చాలామందికి ఈత కొట్టడం సరదా. నదుల్లోనూ, చిన్ని చిన్న కాలువాల్లో పిల్లలు, పెద్దలు ఈత కొడుతుంటారు. నిజానికి అలాంటి నీటిలో అమీబా వంటి పరాన్న జీవులు ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ అవే ఓ మహిళ కంటి చూపు పోవడానికి కారణమైంది. సాధారణ నొప్పిగా మొదలై ఏకంగా కంటిలోని కార్నియాను తినేసింది. దీంతో ఆమె శాశ్వత అంధురాలిగా మారిపోయింది.
వివరాల్లోకెళ్తే..ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. యూకేలో కెంట్‌కు చెందిన 38 ఏళ్ల షెరీన్ ఫే గ్రిఫిత్ ఎప్పటిలానే పబ్లిక్ స్మిమ్మింగ్‌పూల్‌లో ఈత కొట్టింది. ఐతే రెండు రోజుల తర్వా నుంచి కంటి ఇన్ఫెక్షతో విలవిలలాడింది. తొలుత సాధారణమైందిగా భావించి ఐ డ్రాంప్స్ వంటివి వేసుకుంది. వైద్యులు కూడా నార్మల్ ఇన్ఫెక్షన్‌గానే పరిగణించారు. కానీ రోజురోజుకి ఇన్ఫెక్షన్ తీవ్రమైందే గానీ తగ్గలేదు. పైగా కన్ను చుట్టూ ఉన్న ప్రాంతమంతా వాచి కనురెప్ప తెరవలేని స్థితికి వచ్చేసింది. దీంతో వైద్యులు కంటికి సంబంధించిన అని వైద్య పరీక్షలు నిర్వహించగా అకాంతమీబా కారణంగా ఈ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు గుర్తించారు. దీంతో ఈ నొప్పి, దురద, పుండ్లు కూడిని ఇన్ఫెక్షన్‌న వస్తుందని బాధితురాలు షెరీన్‌కి తెలిపారు.
ఈ ఇన్ఫెక్షన్‌ని తగ్గించేందుకు స్టెరాయిడ్స్, యాంటీ బ్యాక్టీరియల్ ఐ డ్రాప్స్ వంటివి ఇచ్చి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. దురద నొప్పి ఎక్కువై విలవిలలాడింది. ఎందువల్ల ఇలా అయిందని పరీక్షించగా ఆ పరాన్న జీవి అకాంతమీబా షెరీన్ కంటిలోని కార్నియాను తినేసినట్లు గుర్తించారు. దీంతో ఆమె కంటి చూపుని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆమె ఆమె నొప్పి, దురద పుండ్లు వంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. అంతేగాదు తాను కంటి చూపుని కోల్పోడం వల్ల తన దైనందిన కార్యక్రమాలను వేటిని చేసుకోలేకపోతున్నట్లు ఆవేదనగా వివరించింది.
కాగా, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం అకాంతమీబా సాధారణంగా సరస్సులు, మహాసముద్రాలు, మట్టి వంటి నీటి వనరుల్లో కనిపిస్తుంది. ఇది పంపు నీరు, వెంటిలేటింట్ , ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు, కొలనుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కంటికి కాంటాక్ట్ లెన్స్ ధరించడం వల్ల గానీ చిన్న చిన్న కంటి గాయాల ద్వారా గానీ కన్నులోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలుగజేస్తుందని పేర్కొంది. ఇవి నేరుగా కళ్లపై దాడి చేసి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. అయితే నీరు తాగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ రాదని, అలాగే ఇది అంటువ్యాధి కూడా కాదని వైద్యులు చెబుతున్నారు. ఐతే ఈ ఇన్ఫెక్షన్‌కి చికిత్స అందించడం చాల కష్టమని అన్నారు.
ఈ ఇన్షెక్షన్ సోకే ముందు కనిపించే లక్షణాలు..
- అస్పష్టంగా కనిపించడం లేదా దృష్టి కోల్పోవడం
- మేఘావృతమైన కార్నియా
- తీవ్రమైన కంటినొప్పి
- కళ్లలో ఎరుపు
- నీళ్లు నిండిన కళ్లు
- కంటి ఉపరితలంపై తెల్లటి వలయాలు
- అయితే అకాంతమీబా కంటిలోకి ప్రవేశించిన చాలా రోజుల వరకు దాని లక్షణాలు బయటపడవని వైద్యుల చెబుతున్నారు.
(చదవండి: భోజనం చేసిన వెంటనే పండ్లు తింటున్నారా? ఆరోగ్య నిపుణుల ఏం చెబుతున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment