తెలంగాణలో రజకార్ల దాడి నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ‘రజాకార్’. యాటా సత్యానారాయణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు. బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనసూయ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి బతుకమ్మ పాటను విడుదల చేశారు.
భారతి భారతి ఉయ్యాల అంటూ సాగే ఈ పాట కాస్లర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. మోహన భోగరాజు, భీమ్స్ సీసిరోలియో, స్ఫూర్తి జితేందర్ ఆలపించారు. భీమ్స్ సంగీతం అందించాడు. ఈ వీడియో చూస్తుంటే..అనసూయ మరోసారి పవర్‌ఫుల్ పాత్రతో అదరగొట్టినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment