
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రపంచంలోని అత్యుత్తమ సంగీత ప్రదర్శన ‘ది ఫాంటమ్ ఆఫ్ ది ఒపెరా’ని ప్రదర్శించనుంది. ఇది ఒక ఐకానిక్ లవ్ స్టోరీకి సంబంధించిన సంగీతం. మార్చి 05, 2025న ముంబైలోని గ్రాండ్ థియేటర్ నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్(ఎన్‌ఎంఏసీసీ)లో ప్రదర్శించనున్నారు.
ఈ సందర్భంగా ఎన్‌ఎంఏసీసీ చైర్మన్ నీతా అంబానీ మాట్లాడుతూ.. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచంలోని అత్యుత్తమమైన సంగీతాన్ని భారతీయ ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ఉన్నాం. ప్రస్తుతం ఈ కల్చర్ సెంటర్ రెండొవ వార్షికోత్సవానికి చేరుకున్న నేపథ్యంలో థియేట్రికల్ అద్భుతం 'ది ఫాంటమ్ ఆఫ్ ది ఒపెరాను ప్రదర్శించనున్నాం అని ప్రకటిస్తున్నాందుకు చాలా సంతోషంగా ఉంది." అని నీతా ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఈ సంగీత ప్రదర్శనను వీక్షించేందుకు అందురూ రావాలని ఆహ్వానించారు.
బ్రిటన్ ప్రసిద్ధ మ్యూజిక్ కంపోజర్ లాయిడ్ వెబ్బర్ దీనికి సంగీతాన్ని అందించారు. 1910 నవల "ది ఫాంన్‌టాం ఆఫ్ ఒపెరా" ఆధారంగా దీన్ని రూపొందించారు. ఇందులో ఫాంటమ్ అనే ఒక యువ సోప్రానో, క్రిస్టీన్ డాయే అనే అమ్మాయితో ప్రేమలోపడతాడు. ఆ కథ అంతా ప్యారిస్ ఒపేరా హౌస్ క్రింద దాగి ఉన్న వ్యక్తి గురించి చెబుతుంది. ఫాంటమ్ అనే యువ సోప్రానో ఈ ప్యారిస్ హౌస్ కింద ఉంటాడు. అతడిని ముట్టడించే ప్రయత్నం చేస్తుంది క్రిస్టీన్ డాయే. ఇది వారిద్దరి మధ్య సాగే ప్రేమ, ముట్టడి, అందం, రాక్షసత్వం మధ్య సాగిన పోరాటమే ఇతివృత్తంగా ఈ సంగీత ప్రదర్శన ఉంటుంది.
ఈ సంగీత ప్రదర్శన తొలిసారిగా అక్టోబర్ 9, 1986న లండన్ వెస్ట్ ఎండ్‌లోని హర్ మెజెస్టి థియేటర్‌లో ప్రదర్శించారు. ఆ తర్వాత జనవరి 26, 1988న బ్రాడ్‌వేలో మెజెస్టిక్ థియేటర్‌లో ప్రదర్శించడం జరిగింది. అలా మొత్తం 70కి పైగా ప్రధాన థియేటర్ అవార్డులను గెలుచుకున్న గొప్ప సంగీత ప్రదర్శనగా నిలిచింది. మొత్తం 21 భాషల్లో 195 నగరాల్లో 160 మిలియన్ల మందికి పైగా వీక్షించిన ప్రసిద్ధ సంగీత ప్రదర్శన కళగా ఘనత దక్కించుకుంది.
అంతేగాదు బ్రాడ్ వే థియేటర్‌లో ఎక్కువ కాలం ప్రదర్శించిన సంగీత ప్రదర్శనగా కూడా నిలిచింది. ముంబైకి వస్తున్న ఈ సంగీత ప్రదర్శన కళని వీక్షించాలంటే ఎన్‌ఎంఏసీసీ డాట్ కామ్ లేదా బుక్‌మైషో డాట్ కామ్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. టిక్కెట్ ధర రూ. 1250 నుంచి మొదలవ్వుతుంది.
(చదవండి: అందాల రాణి ఐశ్వర్య రాయ్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment