థాయ్‌ల్యాండ్‌లో విలన్లను చితక్కొట్టారు బాలకృష్ణ. ఆ నెక్ట్స్ రెస్ట్ కోసం ప్రేయసితో కలిసి పాటలు పాడారు. బాలకృష్ణ హీరోగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హ్యాపీ మూవీస్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సోనాలీ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా థాయ్‌ల్యాండ్ షెడ్యూల్ ముగిసింది. ఇరవై రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో రెండు పాటలు, కొంత టాకీ పార్టు, భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేశారు. ప్రకాష్‌రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చిరంతన్ భట్, కెమెరా: సి. రామ్‌ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment