ఈడ్చి.. స్విమ్మింగ్‌పూల్‌లో పడేశారు
పార్టీలో శబ్దాన్ని కొంచెం తగ్గించాలని కోరిన ఓ మహిళను కొంతమంది తీవ్రంగా అవమానించారు. రిసార్ట్‌లో పార్టీ చేసుకుంటున్న కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిల బృందం పెద్ద శబ్దంతో మ్యూజిక్‌ను పెట్టింది. దీంతో మిగిలిన వారికి అది ఇబ్బందిగా మారడంతో వారి వద్దకు వెళ్లిన మహిళ సౌండ్ తగ్గించాలని కోరింది.
అందుకు మిగిలిన వారు సమాధానం చెప్పేలోపే గ్రూప్‌లోని ఓ వ్యక్తి ఆమెను స్విమ్మింగ్ పూల్‌లో పడేసేందుకు ఎత్తుకుని జారి పడ్డాడు. ఈ ఘటనలో మహిళ మొహానికి గట్టి దెబ్బ తగిలింది. ఆ తర్వాత వెంటనే లేచిన వ్యక్తి మళ్లీ ఆమెను ఈడ్చుకుంటూ పూల్‌లోకి దూకేశాడు. దీంతో ఒక్కసారిగా మిగతావారంతా అటూఇటూ పరిగెత్తడంతో రిసార్ట్‌లో గందరగోళం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్ వైరల్ అవుతోంది. స్నేహితుల బృందం మహిళ పట్ల ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు విమర్శిస్తున్నారు.