాను. రజాకార్లు చేసిన అన్యాయాల గురించి చెప్పేందుకే సినిమా చేశాం’’ అని ఇటీవల యాటా సత్యనారాయణ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment