సాక్షి, అమరావతి: 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు వైఎస్సార్‌సీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో విద్యావంతులకు పెద్దపీట వేశారు. వీరిలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, ఇంజినీర్లు, సివిల్ సర్వెంటు, జర్నలిస్టు ఇలా అన్ని రకాల విద్యావంతులకు జాబితాలో సీఎం జగన్ చోటు కల్పించారు. ఈ జాబితాలో మొత్తం 200 మందికి గాను 77 శాతం మంది ఉన్నత విద్యావంతులున్నారు.
175 శాసనసభ స్థానాలకు వైఎస్సార్‌సీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో 131 మంది గ్రాడ్యుయేషన్, ఆపై చదవులు చదివినవారు ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 47 మంది పోస్టు గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ చేసిన వారున్నారు. 13 మంది డాక్టర్లు, 11 మంది లాయర్లు, 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు(ఎ.మహ్మద్ ఇంతియాజ్, ఆదిమూలపు సురేష్), ఒకరు డిఫెన్స్‌లో చేసినవారు (వాసుపల్లి గణేష్కుమార్), ఒక జర్నలిస్టు(కురసాల కన్నబాబు) ఉన్నారు.
ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం డిగ్రీ, ఆపై చదివినవారే..
25 లోక్‌సభ స్థానాలకు వైఎస్సార్‌సీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో 22 మంది (88 శాతం) డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారు ఉన్నారు. ఇందులో 11 మంది పోస్టు గ్రాడ్యుయేషన్, ఇద్దరు డాక్టరేట్ చేసిన వారు ఉన్నారు. లోక్‌సభ అభ్యర్థుల్లో సింహాద్రి చంద్రశేఖరరావు, గూడురి శ్రీనివాసులు, మద్దుల గురుమూర్తి, పి.అనిల్‌కుమార్ యాదవ్‌లు డాక్టర్లు కాగా.. నలుగురు లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్(వి.విజయసాయిరెడ్డి), ఒక మెడికల్ ప్రాక్టిషనర్ ఉన్నారు.
స్థానిక సంస్థల ప్రతినిధులకు అవకాశం
ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న పలువురికి వైఎస్సార్‌సీపీ టికెట్లు కేటాయించింది. మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్యకర్తల్లో 13 మందికి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీకి అవకాశం కల్పించింది. కర్నూలు మేయర్ బీవై రామయ్యకు కర్నూలు ఎంపీగా, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడుకి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్ పిరియ విజయకు ఇచ్ఛాపురం నుంచి అవకాశం కల్పించారు. సాధారణ కార్యకర్తలు లక్కప్ప, వీరాంజనేయులుకు మడకశిర, శింగనమల నుంచి పోటీకి అవకాశం కల్పించారు.
పార్టిలో క్రియాశీల కార్యకర్తగా పనిచేసిన గూడూరి ఉమాబాలకు నరసాపురం ఎంపీ సీటు కేటాయించారు. కడప జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి రాజంపేట్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. జెడ్పీటీసీ సర్నల తిరుపతిరావుకు మైలవరం టికెట్ కేటాయించారు. వైఎస్సార్‌సీపీ నేత బలసాని కిరణ్‌కుమార్ ప్రత్తిపాడు నుంచి, గృహిణి మురుగుడు లావణ్య మంగళగిరి నుంచి పోటీç³డుతున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తిరుపతి నుంచి, నెల్లూరు సిటీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ నెల్లూరు నుంచి, జెడ్పీటీసీ బూసినే విరూపాక్ష ఆలూరు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment