list of candidates
-
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల మరో జాబితా విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, పార్లమెంటు ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఆరు లోక్‌సభ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు 1. విశాఖపట్నం – పులుసు సత్యనారాయణరెడ్డి 2. అనకాపల్లి – వేగి వెంకటేశ్ 3. ఏలూరు – కావూరి లావణ్య 4. నరసరావుపేట – గార్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ 5. నెల్లూరు – కొప్పుల రాజు 6. తిరుపతి (ఎస్సీ) – డా.చింతా మోహన్ అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు: 1. టెక్కలి – కిల్లి కృపారాణి 2. భీమిలి – అడ్డాల వెంకటవర్మ రాజు 3. విశాఖపట్నం సౌత్ – వాసుపల్లి సంతోష్ 4. గాజువాక – లక్కరాజు రామారావు 5. అరకు లోయ (ఎస్టీ)– శెట్టి గంగాధరస్వామి 6. నర్సీపట్నం – ఆర్. శ్రీరామమూర్తి 7. గోపాలపురం (ఎస్సీ) – సోడదాసి మార్టిన్ లూథర్ 8. యర్రగొండపాలెం (ఎస్సీ) – డా.బూదాల అజితరావు 9. పర్చూరు – నల్లగొర్ల శివ శ్రీలక్ష్మీ జ్యోతి 10. సంతనూతలపాడు (ఎస్సీ) – విజేష్‌రాజ్ పాలపర్తి 11. గంగాధర నెల్లూరు (ఎస్సీ) – రమేష్‌బాబు దెయ్యాల 12. పూతలపట్టు (ఎస్సీ) – ఎం.ఎస్.బాబు -
ఎట్టకేలకు దేశం ఆఖరి జాబితా
సాక్షి, అమరావతి: టీడీపీ అభ్యర్థుల తుది జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎట్టకేలకు ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న 9 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ఖరారు చేశారు. దీంతో 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో 94 సీట్లు ప్రకటించినా పి.గన్నవరం అభ్యర్థి రాజేష్‌ని అన్ని వర్గాలు వ్యతిరేకించడంతో ఆయనకు సీటు ఉపసంహరించారు. ఈ జాబితాలోనే అనపర్తి, అరకు సీట్లు ఖరారు చేసినా అవి రెండు బీజేపీకి వెళ్లడంతో వాటిని వదులుకున్నారు. రెండో జాబితాలో ఖరారు చేసిన కదిరి స్థానంలో తాజాగా మార్పులు చేశారు. మొదటి జాబితాలో 13 ఎంపీ స్థానాలకు ప్రకటించగా పొత్తులో మిగిలిన నాలుగు సీట్లకు ఇప్పుడు అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో టీడీపీ పోటీ చేసే చోట్ల మొత్తం అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. చీపురుపల్లికి కళా వెంకట్రావు చీపురుపల్లి సీటును చివరికి రాష్ట్ర టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు అంటగట్టారు. ఓడిపోయే ఆ స్థానంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును పోటీ చేయించడానికి ఎంత ప్రయత్నించినా ఆయన అంగీకరించలేదు. దీంతో కళా వెంకట్రావును అక్కడ పోటీ చేయించాలని నిర్ణయించారు. ఆయన ఇన్ఛార్జిగా ఉన్న ఎచ్చెర్ల సీటు పొత్తులో బీజేపీకి కేటాయించడంతో కళాకు చీపురుపల్లి సీటు ఇచ్చారు. దీనికి ఆయన చాలారోజులు ఒప్పుకోకపోయినా బుజ్జగించి ఖరారు చేశారు. విశాఖ జిల్లా భీమిలి సీటు కోసం మొదటి నుంచి గట్టిగా పట్టుబడిన గంటా చివరికి దాన్ని దక్కించుకున్నారు. ఒక దశలో ఆ సీటు జనసేనకు వెళ్లే పరిస్థితి ఏర్పడగా గంటా పెద్దఎత్తున లాబీయింగ్ చేయడంతోపాటు భారీగా డబ్బులిచ్చి విశాఖ జిల్లాలో నాలుగు స్థానాల ఆర్థిక బాధ్యతలు కూడా చూసుకునేందుకు ముందుకు రావడంతో ఆయనకే సీటు ఇచ్చినట్లు తెలుస్తోంది. అరకు జిల్లా పాడేరు (ఎస్టీ) స్థానాన్ని కిల్లు వెంకట రమేష్‌నాయుడుకి ఇచ్చారు. మొదట ఈ సీటును బీజేపీకి కేటాయించే ఉద్దేశంతో అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ బీజేపీ అరకు సీటును తీసుకోవడంతో ఆ స్థానంలో ఖరారు చేసిన దొన్నుదొర అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఉపసంహరించుకుంది. దాని బదులు ఇప్పుడు పాడేరు స్థానంలో అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థి దొరకని దర్శి స్థానానికి బయట ప్రాంతం నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని దిగుమతి చేసుకుని సీటు కేటాయించారు. అసంతృప్త నేత సుబ్రహ్మణ్యంకు రాజంపేట రాయచోటి ఎమ్మెల్యే, రాజంపేట ఎంపీ సీట్లలో ఏదీ దక్కక తీవ్ర అసంతృప్తితో ఉన్న సుగవాసి సుబ్రహ్మణ్యంకు రాజంపేట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న భత్యాల చెంగల్రా యుడు, జగన్మోహనరావుకు షాక్ తగిలింది. కర్నూలు జిల్లా ఆలూరు స్థానాన్ని వీరభద్రగౌడ్‌కి కేటాయించి కోట్ల సుజాతమ్మకు షాక్ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ఆ లూరు సీటు ఇవ్వకపోవడంతో టీడీపీలోకి ఫిరాయించిన గుమ్మనూరు జయరామ్‌కి గుంతకల్లు టికెట్ ఇ చ్చారు. అనంతపురం అర్బన్ సీటును దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కి కేటాయించి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరికి ఝలక్ ఇచ్చారు. అనంతపురం జిల్లా కదిరి స్థానంలోనూ మార్పు చేశారు. ఈ స్థానాన్ని ఆశించిన కందికుంట ప్రసాద్‌పై నకిలీ డీడీల కేసు ఉండడంతో రెండో జాబితాలో ఆయన భార్య యశోదా దేవికి సీటు ఇచ్చారు. అయితే ప్రసాద్‌పై కేసును కోర్టు కొట్టివేయడంతో యశోదాదేవి బదులు ఇప్పుడు ప్రసాద్‌కి సీటు ఖరారు చేశారు. కడపలో ఫలించని బాబు తంత్రం పెండింగ్‌లో ఉన్న నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఎచ్చెర్ల సీటు దక్కక అసంతృప్తితో ఉన్న కలిశెట్టి అప్పలనాయుడికి విజయనగరం ఎంపీ సీటును కేటాయించారు. ఒంగోలు సీటును ఫిరాయింపు నేత మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఖరారు చేశారు. అనంతపురం ఎంపీ స్థానాన్ని అంబికా లక్ష్మీ నారాయణకు ఇచ్చి జేసీ కుటుంబానికి షాక్ ఇచ్చారు. జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌రెడ్డి ఈ సీటు కోసం లాబీయింగ్ చేసినా ఫలితం దక్కలేదు. కడప ఎంపీ సీటును జమ్మలమడుగు ఇన్‌ఛార్జి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డికి కేటాయించారు. జమ్మలమడుగు సీటు బీజేపీకి వెళ్లడంతో భూపేష్ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. బీజేపీ నేత, తన బాబాయి ఆదినారాయణరెడ్డిపై ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉండడంతో తప్పని పరిస్థితుల్లో కడప ఎంపీ సీటు ఇచ్చారు. వైఎస్ వివేకా హత్యోదంతాన్ని అడ్డు పెట్టుకుని కడప ఎంపీ సీటుపై రాజకీయం చేయాలని ప్రయత్నించిన చంద్రబాబు చివరికి అభాసుపాలై అసంతృప్త నేతకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. -
ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ: పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ, జనసేనలతో పొత్తు ఒప్పందంలో బీజేపీకి కేటాయించిన ఆరు లోక్‌సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకు సిద్ధంచేసిన జాబితాకు ఆమోదముద్ర పడింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో గత కొన్నిరోజులుగా రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేసి సిద్ధంచేసిన అభ్యర్థుల జాబితాపై కూలంకషంగా చర్చించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ఎంపీ డా. కె.లక్ష్మణ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ.. సీఈసీ భేటీలో ఏపీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ సహా మొత్తం 11 రాష్ట్రాల నాయకత్వాలు సిద్ధంచేసిన లోక్‌సభ అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలపై వారితో విడివిడిగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజులు ఈ భేటీలో పాల్గొన్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ కేటాయించిన ఆరు స్థానాల విషయంలో రాష్ట్ర సీనియర్ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలో ఎవరి అభ్యర్థిత్వానికి అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందనే అంశంపై ఆసక్తి నెలకొంది. పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం.. రాజమండ్రి, రాజంపేట, అమలాపురం, తిరుపతి, అరకు, నరసాపురం, విజయనగరం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారన్న ఊహాగానాల నేపథ్యంలో ఏ ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక టీడీపీ గెలిచే స్థానాలను తమ వద్ద ఉంచుకుని మిగిలిన స్థానాలను తమకు కేటాయించిందని అసంతృప్తి వ్యక్తంచేస్తూ రాష్ట్ర సీనియర్ నాయకులు ఇటీవల రాసిన లేఖను అధిష్టానం ఏ మేరకు సీరియస్‌గా తీసుకుందనేది ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా విడుదలయ్యే జాబితాతో వెల్లడవుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఇదీ సామాజిక న్యాయం
సాక్షి ప్రతినిధి, కడప: సామాజిక న్యాయం అనేది మాటలకే పరిమితం కాదని, మొట్టమొదటిసారిగా సాధ్యమే అని ఆచరించి చూపిన చరిత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. తమ ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో శనివారం దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ ఎంపీ అభ్యర్థులను, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఒక్క అనకాపల్లి పార్లమెంట్ స్థానం మినహా 25 ఎంపీ, 175 అసెంబ్లీ సీట్లు కేటాయించామని చెప్పారు. 50 శాతం సీట్లను కచ్చితంగా నా.. నా.. నా.. అని సంబోధిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కచ్చితంగా అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనదన్నారు. ఇది నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ అమలు చేశామని చెప్పారు. దాన్ని మనస్ఫూర్తిగా... స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ రోజు 50 శాతం అంటే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్ధానాలు.. మొత్తం 200 స్థానాలకు గాను 100 స్థానాల్లో ఈ వర్గాల వారికే సీట్లు ఇవ్వగలగడం చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఘట్టం అని తెలిపారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీకి మాత్రమే ఆ ధైర్యం ఈ ఎన్నికల్లో దాదాపు 81 స్థానాల్లో ఎమ్మెల్యేల మార్పు, 18 ఎంపీ స్థానాల్లో మార్పులు చేశాం. దాదాపు 99 స్థానాలు అంటే 50 శాతం స్థానాల్లో మార్పులు చేశాం. ఇది కూడా చరిత్రలో నిలిచిపోయే ఘట్టమే. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం ఎవరికీ ఉండకపోవచ్చేమో. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఈ ధైర్యం ఉందని, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో దేవుడి దయతో, ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టికెట్ రాని వాళ్లందరికీ సముచిత స్థానం ఇస్తూ ఏదో ఒక రూపంలో దగ్గరకు తీసుకునే కార్యక్రమం కచ్చితంగా జరుగుతుందని భరోసా ఇస్తున్నా. విప్లవాత్మక మార్పులు.. కనీవినీ ఎరుగని విప్లవాత్మక మార్పులతో ఐదేళ్ల పాలన సాగింది. రూ.2.70 లక్షల కోట్లు నేరుగా బట¯Œన్ నొక్కడం ద్వారా ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లింది. ఇలా రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ చూడలేదు. ఎప్పుడూ జరగని ఘట్టం. లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా? వివక్ష లేకుండా ఇవ్వగలుగుతారా? అనే పరిస్థితి నుంచి.. ఇది సాధ్యమే అని ఐదేళ్ల పరిపాలనలో చూపించాం. గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు, 50–60 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థ తీసుకుని రావడం, వీటన్నిటి ద్వారా పారదర్శకత, లంచాలు లేని వ్యవస్థ, వివక్షకు చోటు లేని వ్యవస్థ ద్వారా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెయ్యడం అనేది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయంగా గుర్తుండి పోతుంది. గ్రామాలు మారాయి, గ్రామాల్లో పరిస్థితులు మారాయి, స్కూళ్లు, ఆస్పత్రులు బాగుపడ్డాయి.. ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయం బాగు పడింది. మహిళా సాధికారత సాధ్యమైంది. సామాజిక న్యాయం అన్నది మాటలకు కాదు.. మొట్టమొదటిసారిగా సాధ్యమే అని చేసి చూపించిన ప్రభుత్వంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడగలిగిందని చెప్పడానికి గర్వపడుతున్నా. వీటన్నింటి వల్ల ప్రస్ఫుటమైన మార్పులు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి. ఈ మార్పులన్నింటి వల్ల దేవుడి ఆశీస్సులతో మళ్లీ 2–3 నెలల్లో కచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఈ సందర్భంగా సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకుపోయేలా అడుగులు వేస్తాం. 59 స్థానాలు బీసీ అభ్యర్థులకే.. మొత్తం 200 స్థానాల్లో ఏకంగా 59 స్థానాలు బీసీలకే కేటాయించాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 11 స్థానాలు వీరికి కేటాయించాం. మహిళలకు ఇంతకు ముందుకన్నా బెటర్‌గా చేశాం. ఇది కూడా నాకు సంతృప్తిని కలిగించడం లేదు. వచ్చే ఎన్నికలకి ఇంకా వేగంగా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తున్నాం. 200 స్థానాలకు 24 స్థానాలు అంటే 12 శాతం అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ఇది పూర్తిగా సంతృప్తి కలిగించే అంశం కాకపోయినప్పటికీ లాస్ట్ టైమ్ కన్నా బెటర్‌గా చేశాం. బహుశా ఏ ఇతర పార్టీ కన్నా బెటర్‌గానే ఉంటుందనుకుంటున్నాం. గతంలో 19 సీట్లు ఇస్తే ఈసారి 24దాకా తీసుకుపోగలిగాం. ఇది కూడా ఒక విశేషమే. వచ్చే ఎన్నికలకి ఇంకా పెద్ద సంఖ్యలో ఇచ్చేలా అడుగులు ముందుకు వేస్తాం. ఇవాళ విడుదల చేసిన జాబితా 200 మందిలో 77 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు.. గ్రాడ్యుయేట్లు, ఆపై చదువులు చదివిన వారు. ఎమ్మెల్యేలకు సంబంధించి 175 మందిలో 75 శాతం గ్రాడ్యుయేట్లు, ఆపై చదువులు చదివిన వారిని మనం ఎంపిక చేశాం. మైనార్టీలకు ఇంతకు ముందు 5 స్థానాలిస్తే ఇవాళ 7 స్థానాలకు పెంచగలిగాం. మొత్తం మీద 50 శాతం నా.. నా.. నా.. అని పిలుచుకుంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. -
విద్యావంతులకు పెద్దపీట
సాక్షి, అమరావతి: 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు వైఎస్సార్సీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో విద్యావంతులకు పెద్దపీట వేశారు. వీరిలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, ఇంజినీర్లు, సివిల్ సర్వెంటు, జర్నలిస్టు ఇలా అన్ని రకాల విద్యావంతులకు జాబితాలో సీఎం జగన్ చోటు కల్పించారు. ఈ జాబితాలో మొత్తం 200 మందికి గాను 77 శాతం మంది ఉన్నత విద్యావంతులున్నారు. 175 శాసనసభ స్థానాలకు వైఎస్సార్సీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో 131 మంది గ్రాడ్యుయేషన్, ఆపై చదవులు చదివినవారు ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 47 మంది పోస్టు గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ చేసిన వారున్నారు. 13 మంది డాక్టర్లు, 11 మంది లాయర్లు, 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు(ఎ.మహ్మద్ ఇంతియాజ్, ఆదిమూలపు సురేష్), ఒకరు డిఫెన్స్‌లో చేసినవారు (వాసుపల్లి గణేష్‌కుమార్), ఒక జర్నలిస్టు(కురసాల కన్నబాబు) ఉన్నారు. ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం డిగ్రీ, ఆపై చదివినవారే.. 25 లోక్‌సభ స్థానాలకు వైఎస్సార్సీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో 22 మంది (88 శాతం) డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారు ఉన్నారు. ఇందులో 11 మంది పోస్టు గ్రాడ్యుయేషన్, ఇద్దరు డాక్టరేట్ చేసిన వారు ఉన్నారు. లోక్‌సభ అభ్యర్థుల్లో సింహాద్రి చంద్రశేఖరరావు, గూడురి శ్రీనివాసులు, మద్దుల గురుమూర్తి, పి.అనిల్‌కుమార్ యాదవ్‌లు డాక్టర్లు కాగా.. నలుగురు లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్(వి.విజయసాయిరెడ్డి), ఒక మెడికల్ ప్రాక్టిషనర్ ఉన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు అవకాశం ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న పలువురికి వైఎస్సార్సీపీ టికెట్లు కేటాయించింది. మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్యకర్తల్లో 13 మందికి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీకి అవకాశం కల్పించింది. కర్నూలు మేయర్ బీవై రామయ్యకు కర్నూలు ఎంపీగా, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడుకి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్ పిరియ విజయకు ఇచ్ఛాపురం నుంచి అవకాశం కల్పించారు. సాధారణ కార్యకర్తలు లక్కప్ప, వీరాంజనేయులుకు మడకశిర, శింగనమల నుంచి పోటీకి అవకాశం కల్పించారు. పార్టిలో క్రియాశీల కార్యకర్తగా పనిచేసిన గూడూరి ఉమాబాలకు నరసాపురం ఎంపీ సీటు కేటాయించారు. కడప జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. జెడ్పీటీసీ సర్నల తిరుపతిరావుకు మైలవరం టికెట్ కేటాయించారు. వైఎస్సార్సీపీ నేత బలసాని కిరణ్‌కుమార్ ప్రత్తిపాడు నుంచి, గృహిణి మురుగుడు లావణ్య మంగళగిరి నుంచి పోటీç³డుతున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తిరుపతి నుంచి, నెల్లూరు సిటీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ నెల్లూరు నుంచి, జెడ్పీటీసీ బూసినే విరూపాక్ష ఆలూరు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
హస్తినకు బీజేపీ అభ్యర్థుల జాబితా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్న బీజేపీ.. అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను మంగళవారం పార్టీ అధిష్టానానికి పంపించింది. ఇందుకోసం జాతీయ పార్టీ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్ విజయవాడలో శనివారం, ఆదివారాల్లో జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులు, కన్వినర్లు, ముఖ్యనేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పార్టీ తరఫున పోటీ చేసే నాయకుల పేర్లతో జాబితాలను రూపొందించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురికి తక్కువ కాకుండా పేర్లతో నివేదికను సిద్ధం చేసి ఢిల్లీకి పంపినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 9న ఢిల్లీలో భేటీకి అవకాశం లోక్‌సభ అభ్యర్థుల తుది ఎంపికకు సంబంధించి బీజేపీ అధిష్టానం ఏపీ నేతలతో ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆ తరువాతే అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా.. ఫిబ్రవరి 6న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతో భేటీ అయిన తర్వాత రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నట్టు ఊహగాహాలు ఊపందుకున్నాయి. పొత్తులపై జాతీయ నాయకత్వం నేటికీ ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. పొత్తులో బీజేపీకి కేటాయించే సీట్ల సంఖ్యపై టీడీపీ నేతలకు మీడియాకు లీకులు ఇస్తూ వచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం పొత్తుల ప్రచారానికి ఊతమిస్తూ.. పొత్తులపై పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతూ వచ్చింది. తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాష్ట్ర పర్యటకు వచ్చి ఒకే రోజున దాదాపు 15 లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించినా పొత్తులపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాగా.. రాజ్‌నాథ్ పర్యటన తర్వాత జాతీయ నాయకత్వం సూచన మేరకు శివప్రకాష్ విజయవాడ వచ్చి అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తుకు అవకాశాలు ఉండకపోవచ్చనే చర్చ నడుస్తోంది. -
ప్రతిపాదిత అభ్యర్థుల జాబితా ఢిల్లీకి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ తరఫున పోటీచేసే ప్రతిపాదిత అభ్యర్థుల జాబితాలను శని, ఆదివారం జరిగిన సమావేశాల్లో సిద్ధంచేశామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. జాతీయ పార్టీ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్ జిల్లాల వారీగా ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, కన్వినర్లు, ఇతర ముఖ్యనేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. శనివారం 14 లోక్‌సభ స్థానాల పరిధిలో జిల్లా నాయకుల సమావేశాలు జరగ్గా.. ఆదివారం మిగిలిన 11 లోక్‌సభ స్థానాల సమావేశాలు జరిగాయి. అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ 175 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాలకు సంబంధించి ఆయా జిల్లాల నేతల నుంచి అభిప్రాయాలు సేకరించాం. నియోజకవర్గాల వారీగా సామాజిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి.. అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందన్న వివరాలు అడిగి తెలుసుకున్నాం. ఈ జాబితాలను జాతీయ నాయకత్వానికి పంపుతాం. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసేందుకు రెండు వేలమందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండ్రోజుల సమావేశాల్లో అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చాం. నిబంధనల ప్రకారం.. మేం ఇచ్చే జాబితాపై పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చ జరుగుతుంది. అప్పుడు కేంద్ర పార్టీ రాష్ట్ర నాయకులను పిలిచి అభ్యర్థుల తుది ఎంపికపై చర్చిస్తుంది. పొత్తుపై చర్చ జరగలేదు.. ఈ సమావేశాల్లో పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరగలేదు. కేవలం అభ్యర్థుల ఎంపికకు సంబంధించే జిల్లా నేతల అభిప్రాయాలు తీసుకున్నాం. పొత్తులపై జాతీయ నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ జాతీయ పార్టీ పొత్తులపై నిర్ణయం తీసుకునే పక్షంలో ఆ నిర్ణయాలకు అనుకూలంగా మేం మరోసారి సమీక్ష చేసుకుంటాం అని అన్నారు. -
సైకిల్ సతమతం
సాక్షి, అమరావతి, నెట్వర్క్: పొత్తు ప్రకంపనలు టీడీపీలో కొనసాగుతూనే ఉన్నాయి. సీట్లు దక్కని నేతలతోపాటు పొత్తులతో అవకాశం కోల్పోయిన అసంతృప్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని నిరసనలతో హోరెత్తిస్తున్నారు. జనసేనతో కలిసి 99 మంది ఉమ్మడి అభ్యర్థుల జాబితాను చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పలు చోట్ల నేతలు భగ్గుమంటున్నారు. ♦ విజయనగరం జిల్లా గజపతినగరం టీడీపీ టికెట్‌ను తన అన్న కుమారుడు కొండపల్లి శ్రీనివాస్‌కి కేటాయించడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఆదివారం గజపతినగరంలో ప్రదర్శన నిర్వహించారు. అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించడాన్ని నిరసిస్తూ నల్ల రిబ్బన్లతో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ♦ టీడీపీ బలోపేతం కోసం కష్టపడ్డ తనను అవమానించారని, ఇండిపెండెంట్‌గా ఎన్నికల బరిలోకి దిగుతానని ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ప్రకటించారు. చంద్రబాబు తనకు కనీస గౌరవం ఇవ్వకుండా పక్కన పెట్టారని మండిపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సహకరించేది లేదన్నారు. ♦ శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సీటును సవితకు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గం నిరసనలతో హోరెత్తిస్తోంది. ఆదివారం పెనుకొండలో పార్థసారథి అనుచరులు భారీ బైక్ ర్యాలీతో బల ప్రదర్శన నిర్వహించారు. విజయవాడ వెళ్లి చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకుంటానని పార్ధసారథి ప్రకటించారు. కనీసం సంప్రదించకుండా అభ్యర్థిని ఎంపిక చేయడంపై మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అసహనం వ్యక్తం చేశారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారు. ♦ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని ప్రకటించడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకర్‌యాదవ్‌కి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బి.కొత్తకోటలో నిరసన నిర్వహించారు. ♦ నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. దీనిపై నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతోపాటు కుందుల సత్యనారాయణ వర్గాలు మండిపడుతున్నాయి. వారంతా టీడీపీకి మూకుమ్మడి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. చిత్తూరులో బీసీలు భగ్గు టీడీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రిజర్వుడు స్థానాలను మినహాయించి చిత్తూరు (కమ్మ), కుప్పం (కమ్మ), నగరి (కమ్మ), తంబళ్లపల్లె (రెడ్డి), పలమనేరు (రెడ్డి) స్థానాలను ఓసీలకు కేటాయించడంపై బీసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన బీసీ నేత సీఆర్ రాజన్‌కు టీడీపీ మొండి చేయి చూపడంపై ఆయన సామాజిక వర్గం మండిపడుతోంది. శ్రీకాళహస్తి నుంచి కుప్పం వరకు బస్సు యాత్ర నిర్వహించి బీసీలను చైతన్యం చేయాలని నిర్ణయించింది. బెంగళూరు నుంచి దిగుమతి చేసుకున్న గురజాల జగన్మోహన్ నాయుడుకు చిత్తూరు టికెట్ ఇవ్వడంపై కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరుకు చెందిన కాపు నేతలు కటారి హేమలత, ఆదికేశవులు కుమార్తె తేజస్విని, మనవరాలు చైతన్య, కాజూరు బాలాజీ తదితరులు టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. జనసేనలోనూ మంటలు... ♦ తణుకు జనసేన టికెట్ ఆశించి భంగపడ్డ విడివాడ రామచంద్రరావు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన అరిమిల్లి రాధాకృష్ణపై నిప్పులు కక్కుతున్నారు. తన ఇంటికి రావద్దంటూ అరిమిల్లిపై మండిపడ్డారు. విడివాడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి యోచనలో ఉన్నారు. ♦ కాకినాడ జిల్లా జగ్గంపేట టికెట్ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకు కేటాయించడాన్ని నిరసిస్తూ జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర ఆలయాల్లో పూజలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 48 గంటల్లో అధినేత స్పందించకుంటే తమ కార్యాచరణ ప్రకటిస్తామని పార్టీ గోకవరం మండలాధ్యక్షుడు ఉంగరాల మణిరత్నం చెప్పారు. ♦ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులోని జనసేన కార్యాలయం వద్ద పార్టీ నాయకులు చల్లా బాబీ, గుత్తుల నాగేశ్వరరావు, బి.రాంబాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను చించి రోడ్డుపై వేసి నిప్పంటించారు. అతి తక్కువ సీట్లకు ఒప్పందం కుదుర్చుకుని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. కొత్తపేట నియోజకవర్గాన్ని టీడీపీకి కట్టబెట్టడం దారుణమన్నారు. పదేళ్లుగా అహర్నిశలూ శ్రమిస్తే పార్టీని టీడీపీకి అప్పగించి తమను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ♦ కాకినాడ జిల్లా పెద్దాపురం సీటును టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు కేటాయించటాన్ని వ్యతిరేకిస్తూ జనసేన నేతలు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తుమ్మల బాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ♦ పెడన సీటు జనసేనకు కేటాయించకపోవడంపై పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. పెడన ఎమ్మెల్యే సీటు జనసేనకు కేటాయించకపోవడంతో ఆ పార్టీ కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ దిష్టి»ొమ్మను కార్యకర్తలు ఆదివారం దహనం చేశారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా పెడన మండలం బల్లిపర్రు గ్రామంలో ఆ పార్టీ నాయకుడు సమ్మెట బాబు విలేకరులతో మాట్లాడుతూ పవన్‌ను గుడ్డిగా నమ్మామని అన్నారు. గౌరవప్రదమైన పొత్తుకు విఘాతం కలిగినట్టుగా జనసైనికులు భావిస్తున్నారని తెలిపారు. -
కమలంలో కొత్త లొల్లి
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల దాఖలు చివరిరోజు అభ్యర్థుల జాబితాలో కొన్ని మార్పులు చేసి, ఇదివరకే ప్రకటించిన వారికి బీఫాంలు ఇవ్వకపోవడం బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. టికెట్లు దక్కని వారితో పాటు జాబితాలో ప్రకటించినా బీఫామ్స్ దక్కని వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. శుక్రవారం ప్రకటించిన 14 మంది అభ్యర్థుల జాబితా అంతా వివాదాస్పదం కావడంతో సమస్య మరింత ముదిరింది. వేములవాడలో తుల ఉమకు బదులు వికాస్‌రావుకు, సంగారెడ్డిలో రాజేశ్వర్ దేశ్‌పాండేకు బదులు పులిమామిడి రాజుకు బీఫామ్‌లు ఇవ్వడంతో తుల ఉమ, దేశ్‌పాండే కన్నీటి పర్యంతం అయ్యారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలవనున్నట్లు ప్రకటించడంతో పార్టీ నాయకులు వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. చివరి క్షణంలో పలువురికి చెయ్యి బీసీ మహిళ (కురుమ) ఉమకు టికెట్ కోసం ఈటల రాజేందర్ గట్టిగా పట్టుబట్టారు. ఆమెకు సీటు కేటాయించకపోతే తాను ఎన్నికల్లో పోటీ చేయనని అల్టిమేటమ్ కూడా ఇచ్చారు. దీంతో నాయకత్వం దిగివచ్చినట్టు ప్రచారం జరిగింది. కానీ చివరకు బీఫామ్ ఇవ్వలేదు. సంగారెడ్డిలో పులిమామిడి రాజుకు కూడా సీటు కేటాయించాలని ఈటల కోరారు. దీంతో ఏదో ఒక సీటు ఎంపిక చేసుకోవాలని అధిష్టానం సూచించిందని, గెలిచే అవకాశాలున్న సంగారెడ్డి వైపు ఈటల మొగ్గుచూపినట్టుగా తెలుస్తోంది. కాగా తనను నామినేషన్ వేసుకోమని చెప్పి బీఫామ్ ఇవ్వకపోవడంపై తీవ్ర మనస్థాపానికి గురైన దేశ్‌పాండే.. కిషన్‌రెడ్డికి ఫోన్‌చేసి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాబితాలో బెల్లంపల్లి స్థానానికి ఏమాజీ పేరుంటే శ్రీదేవిని, ఆలంపూర్లో మారెమ్మ ప్లేస్‌లో రాజగోపాల్‌ను బీజేపీ ఖరారు చేయడం కూడా వివాదానికి తెరతీసింది. అనూహ్యంగా కంటోన్మెంట్ సీటు... సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను చివరి నిమిషం వరకు కాంగ్రెస్‌లోనే ఉండి ఇంకా బీజేపీలో చేరని సాయి గణే‹Ùకు కేటాయించడంపై కూడా పారీ్టవర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక్కడ మాజీ డీజీపీ కృష్ణప్రసాద్‌కు నామినేషన్ వేసేందుకు సిద్ధం కావాలంటూ చెప్పిన బీజేపీ.. ఆయనకు మొండిచేయి చూపి సాయి గణే‹Ùకు టికెట్ కేటాయించడం పారీ్టలో తీవ్ర చర్చనీయాంశమైంది. అదేవిధంగా తుది జాబితాలో పోటీకి సుముఖంగా లేని మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావుకు మల్కాజిగిరి సీటును కేటాయించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. మల్కాజిగిరి టికెట్ కోసం ఆకుల రాజేందర్, బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో నాయకత్వం మధ్యే మార్గంగా రామచంద్రరావుకు అవకాశం ఇచ్చినట్టు సమాచారం. దీంతో భానుప్రకాష్ పారీ్టకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. శేరిలింగంపల్లి టికెట్‌ను రవికుమార్ యాదవ్‌కు కేటాయించడంతో గత కొంతకాలంగా ఇక్కడ పనిచేస్తూ ఈ సీటును గట్టిగా కోరుకున్న గజ్జెల యోగానంద్ ఎలాంటి కార్యచరణకు దిగుతారనేదది చర్చనీయాంశమైంది. బీసీలకు 36 సీట్లు బీజేపీ ప్రకటించిన మొత్తం 111 సీట్లలో (జనసేనకు 8 సీట్లు) బీసీలు–36, ఓసీ–44 (రెడ్డి–29, వెలమ–8, కమ్మ–3, బ్రాహ్మణ–2, వైశ్య–1, నార్త్ ఇండియన్అగర్వాల్–1) ఎస్సీ 19+2 (రిజర్వ్‌డ్‌తో పాటు అదనంగా 2 జనరల్ సీట్లు (నాంపల్లి, చాంద్రాయణగుట్ట), ఎస్టీలకు 10 కేటాయించారు. బీసీలకు ఇతర పారీ్టల కంటే అధిక సీట్లనే కేటాయించినా.. 40కి పైగా సీట్లు కేటాయిస్తామనే హామీని నేతలు నిలబెట్టుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా మాదిగలకు ఎక్కువ ప్రాధా న్యం దక్కింది. 21 స్థానాలను ఎస్సీలకు కేటాయించగా, అందులో మాదిగ సామాజిక వర్గానికి 14, మాల సామాజిక వర్గానికి 7 ఇచ్చారు. బీసీలకు కేటాయించిన 36 సీట్లలో ముదిరాజ్ 9, మున్నూరు కాపు 7, యాదవ 5, గౌడ 5, పెరిక 2 లోధ్ 2 పద్మశాలి, ఆరే కటిక, లింగాయత్, వాలీ్మకి బోయ, ఆరే క్షత్రియ, విశ్వకర్మలకు ఒక్కో సీటు కేటాయించారు. -
నేడో రేపో బీజేపీ మలి జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మలిజాబితాకు బీజేపీ అధిష్టానం ఆమోద ముద్ర వేసింది. తొలి జాబితా మాదిరిగా గెలుపు గుర్రాలే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వం తయారు చేసిన మలి జాబితాలోని అన్ని స్థానాలపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూలంకషంగా సమీక్ష చేసింది. అనంతరం మిగిలిన 66 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్న స్థానాలకు పచ్చజెండా ఊపింది. అయితే పొత్తు నేపథ్యంలో జనసేనకు కేటాయించే సీట్లను మినహాయించి మిగతా అభ్యర్థులతో బీజేపీ మలిజాబితా విడుదల కానుంది. సీట్ల కేటాయింపులో తొలి జాబితా మాదిరిగా మలి జాబితాలోనూ బీసీలు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలా బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. చర్చల్లో మోదీ, నడ్డా, అమిత్ షా బుధవారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సీఈసీ సమావేశంలో తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజనాథ్సింగ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ సహా పలువురు కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు సుమారు గంట పాటు కసరత్తు చేశారు. వీరితో పాటు తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్ఢి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజయ్ కుమార్, తరుణ్ ఛుగ్, సునీల్ భన్సల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్చార్జ్ అరవింద్ మీనన్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎన్నికల ఇంచార్జ్ ప్రకాశ్ జవదేకర్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. కాగా తెలంగాణతో పాటు రాజస్తాన్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై విడి విడిగా ఆయా రాష్ట్రాల నాయకులతో కలిసి కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించి ఆమోద ముద్ర వేసింది. పూర్తిస్థాయిలో కసరత్తు తెలంగాణకు సంబంధించి బీజేపీ తొలి జాబితా విడుదల తర్వాత కొన్నిచోట్ల అసంతృప్త స్వరాలు బయటపడడం, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి సహా పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో చేరిన పరిణామాల నేపథ్యంలో మలిజాబితాపై రాష్ట్ర నా యకత్వం పూర్తిస్థాయిలో కసరత్తు నిర్వహించింది. బీసీలకే పెద్దపీట: కాగా తొలి జాబితాలో ఏవిధంగా అయితే బీసీలు, మహిళలకు అధిక ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారో.. మలి జాబితాలోనూ బీసీలు, మహిళలకు సముచిత స్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల తెలంగాణ పర్యటనలో ప్రకటించిన నేపథ్యంలో బీసీలకు పెద్దపీట వేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏ క్షణమైనా జాబితా కాగా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన బీజేపీ అభ్యర్థుల మలిజాబితాను ఢిల్లీ నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశాలున్నాయి. గతంలో తొలి జాబితా విడుదల సమయంలో కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అక్టోబర్ 20వ తేదీన జరుగగా, 52 మంది సభ్యుల జాబితాను అక్టోబర్ 22 న విడుదల చేశారు. ఈసారి కూడా అదే తరహాలో ఒకటి రెండు రోజుల తర్వాత మలి జాబితాను విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
రాజకీయం గరం గరం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడటంతో రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రధాన రాజకీయ పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతోపాటు బీఎస్పీ ఇప్పటికే ఎన్నికల కోసం సిద్ధమవడం మొదలుపెట్టగా.. ఇకపై పూర్తిస్థాయిలో శక్తియుక్తులను కేంద్రీకరించనున్నాయి. అభ్యర్థుల జాబితాలు, మేనిఫెస్టోల ప్రకటన, ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం వంటివి ఊపందుకోనున్నాయి. అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ దూకుడు ఈ ఏడాది మార్చి నుంచే ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఎన్నికల సన్నద్ధతను బీఆర్ఎస్ మొదలుపెట్టింది. అధికారిక కార్యక్రమాల పేరిట సీఎం కేసీఆర్, మంత్రులు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. అంతేగాకుండా 50రోజుల క్రితమే అంటే ఆగస్టు 21న అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే పెద్దపీట వేయడంపై తలెత్తిన అసంతృప్తిని వివిధ నామినేటెడ్ పదవులు, ఇతర రూపాల్లో బుజ్జగించారు. పార్టీ టికెట్ దక్కని ఎమ్మెల్యేలు రేఖానాయక్, బాపూరావు రాథోడ్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదనే కారణంతో ఎంపీ మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ను వీడారు. మరోవైపు గడిచిన పక్షం రోజుల్లోనే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సుమారు 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయడం ఎన్నికల ప్రచార సభలను తలపించింది. ఈ నెల 15న పార్టీ మేనిఫెస్టో ప్రకటన, అభ్యర్థులకు బీఫారాల పంపిణీతోపాటు ఎన్నికల ప్రచార సభలకు కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారు. గ్యారంటీలతో కాంగ్రెస్ అడుగులు రైతు, యువత డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీ స్కీమ్‌ల ప్రకటన వంటి అంశాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. జాతీయ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించడం ద్వారా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపి, ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేసింది. తుక్కుగూడ బహిరంగ సభలో పార్టీ అగ్రనేతలతో హామీలు ఇప్పించింది. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక కసరత్తుపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఎన్నికల మేనిఫెస్టోకు తుదిరూపునిచ్చి మరో పది రోజుల్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే పార్టీ అభ్యర్థుల ఖరారుపై ఇటు హైదరాబాద్, అటు ఢిల్లీలో చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతున్నా.. ఇంకా కొలిక్కి రాలేదు. 2018 ఎన్నికల్లో చివరి నిమిషం దాకా అభ్యర్థుల ప్రకటనలో జాప్యంతో నష్టం జరిగిందని.. ఈసారి వీలైనంత త్వరగా ప్రకటించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. త్వరలో టీపీసీసీ నేతలు బస్సుయాత్ర ప్రారంభించనుండటంతో.. టికెట్ రానివారితో ఇబ్బందులు వస్తాయన్న భావన పార్టీలో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో దసరా పండుగ తర్వాత అభ్యర్థుల జాబితాను విడుదల చేసే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. మంగళవారం హైదరాబాద్‌లో జరిగే కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల సలహా కమిటీ (పీఏసీ) భేటీలో బస్సుయాత్ర, ఇతర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అగ్రనేతలను రంగంలోకి దింపుతున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో బీజేపీ ప్రచారం కోసం అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రుల పర్యటనలు ఖరారయ్యాయి. మంగళవారం ఆదిలాబాద్‌లో బహిరంగ సభతోపాటు హైదరాబాద్‌లో వివిధ రంగాలకు చెందిన వృత్తినిపుణులు, మేధావులతో నిర్వహించే సమావేశంలో అమిత్‌షా పాల్గొంటారు. ఈ నెల 27న కూడా అమిత్‌షా మరోమారు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఇక ఈ నెల 14న హైదరాబాద్ శివార్లలోని శేరిలింగంపల్లితోపాటు మరో నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, 15న ముషీరాబాద్‌తోపాటు మరోచోట కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి పర్యటిస్తారని బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 16న హుజూరాబాద్, మహేశ్వరం అసెంబ్లీ స్థానాల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పర్యటిస్తారని.. 19న మధిరలో కేంద్ర మంత్రి నారాయణస్వామి పర్యటిస్తారని తెలిపారు. మరోవైపు ఈ నెలాఖరులోగా ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభలు నిర్వహించేందుకు బీజేపీ సిద్దమవుతోంది. ఎన్నికల మేనిఫెస్టోకు ముఖ్య నేతలు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో 38 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కమ్యూనిస్టులు, ఇతర పార్టీలూ తెరపైకి.. కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఎం ఇటీవల కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకు సిద్ధమయ్యాయి. కానీ చర్చలు కొలిక్కి రాలేదు. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో రెండు స్థానాలు ఇచ్చేందుకు జాతీయ స్థాయిలో ఒప్పందం కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెం, మునుగోడులో సీపీఐ.. భద్రాచలం, కొత్తగూడెంలో సీపీఐకి కాంగ్రెస్ సీట్లు ఇస్తుందని అంటున్నారు. కానీ అధికారికంగా ఏదీ తేలలేదు. మరోవైపు ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జనసమితి కూడా కాంగ్రెస్‌తో కలసి పోటీచేయాలని భావిస్తున్నా.. ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. కాంగ్రెస్‌లో వైఎస్ షర్మి ల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనం అంశం కూడా మరుగున పడింది. మరోవైపు బహుజన సమాజ్ పార్టీ తొలి విడత జాబితాను ప్రకటించింది. జనసేన, టీటీడీపీ వంటి పార్టీలు కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సన్నాహలు చేస్తున్నాయి. గతం కన్నా వారం ముందు.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గతసారితో పోలిస్తే వారం రోజులు ముందే జర గనుంది. గత ఎన్నికల్లో డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించగా.. ఈసారి నవంబర్ 30వ తేదీనే జరగనుంది. మొత్తంగా ఎన్నికల షెడ్యూల్ నాటి నుంచి పోలింగ్ వరకు 51 రోజులు మాత్రమే గడువు మిగిలింది. -
15 నుంచి కాంగ్రెస్ బస్సుయాత్ర!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలు నిర్వహించ తలపెట్టిన బస్సుయాత్రను ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు తెలిసింది. ఈ నెల 14 తర్వాత ఏ క్షణమైనా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వెలువడుతుందన్న అంచనాల నేపథ్యంలో టీపీసీసీ నేతలు దీనిపై సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. బస్సు యాత్రను ప్రారంభించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ రానున్నారని.. యాత్ర జరుగుతున్న సమయంలో రాహుల్గాందీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా హాజరయ్యేలా షెడ్యూల్ రూపొందుతోందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 9న లేదా 10న జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో షెడ్యూల్, రూట్ మ్యాప్‌ను ఖరారు చేయనున్నట్టు వివరిస్తున్నాయి. టికెట్లు ఎప్పుడు?.. సమావేశాలు ఎన్నడు? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అంశం హాట్‌టాపిక్‌గా నడుస్తోంది. రెండు దఫాలు స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు పూర్తయిన నేపథ్యంలో.. అదిగో జాబితా, ఇదిగో జాబితా అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే టికెట్ల ప్రకటన ఈనెల 14వ తేదీ తర్వాతే ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి అక్టోబర్ మొదటి వారంలోనే తొలిజాబితా విడుదల చేసేలా కాంగ్రెస్ పెద్దలు కసరత్తు చేశారు. కానీ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ఇంకా జరగాల్సి ఉండడం, కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ జరగకపోవడంతోపాటు పితృపక్షాల కారణంగా మంచి రోజులు లేవనే ఉద్దేశంతో అభ్యర్థుల ప్రకటన వాయిదా వేసినట్టు సమాచారం. ఈ నెల 14న అమావాస్య ఉండటంతో ఆ తర్వాత తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా ఉంటుందని టీపీసీసీ కీలక నేత ఒకరు వెల్లడించారు. ఇందుకోసం ఈనెల 8న స్క్రీనింగ్ కమిటీ భేటీ అవుతుందని, తర్వాత 10న సీఈసీ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు స్క్రీనింగ్ కమిటీ ఒక్కోపేరు పంపిన నియోజకవర్గాలకే తొలుత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిసింది. రెండు, మూడుపేర్లు పంపిన సెగ్మెంట్లకు సంబంధించి ఒక్కో పేరును ఫైనల్ చేసేందుకు సీఈసీ కొన్ని మార్గదర్శకాలు ఇస్తుందని, ఆ మార్గదర్శకాల మేరకు మళ్లీ స్క్రీనింగ్ కమిటీనే ఒక్కో పేరు సూచించాల్సి వస్తుందనే చర్చ ఏఐసీసీ వర్గాల్లో జరుగుతోంది. పెద్ద నేతల పర్యటనలపై చర్చ శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి చేరిక సందర్భంగా ఢిల్లీలో ఖర్గే, వేణుగోపాల్‌లతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు తెలంగాణలో ఏఐసీసీ కీలక నేతల పర్యటనలపై చర్చించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీలున్నన్ని ఎక్కువ సార్లు ప్రియాంక, రాహుల్‌గాంధీలతోపాటు ఖర్గే కూడా రాష్ట్రంలో పర్యటించేలా షెడ్యూల్ ఇవ్వాలని, కీలక సమయంలో మరోమారు సోనియాగాంధీ కూడా పాల్గొనేందుకు అనుమతి ఇప్పించాలని రేవంత్ కోరినట్టు సమాచారం. ఈ నెల 15 తర్వాత రాష్ట్రంలో రెండు రోజులపాటు రాహుల్ పర్యటన ఉంటుందని తెలిసింది. -
మహిళలకు ఆరు సీట్లేనా?
సాక్షి, న్యూఢిల్లీ :చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బంగారు కుటుంబసభ్యులు చేసినవన్నీ దొంగ దీక్షలేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. 33 శాతం రిజర్వేషన్లు అంటూ డిమాండ్ చేసి.. 3+3 కలిసి 6 సీట్లే మహిళలకు కేటాయించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ‘ఇవేనా మీ బంగారు కుటుంబానికి వచ్చే లెక్కలు? ఇదేనా మహిళలకు మీరు చేయాలనుకున్న న్యాయం?’అంటూ పరోక్షంగా ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ప్రశ్నించారు. సోమ వారం బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల ప్రక టన అనంతరం కిషన్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన జాబితా చూస్తుంటే.. మరోసారి అధికారంలోకి రాలేమని కేసీఆర్‌కు అర్థమైనట్లుగా తెలుస్తోంది. రోజురోజుకూ ఎస్సీ, ఎస్టీలతో పాటు అన్ని వర్గాల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కేసీఆర్‌లో ఆందోళన మొదలైంది. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకోవడం ఆయనలో నెలకొన్న భయానికి నిదర్శనం..’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దోస్తుకు కేసీఆర్ మద్దతు ‘మతోన్మాద మజ్లిస్ అభ్యర్థులను గెలిపించేందుకు, ఆ పార్టీ వ్యతిరేక ఓట్లు చీలేందుకు, ఆయా ప్రాంతాల్లో ఒవైసీ చెప్పిన అభ్యర్థులను బరిలో దించుతూ..కేసీఆర్ దోస్తుకు మద్దతుగా నిలుస్తున్నారు..’అని కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్, మజ్లిస్ కలిసి 29 సీట్లు గెలవాలని కేసీఆర్ మీడియా సమావేశంలోనే ప్రకటించారని పేర్కొన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇవ్వడం ద్వారా.. కేసీఆర్ ఎన్నికల్లో ఓట మిని అంగీకరించారని వ్యాఖ్యానించారు. -
త్రిపురలో 54 మందితో బీజేపీ జాబితా
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 16న జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ 54 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ పేరు కూడా ఉన్నారు. ఆమె ధన్పూర్ నుంచి, సీఎం మాణిక్ సాహా బోర్డోవాలి నుంచి బరిలో దిగుతున్నారు. ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ)తో సీట్ల సర్దుబాటు ఖరారైందని సాహా చెప్పారు. బీజేపీ 55 చోట్ల, ఐపీఎఫ్టీ 5 స్థానాల్లో పోటీ చేస్తాయన్నారు. అసెంబ్లీలోని 60 సీట్లకు 2018 ఎన్నికల్లో బీజేపీ, ఐపీఎఫ్టీ 43 స్థానాలను గెలుచుకున్నాయి. మరోవైపు విపక్ష సీపీఎం, కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. -
15 మందితో టీడీపీ రెండో జాబితా
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ 15 మందితో తమ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. మరో 34 అసెంబ్లీ స్థానాలను పెండింగ్ పెట్టారు. 126 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన టీడీపీ.. శనివారం అర్ధరాత్రి దాటాక రెండో జాబితాను ప్రకటించింది.పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణకు, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మకు టికెట్ దక్కింది. రంపచోడవరం నుంచి వంతల రాజేశ్వరికి అవకాశమిచ్చింది. రాయదుర్గంలో మంత్రి కాలవ శ్రీనివాసులకు మరో అవకాశం కల్పించారు. (126 మందితో టీడీపీ తొలి జాబితా) అభ్యర్థి పేరు నియోజకవర్గం పాలకొండ నిమ్మక జయకృష్ణ పిఠాపురం ఎస్వీఎస్ఎన్ వర్మ రంపచోడవరం వంతల రాజేశ్వరి ఉంగటూరు వీరాంజనేయులు పెడన కాగిత వెంకటకృష్ణ ప్రసాద్ పామర్రు ఉప్పులేటి కల్పన సూళ్లూరు పేట పర్సా వెంకటరత్నం నందికొట్కూరు బండి జయరాజు బనగానపల్లె బీసీ జనార్ధన్ రెడ్డి రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు ఉరవకొండ పయ్యావుల కేశవ్ తాడిపత్రి జేసీ అస్మిత్‌రెడ్డి మడకశిర కె.ఈరన్న మదనపల్లి దమ్మలపాటి రమేష్ చిత్తూరు ఏఎస్ మనోహర్ -
126 మందితో టీడీపీ తొలి జాబితా
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ 126 మందితో తమ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి విడత జాబితాను విడుదల చేసింది. ఎంపీ అభ్యర్థులతోపాటు 49 అసెంబ్లీ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఉండవల్లిలోని ప్రజావేదికలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు ఈ జాబితాను విడుదల చేశారు. ఎంపీలుగా పోటీ చేయించే ఉద్దేశంతో మంత్రులు కాల్వ శ్రీనివాసులు, శిద్ధా రాఘవరావు, ఆదినారాయణరెడ్డిలకు ఈ జాబితాలో చోటు కల్పించలేదు. ప్రకటించిన స్థానాల్లో 72 మంది ఓసీలు కాగా, 31 మంది బీసీలు, 17 మంది ఎస్సీలు, నలుగురు ఎస్టీ, ఇద్దరు మైనారిటీ అభ్యర్థులు ఉన్నారు. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, ఐతాబత్తుల ఆనందరావు, పులపర్తి నారాయణమూర్తి, పీతల సుజాత, తెనాలి శ్రావణ్‌కుమార్, పాలపర్తి డేవిడ్‌రాజు, జయరాములుకు మొండిచేయి చూపి వారి స్థానాల్లో వేరే వారిని ఎంపిక చేశారు. 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొదటి జాబితాలో చోటు దక్కకపోవడం విశేషం. తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో మంత్రి కేఎస్ జవహర్‌కు పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కొవ్వూరును కాదని కృష్ణా జిల్లాలోని తిరువూరు సీటును కేటాయించారు. కొవ్వూరు సీటును విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కేటాయించారు. మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావును భీమిలికి బదులుగా విశాఖ నార్త్‌కు మార్చారు. ఆరుగురు సీనియర్ల వారసులకు టికెట్లు కేటాయించారు. ఆ మేరకు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్థానంలో ఆయన కుమారుడు కేఈ శ్యాంబాబు, మంత్రి పరిటాల సునీత స్థానంలో ఆమె కుమారుడు శ్రీరామ్, కిమిడి మృణాళినికి బదులు ఆమె తనయుడు నాగార్జున, గౌతు శ్యాంసుందర శివాజీ స్థానంలో ఆయన కూతురు శిరీష, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్థానంలో ఆయన తనయుడు శ్రీధర్‌రెడ్డి, జలీల్‌ఖాన్ స్థానంలో ఆయన కూతురు షబనా ఖాతూన్‌కు టికెట్లు కేటాయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 22 మందిలో 13 మందికి టికెట్లు కేటాయించగా ముగ్గురిని పక్కన పెట్టారు. జాబితా విడుదలకు ముందు చంద్రబాబు పొలిట్‌బ్యూరో సమావేశం ఏర్పాటుచేసి జాబితాకు ఆమోదముద్ర వేయించారు. ఎంపీ అభ్యర్థులు, మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు. శ్రీకాకుళం ఇచ్ఛాపురం – బెందాళం అశోక్ పలాస – గౌతు శిరీష టెక్కలి – కింజరాపు అచ్చెన్నాయుడు పాతపట్నం – కలమట వెంకటరమణ శ్రీకాకుళం – గుండా లక్ష్మీదేవి ఆముదాలవలస – కూన రవికుమార్ ఎచ్చెర్ల – కిమిడి కళా వెంకట్రావు నరసన్నపేట – బగ్గు రమణమూర్తి రాజాం – కొండ్రు మురళీ విజయనగరం కురుపాం – జనార్థన్ దాట్రాజ్ పార్వతీపురం – బొబ్బిలి చిరంజీవులు చీపురుపల్లి – కిమిడి నాగార్జున గజపతినగరం – కె.అప్పలనాయుడు ఎస్ కోట – కోళ్ల లలితకుమారి బొబ్బిలి – సుజయ్‌కృష్ణ రంగారావు సాలూరు – భాంజ్‌దేవ్ విశాఖపట్నం విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణబాబు విశాఖ సౌత్ – వాసుపల్లి గణేష్‌కుమార్ విశాఖ నార్త్ – గంటా శ్రీనివాసరావు విశాఖ వెస్ట్ – పీజీవీఆర్ నాయుడు అరకు – కిడారి శ్రావణ్‌కుమార్ పాడేరు – గిడ్డి ఈశ్వరి అనకాపల్లి – పీలా గోవింద సత్యనారాయణ యలమంచిలి – పంచకర్ల రమేష్‌బాబు పాయకరావుపేట – డాక్టర్ బుడుమూరి బంగారయ్య నర్సీపట్నం – చింతకాయల అయ్యన్నపాత్రుడు తూర్పుగోదావరి తుని – యనమల కృష్ణుడు ప్రత్తిపాడు – వరుపుల జోగిరాజు(రాజా) కాకినాడ రూరల్ – పిల్లి అనంతలక్ష్మి పెద్దాపురం – నిమ్మకాయల చినరాజప్ప అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వరరావు రామచంద్రాపురం – తోట త్రిమూర్తులు ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు రాజోలు – గొల్లపల్లి సూర్యారావు పి గన్నవరం – నేలపూడి స్టాలిన్‌బాబు కొత్తపేట – బండారు సత్యానందరావు మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు రాజానగరం – పెందుర్తి వెంకటేష్ రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్యచౌదరి జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ పశ్చిమగోదావరి కొవ్వూరు – వంగలపూడి అనిత ఆచంట – పితాని సత్యనారాయణ పాలకొల్లు – నిమ్మల రామానాయుడు భీమవరం – పులపర్తి రామాంజనేయులు ఉండి – వేటుకూరి వెంకట శివరామరాజు తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ తాడేపల్లిగూడెం – ఈలి వెంకట మధుసూదనరావు (నాని) దెందులూరు – చింతమనేని ప్రభాకర్ ఏలూరు – బడేటి కోట రామారావు(బుజ్జి) గోపాలపురం – ముప్పిడి వెంకటేశ్వరరావు చింతలపూడి – కర్రా రాజారావు కృష్ణా తిరువూరు – కేఎస్ జవహర్ నూజివీడు – ముద్దరబోయిన వెంకటేశ్వరరావు గన్నవరం – వల్లభనేని వంశీమోహన్ గుడివాడ – దేవినేని అవినాష్ కైకలూరు – జయమంగళ వెంకటరమణ మచిలీపట్నం – కొల్లు రవీంద్ర అవనిగడ్డ – మండలి బుద్ధప్రసాద్ పెనమలూరు – బోడె ప్రసాద్ విజయవాడ వెస్ట్ – షబనా ముసరాత్ ఖాతూన్ విజయవాడ సెంట్రల్ – బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ ఈస్ట్ – గద్దె రామ్మోహన్ మైలవరం – దేవినేని ఉమామహేశ్వరరావు నందిగామ – తంగిరాల సౌమ్య జగ్గయ్యపేట – శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య) గుంటూరు పెదకూరపాడు – కొమ్మాలపాటి శ్రీధర్ తాడికొండ – శ్రీరామ్ మాల్యాద్రి మంగళగిరి – నారా లోకేష్ పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర వేమూరు – నక్కా ఆనంద్‌బాబు రేపల్లె – అనగాని సత్యప్రసాద్ తెనాలి – ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రత్తిపాడు – డొక్కా మాణిక్యవరప్రసాద్ గుంటూరు వెస్ట్ – మద్దాల గిరి గుంటూరు ఈస్ట్ – మహ్మద్ నసీర్ చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి – కోడెల శివప్రసాదరావు వినుకొండ – జీవీ ఆంజనేయులు గురజాల – యరపతినేని శ్రీనివాసరావు ప్రకాశం యర్రగొండపాలెం – బుధల అజితారావు పర్చూరు – ఏలూరి సాంబశివరావు అద్దంకి – గొట్టిపాటి రవికుమార్ చీరాల – కరణం బలరామకృష్ణమూర్తి సంతనూతలపాడు – బి.విజయ్‌కుమార్ ఒంగోలు – దామచర్ల జనార్దన్ కందుకూరు – పోతుల రామారావు కొండెపి – జీబీవీ స్వామి మార్కాపురం – కందుల నారాయణరెడ్డి గిద్దలూరు – అశోక్‌రెడ్డి నెల్లూరు ఆత్మకూరు – బొల్లినేని కృష్ణయ్య కోవూరు – పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ – ఆదాల ప్రభాకర్‌రెడ్డి సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గూడూరు– పాశం సునీల్ వైఎస్సార్ కడప బద్వేల్ – ఓబులాపురం రాజశేఖర్ రాజంపేట – బత్యాల చెంగల్రాయుడు రాయచోటి – రెడ్డపగారి రమేష్‌కుమార్‌రెడ్డి పులివెందుల – సింగారెడ్డి వెంకట సతీష్‌రెడ్డి కమలాపురం – పుత్తా నరసింహారెడ్డి జమ్మలమడుగు – పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్ కర్నూలు ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పాణ్యం – గౌరు చరితారెడ్డి డోన్ – కేఈ ప్రతాప్ పత్తికొండ – కేఈ శ్యామ్‌బాబు ఎమ్మిగనూరు – బి.జయనాగేశ్వరరెడ్డి మంత్రాలయం – తిక్కారెడ్డి ఆదోని – మీనాక్షినాయుడు ఆలూరు – కోట్ల సుజాతమ్మ అనంతపురం రాప్తాడు – పరిటాల శ్రీరామ్ హిందూపురం – నందమూరి బాలకృష్ణ పెనుకొండ – బీకే పార్థసారథి పుట్టపర్తి – పల్లె రఘునాథరెడ్డి ధర్మవరం – గోనుగుంట్ల సూర్యనారాయణ చిత్తూరు పీలేరు – నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పుంగనూరు – ఎన్.అనూషారెడ్డి చంద్రగిరి – పులివర్తి వెంకట మణిప్రసాద్(నాని) తిరుపతి – ఎం.సుగుణమ్మ శ్రీకాళహస్తి – బొజ్జల సుధీర్‌రెడ్డి నగరి – గాలి భానుప్రకాష్ పలమనేరు – ఎన్.అమర్నాథ్రెడ్డి కుప్పం – నారా చంద్రబాబునాయుడు -
యస్ బ్యాంక్ చీఫ్ పదవికి షార్ట్‌లిస్ట్ సిద్ధం
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ ఎండీ, సీఈవో రాణా కపూర్ ఈ నెలాఖరులో తప్పుకోనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో నియమించే అవకాశం ఉన్న అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో అభ్యర్థుల పేర్లను ఖ రారు చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు బ్యాంక్ తెలియజేసింది. కొత్త సీఈవో, ఎండీ నియామకానికి గురువారం ఆర్బీఐ ఆమోదం కోరనున్నట్లు వివరించింది. అయితే, షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. రాణా సారథ్యంలో యస్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఆయన్ను మరో దఫా ఎండీ, సీఈవోగా కొనసాగించడానికి రిజర్వ్ బ్యాంక్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో జనవరి 31తో ఆయన తప్పుకోవాల్సి వస్తోంది. -
కాంగ్రెస్ మూడో జాబితా
-
కాంగ్రెస్ మూడో జాబితా విడుదల
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థులు దాదాపుగా ఖరారయ్యారు. మూడో జాబితాలో 13 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. టీడీపీ కూడా పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులను ప్రకటించింది. నాలుగో జాబితాలో సనత్ నగర్ స్థానం నుంచి పార్టీ నేత కూన వెంకటేశ్ గౌడ్‌కు అవకాశం కల్పించింది. కాంగ్రెస్ ఆశిస్తున్న ఈ స్థానాన్ని టీడీపీ ప్రకటించడంతో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. నిజామాబాద్ రూరల్ నుంచి టికెట్ ఆశించిన టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావుకు ఈసారి మొండిచేయి ఎదురైంది. ఇటీవలే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ రేకుల భూపతిరెడ్డికి ఆ సీటును కేటాయించారు. దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 88కి చేరింది. ఇంకా ఆరు స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. మూడో జాబితాలో ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు, ముగ్గురు ఎస్టీలు, ఒక ఎస్సీకి సీట్లు దక్కాయి. కాంగ్రెస్ మూడో జాబితా సంఖ్య నియోజకవర్గం అభ్యర్థి 1 బోథ్ సోయం బాపూరావు 2 నిజామాబాద్ రూరల్ రేకుల భూపతి రెడ్డి 3 నిజామాబాద్ అర్బన్ తాహెర్ బిన్ హుందాన్ 4 బాల్కొండ ఈర్రవతి అనిల్ కుమార్ 5 ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి 6 కార్వాన్ ఉస్మాన్బిన్ హజారీ 7 యాకుత్‌పురా రాజేందర్ రాజు 8 బహదూర్‌పురా కాలెంబాబా 9 కొల్లాపూర్ హర్షవర్దన్ రెడ్డి 10 తుంగతుర్తి అద్దంకి దయాకర్ 11 జనగామ పొన్నాల లక్ష్మయ్య 12 ఇల్లందు బానోత్ హరిప్రియా నాయక్ 13 దేవరకొండ బాలూ నాయక్ టీటీడీ నాలుగో జాబితా సంఖ్య నియోజకవర్గం అభ్యర్థి పేరు 1 సనత్ నగర్ కూన వెంకటేశ్ గౌడ్ -
అప్పుడు మాటలు.. ఇప్పుడు మూటలు!
సాక్షి, హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇప్పుడు మూటలు విప్పుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎద్దేవా చేశారు. ఏ కారణంతో తొమ్మిది నెలల ముందు ఎన్నికలకు వెళ్లారో ఇప్పటివరకు చెప్పలేకపోవడం అసమర్థతే అని దుయ్యబట్టారు. సెంట్‌మెంట్‌తో ప్రజలను రెచ్చగొట్టి మరోసారి ఓట్లు దండుకునేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని ఆరోపించారు. పొత్తుల వ్యవహారం, సీట్ల సర్దుబాటుపై శుక్రవారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పొత్తులపై శనివారం పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందని, తమ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుబాయి పర్యటనలో ఉండటం వల్ల ఇంకా ఖరారు కాలేదని వివరించారు. అభ్యర్థుల జాబితా ఖరారు కాగానే హైదరాబాద్‌లో విడుదల చేస్తామని, పార్టీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీలో ఉండటం వల్ల అక్కడ విడుదల చేయడం కూడా తప్పేమీ కాదంటూ టీఆర్ఎస్ ఆరోపణలను కొట్టిపారేశారు. బీసీలకు సీట్ల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ వచ్చిన ఆరోపణలపై జానారెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేవలం కాం గ్రెస్ పార్టీ తరఫున కాకుండా భాగస్వామ్య పార్టీల్లో కూడా బీసీలున్నారని, గతంలో ఇచ్చినట్టుగానే బీసీలకు సీట్లు కేటాయింపు ఉంటుందని వివరణ ఇచ్చారు. జనగామ నుంచి టీజేఎస్ తరఫున కోదండరాం పోటీ చేస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, జనగామ సీటు పొన్నాల లక్ష్మయ్యకే ఇస్తారని భావిస్తున్నట్టు జానారెడ్డి పేర్కొన్నారు. పొత్తుల్లో భాగంగా ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్నదానిపై శనివారం తుది చర్చలుంటా యని, ఆ తర్వాత పూర్తిస్థాయిలో భాగస్వామ్య పక్షాలకు స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. అవి నాన్సెన్స్ వ్యాఖ్యలు... మహాకూటమి మొత్తం చంద్రబాబు చేతిలో ఉందని వస్తున్న వ్యాఖ్యలపై జానారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. అవి నాన్సెన్స్ వ్యాఖ్యలని, టీఆర్ఎస్ నేతలు పనిగట్టుకొని ఆరోపించినంత మాత్రాన తమకేం ఇబ్బంది లేదని స్పష్టంచేశారు. పొత్తుల కమిటీ చైర్మన్ తాను కాదని, కేవలం పార్టీలతో చర్చించాలని సూచించిన మేరకే టీజేఎస్, సీపీఐ, టీడీపీతో చర్చించానని తెలిపారు. దేశంలో ఏ పార్టీ కూడా మూడు నెలల ముందు టికెట్లు ప్రకటించలేదని, కేసీఆర్‌కు అధికార దాహం ఉండటం వల్లే ముందస్తుకు వెళ్లి టికెట్లు కూడా ముందస్తుగా ప్రకటించారని విమర్శించారు. కేసీఆర్ ఫ్రంట్ పేరుతో ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్ తదితర ప్రాంతాల్లో తిరిగారని, కానీ చివరకు అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్కు వంద సీట్లు రాకపోతే కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సవాల్‌పై జానారెడ్డి స్పందిస్తూ.. పని అయిపోతే ఎవరైనా సన్యాసమే తీసుకుంటారని చమత్కరించారు. సర్వేలపై నమ్మకం లేదు... ఇండియాటుడే నిర్వహించిన సర్వేను జర్నలిస్టులు ప్రస్తావించగా.. అమెరికాలో జరిగిన ఎన్నికల సందర్భంలో ఇదే జాతీయ మీడియా సర్వేలో హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని చెప్పారని, కానీ చివరకు ఎవరు గెలిచారో చూసుకోవాలని జానారెడ్డి వ్యాఖ్యానించారు. తమిళనాడులో గత ఎన్నికల సర్వేల్లో డీఎంకే గెలుస్తుందని వచ్చినా, చివరకు అన్నాడీఎంకే గెలిచిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు సీఎం అయినా అభ్యంతరం లేదని, కుటుంబంలో రెండు సీట్ల వ్యవహారంపై అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని పేర్కొన్నారు. తన కుమారుడికి మిర్యాలగూడ టికెట్ విషయంలో అధిష్టానం ఆదేశాల ప్రకారమే వెళ్తామని, గతంలో కూడా అధిష్టానం ఆదేశంతో పోటీచేయలేదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో బాబు జోక్యం ఉండదని, ఉంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు అడ్డుకున్నా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రాజెక్టుల విషయంలో బాబు లేఖలు రాశారని ఆరోపిస్తున్న కేసీఆర్‌కు, చంద్రబాబుతో మాట్లాడుకొని ఒప్పించే దైర్యం లేదని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ పోలవరంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టులపై లేఖలు రాయలేదా అని ప్రశ్నించారు. మా ఇంటికే బాబు వచ్చాడు... చంద్రబాబును కలిసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా వేచి చూశారని, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ జర్నలిస్టులు ప్రశ్నించగా, జానారెడ్డి స్పందిస్తూ.. ‘‘మేమేమీ చంద్రబాబు ఇంటికి గానీ కార్యాలయానికి గానీ వెళ్లలేదు. ఆయనే మా పార్టీ అధినేత రాహుల్ ఇంటికి వచ్చారు. రాహుల్ ఇల్లంటే మా ఇల్లే. అక్కడ చంద్రబాబు ఉండటం వల్ల కలిశాం. అంతేగానీ మేమేమీ బాబు కోసం వెయిట్ చేయలేదు. ఈ విషయంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారు. కూటమిలో టీడీపీ భాగస్వామ్య పార్టీ. అలాంటప్పుడు చంద్రబాబుతో చర్చించడం తప్పెలా అవుతుంది’’అని ప్రశ్నించారు. ఏపీ భవన్లో ఉన్నప్పుడు కూడా ఒకే చాంబర్లో కలిసి చర్చించామని తెలిపారు. ఒకప్పుడు తన ఇంటి ఎదుట కూడా చాలామంది నేతలు నిలబడ్డారని, కావాలంటే పాత ఫొటోలు రిలీజ్ చేస్తా చూసుకోవాలంటూ టీఆర్ఎస్కు బదులిచ్చారు. నెమ్మదిగా వెళ్లిన తాబేలుదే విజయం.. ఎన్నికల్లో పరిగెత్తిన కుందేలు పడుకోబోతోందని, నెమ్మదిగా వెళ్తున్న తాబేలు గెలుస్తోందని జానారెడ్డి జోస్యం చెప్పారు. టికెట్లపరంగా అందరికీ అవకాశాలు ఇవ్వాలనుకున్నా పొత్తుల వల్ల సమస్య వచ్చిందన్నారు. ఓయూ విద్యార్థి నేతలకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టికెట్ల కేటాయింపు ఉండనుందని తెలిపారు. తన కొడుకైనా, ఇంకెవరైనా గెలుపొందే అవకాశాలుంటేనే ఎంపిక చేస్తున్నామని స్పష్టంచేశారు. ఈ సారి ఎన్నికల్లో కేసీఆర్ రికార్డు బ్రేక్ చేస్తామని, ఎన్నో హామీలిచ్చి అమలుచేసిన ఎన్టీఆర్కే 1989లో ఓటమి తప్పలేదని గుర్తుచేశారు. -
ఆశావహులకు కాంగ్రెస్ బుజ్జగింపులు!
సాక్షి, హైదరాబాద్: చివరి నిమిషం వరకు టికెట్ రేసులో ఉండి అదృష్టం దక్కని నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. ఢిల్లీకి పిలిపించి బుజ్జగించాల్సిన నేతల జాబితాను తయారు చేసే బాధ్యత రాష్ట్ర వ్యవహారాలు చూస్తున్న ఏఐసీసీ కార్యదర్శులకు అప్పగించింది. ఇతర పార్టీలతో పొత్తుల్లో భాగంగా కోల్పోతున్న సీట్లు, సామాజిక వర్గాల వారీ సమీకరణలు, ఇతర కారణాలతో టికెట్లు పొందలేకపోతున్న వారిలో ముఖ్యులను గుర్తించాలని, టికెట్ వచ్చిన నాయకుడి తర్వాతి స్థానంలో ఉండే వారందరి పేర్ల జాబితా తయారు చేయాలని సోమవారం పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. మరోవైపు టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డికి కూడా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. అధిష్టానం పిలిపించాల్సిన నేతలతో సమన్వయం చేసుకోవడంతో పాటు అక్కడ ఏర్పాట్లు చూసుకునే బాధ్యతను ఆయనకు అప్పగించినట్టు తెలుస్తోంది. 20 మందికి పైగా.. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకుగాను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల నుంచి దాదాపు 5 వేల మంది దరఖాస్తు చేసుకున్నా రు. అయితే, పొత్తుల్లో భాగంగా దాదాపు 25 సీట్లు ఇతర పార్టీలకు ఇవ్వాల్సి రావడం.. కొన్ని చోట్ల ముగ్గురు, నలుగురు నుంచి ఒక్కరిని ఎంపిక చేయా ల్సి రావడంతో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్న దాదాపు 20 మందికి పైగా నేతలు అవకాశం కోల్పోనున్నారు. వీరందరినీ రెం డ్రోజుల్లో ఢిల్లీకి పిలిపించాలని, నామినేషన్ల కంటే ముందే వారి అసంతృప్తిని చల్లార్చి రెబెల్‌గా బరిలో దిగకుండా పార్టీ అభ్యర్థికి సహకరించేలా ఒప్పించాలని అధిష్టానం నిర్ణయించింది. ముఖ్యంగా పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు ఇచ్చే స్థానాల్లో అవకాశం ఇవ్వలేని వారికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇవ్వనుంది. ఎమ్మెల్సీగా లేదంటే మరో రకంగా అవకాశం ఇస్తామ ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి స్థాయి నేతలు టీపీసీసీ చీఫ్ సమక్షంలో హామీ ఇవ్వనున్నారు. వీరితో పాటు ఇతర కారణాలతో పార్టీ టికెట్ దక్కని ముఖ్యులకు కూడా కచ్చితమైన భరోసా కల్పించనున్నారు. ఇతర పార్టీలతో పొత్తు అనివార్యత, ఎలాంటి పరిస్థితులలో వారికి టికెట్ ఇవ్వలేకపోయామో వివరించి భవిష్యత్తులో ఇచ్చే ప్రాధాన్యంపై వార్‌రూమ్‌లోనే హామీలు ఇవ్వనున్నట్టు సమాచారం. -
నవంబర్ మొదటివారంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను నవంబర్ మొదటివారంలో ఒకే విడతలో ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా తెలిపారు. ఇతర పార్టీలతో పొత్తులపై చర్చలు తుదిదశకు చేరుకున్నాయని, అలాగే అభ్యర్థుల ఎంపికపై క్షేత్రస్థాయిలో పార్టీ స్క్రీనింగ్ కమిటీ చేపట్టిన అధ్యయనం ఈ నెలాఖరులో పూర్తవుతుందని అన్నారు. స్క్రీనింగ్ కమిటీ సంప్రదింపులు ముగిసిన ఒకటి, రెండు రోజుల అనంతరం నవంబర్ మొదటివారంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయా సామాజికవర్గాలకు న్యాయం జరిగేలా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నేతలతో స్క్రీనింగ్ కమిటీ వరుస సమావేశాలు నిర్వహించి నేతల అభిప్రాయాలు సేకరించిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీసీలకు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన సీట్ల కంటే అధికంగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వనుందని తెలిపారు. ఈ నెల 27న పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ఇంకా ఖరారు కాలేదన్నారు. ఆరు రోజులపాటు ఆయన తెలంగాణలో పర్యటించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఆ పర్యటనలో ఉదయం మేధావులు, విద్యార్థులు, కార్మికులు, ఆయా సామాజికవర్గాలతో రాహుల్ సమావేశమై మధ్యాహ్నం బహిరంగసభల్లో పాల్గొనేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. టీఆర్ఎస్ను గద్దెదించి కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తేవడమే తమ లక్ష్యమని, దీని కోసం పొత్తుల్లో కొన్ని సీట్లు త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కుంతియా పేర్కొన్నారు. -
ఢిల్లీకి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఢిల్లీకి చేరింది. మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించిన భక్తచరణ్‌దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ బృందం శని వారం హస్తిన బయలుదేరింది. ఈ నెల 10 నుంచి 12 వరకు హైదరాబాద్‌లోనే మకాం వేసిన త్రిసభ్య స్క్రీనింగ్ కమిటీ సభ్యులు వందల మందితో జరిపిన చర్చలు, తమ వద్ద ఉన్న సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కీలక ఘట్టాన్ని పూర్తి చేశారు. తమకు వచ్చిన అంచనా మేరకు ఏ స్థానానికి ఏ అభ్యర్థి గెలుపుగుర్రమో నిర్ధారించిన జాబితాతో ఈ బృందం ఢిల్లీకి వెళ్లిందని సమాచారం. మూడు రోజులపాటు మథనం... అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ చర్చోపచర్చలు జరిపింది. చైర్మన్ భక్తచరణ్‌దాస్‌తోపాటు సభ్యులు శర్మిష్ట ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలైలు మూడు రోజులపాటు చర్చలు జరిపారు. మొదటి రోజున పార్టీ ఎన్నికల కమిటీతో చర్చించి వ్యక్తిగతం గా నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. రెండోరోజు గాంధీ భవన్లో డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధి బృందాలు, టీపీసీసీ ముఖ్య నేత లు, కొందరు ఆశావహులతో సమావేశమయ్యారు. మూడో రోజు తాము బస చేసిన హోటల్లోనే టీపీసీసీ ముఖ్య నేతలతో సమావేశమై అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు జరిపారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ముఖ్య నేతలు జానారెడ్డి, జైపాల్‌రెడ్డి, డి.కె.అరుణ, రేవంత్‌రెడ్డి తదితరులతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. అనంతరం అందరి అభిప్రాయాలను వడపోసి ఎన్నికల కమిటీ సూచించిన పేర్ల నుంచి సరైన అభ్యర్థులతో జాబితాను రూపొందించినట్లు తెలిసిం ది. ఈ జాబితాలో దాదాపు 70 వరకు స్థానాల్లో ఒకే వ్యక్తి పేరు సూచించారని తెలుస్తోంది. మిగిలిన చోట్ల ఇద్దరు, గరిష్టంగా ముగ్గురు పేర్లను మాత్రమే జత చేసినట్టు సమాచారం. చివరి నిమిషంలో అభ్యర్థుల జాబితా లో కొన్ని మార్పుచేర్పులు చేసినట్లు గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 21న మళ్లీ హైదరాబాద్‌కు.. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను పార్టీ సీనియర్ నేత ఎ.కె.ఆంటోని నేతృత్వంలోని ఏఐసీసీ ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్ కమిటీ అందజేయనుంది. ఈ నెల 16న జరిగే సమావేశంలో ఏఐసీసీ ఎన్నికల కమిటీ దీనిపై చర్చించి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి జాబితా అంది స్తారని సమాచారం. ఈలోపు స్క్రీనింగ్ కమిటీ రాహుల్‌తో సమావేశం కానుంది. ఈ నెల 20న రాష్ట్రంలో రాహుల్ పర్యటన ముగిసిన మర్నాడే స్క్రీనింగ్ కమి టీ మరోసారి హైదరాబాద్ వచ్చి ఎన్నికల కమిటీతో మళ్లీ సమావేశం కానుంది. నవంబర్లోనే పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుందని సమాచారం. ఇతర పార్టీలతో ఎలా? కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా తయారీతోపాటు పొత్తు పెట్టుకునే ఇతర పార్టీలకు కూడా ఏయే సీట్లు కేటాయించాలనే అంశంపైనా స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ, సీపీఐ, జనసమితి ఎక్కడెక్కడ పోటీ చేస్తే బాగుంటుదనే దానిపై కూడా టీపీసీసీ ముఖ్య నేతల నుంచి కమిటీ అభిప్రాయాలు సేకరించింది. పాతబస్తీలో ఎంఐఎంకు దీటుగా ఎంబీటీతో కలసి వెళ్లాలనే దాని పై కూడా స్క్రీనింగ్ కమిటీ వద్ద కీలక చర్చ జరి గిన ట్టు సమాచారం. చాంద్రాయణగుట్ట స్థానం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీకి పోటీగా ఎంఐఎం రాజకీయ ప్రత్యర్థి మహ్మద్ పహిల్వాన్ లేదా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరిని బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంమీద పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎంబీటీతో కలసి వెళ్లడమే మంచిదనే అభిప్రాయంతో కాంగ్రెస్ వర్గాలున్నట్లు తెలుస్తోంది. -
దసరా తర్వాతే కాంగ్రెస్ జాబితా
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను దసరా తర్వాతే ప్రకటించనున్నారు. మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, టీజేఎస్, సీపీఐ మధ్య సీట్ల సర్దుబాట్లు కొలిక్కి వచ్చాకే తొలి జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. సర్దుబాటుకు ముందే ఈ నిర్ణయం తీసుకుంటే కూటమిలో నిరసన వ్యక్తమయ్యే అవకాశం లేకపోలేదనే ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలుత.. ఈ నెల 15, 16 తేదీల్లో 40 మందితో తొలి జాబితా విడుదల చేయాలని కాంగ్రెస్ భావించింది. ఈలోగా కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియను ముగించాలని కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ నాయకత్వానికి సూచించింది. కానీ చర్చలపై ప్రతిష్టంభన తొలగకపోవడమే ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. కూటమి తరఫున ఉమ్మడి ప్రణాళికను విడుదల చేయడం, కూటమికి భాగస్వామ్యపక్షాల్లో ఒకరిని చైర్మన్‌గా నియమించడం వంటివి వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. టీడీపీకి 12, జనసమితికి 5 కాగా, కూటమి నిర్మాణంలో భాగంగా టీడీపీ 12 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ నియోజకవర్గాలతో కూడిన జాబితాను కాం గ్రెస్‌కు ఇచ్చింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్, రాజేంద్రనగర్‌తో పాటు మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర, మక్తల్, నల్లగొండ జిల్లా కోదాడ, కరీంనగర్ జిల్లా కోరుట్ల ఉన్నట్లు తెలిసింది. మరో ఎనిమిది నియోజకవర్గాల పేర్లు ఇచ్చి వాటిలో 4 కచ్చితంగా ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఆ ఎనిమిది నియోజకవర్గాల పేర్లు వెల్లడి కావాల్సి ఉంది. టీజేఎస్‌కు 5 స్థానాలు కేటాయించేందుకు అంగీకరించిన కాంగ్రెస్ ఆయా నియోజకవర్గాలు, పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు కూడా ఇవ్వాలని కోరింది. టీఆర్ఎస్ను ఎదుర్కొనే క్రమంలో.. సమర్థులైన అభ్యర్థులు లేకపోతే ఇబ్బందులు వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ఈ ఎన్నికల్లో పోటీచేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ కోరుతోంది. దానికి ఆయన సమ్మతించినట్లు తెలుస్తోంది. ఇకపోతే సీపీఐకి 2 స్థానాలు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కరీంనగర్ జిల్లాలో ఒకటి, ఖమ్మం జిల్లాలో ఒకటి ఇవ్వనున్నట్లు సీపీఐకి సమాచారమిచ్చింది. 40 చోట్ల అభ్యర్థుల ఖరారు కాంగ్రెస్ అధిష్టానం దూతలు, పార్టీ స్క్రీనింగ్ కమిటీ కూర్చుని కసరత్తు చేసిన తర్వాత.. ఇప్పటివరకు 40 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. ఈ నియోజకవర్గాలకు ఒక్కో పేరునే పార్టీ స్క్రీనింగ్ కమిటీ కూడా ఆమోదించింది. ఈ జాబితానే పండగ తర్వాత విడుదల చేసే అవకాశం ఉందని.. పార్టీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. 100 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే.. మరో 35 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ ప్రాంతాల్లో ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. వీటిలో మెజారిటీ స్థానాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. నల్లగొండలో 4, మహబూబ్‌నగర్‌లో 2 స్థానాల్లోనూ టిక్కెట్ల కోసం పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని స్క్రీనింగ్ కమిటీ భావిస్తోంది. అయితే, ఇప్పటికే ఖరారు చేసిన 40 నియోజకవర్గాల్లో చాలా వరకూ ఏఐసీసీ మార్గదర్శకాలకు విరుద్దంగా ఉన్నట్లు పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో 30 వేలు అంతకంటే ఎక్కువ తేడాతో ఓడిపోయిన దాదాపు 10 మంది అభ్యర్థుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అటు, కాంగ్రెస్ బరిలో ఉండాలనుకుంటున్న మరో 25 నియోజకవర్గాలకు కొత్తవారిని ఎంపిక చేయనున్నారు. ఈ 25 నియోజకవర్గాల్లో సీనియర్లు కాకుండా జూనియర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. -
కొనసాగుతున్న కాంగ్రెస్ ‘వడపోత’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు ప్రక్రి య కసరత్తు కొనసాగుతోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థుల తుది జాబితాను తయారుచేసేందుకు రాష్ట్రానికి వచ్చిన ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ వరుసగా రెండోరోజైన గురువారం బిజీబిజీగా గడిపింది. ఉదయం నుంచి రాత్రి వరకు గాంధీభవన్‌లోని ఇందిరాభవన్‌లో సమావేశాలు నిర్వహించి పార్టీ నేతలు, ఆశావహుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో భేటీ అయింది. కొందరు ఆశావహులను కూడా కలిసింది. స్క్రీనింగ్ కమిటీ సభ్యులు జాబితా రూపొందిస్తున్నారన్న సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున తరలిరావడంతో గాంధీభవన్ ప్రాంగణంలో సందడి నెలకొంది. సర్వేల్లో ఇలా వచ్చింది కదా?: స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్‌తో పాటు సభ్యులు శర్మిష్ట ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలైలు గురువారం ఉదయం తొలుత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఆయా జిల్లాల నుంచి ఆశావహుల జాబితాలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ రెండు నుంచి ఆరుగురి పేర్లు సూచించిన నియోజకవర్గాల గురించి ఆరా తీశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘ఫలానా నియోజకవర్గంలో మూడు పేర్లు ప్రదేశ్ కమిటీ సూచించింది.. ఇందులో ఎవరయితే బాగుంటుంది’అని ప్రశ్నించారు. ఫలానా వ్యక్తి అయితే బాగుంటుందని జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పినప్పుడు ఏఐసీసీ ఆధ్వర్యంలో ఆరా, ఐపీఎస్‌లతో పాటు మరో ఏజెన్సీతో నిర్వహించిన సర్వే వివరాలను సరిచూసుకున్నారు. జిల్లా అధ్యక్షులు సూచించిన పేరు సర్వే వివరాలతో సరిపోలితే ఆ చర్చను అక్కడితో ముగించారు. జిల్లా అధ్యక్షులు చెప్పిన వ్యక్తికి సర్వేలో మంచి ఫలితం రాకపోతే ఆ అభ్యర్థిని ఎందుకు ప్రతిపాదిస్తున్నారని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ప్రశ్నించారు. ఏయే స్థానాల్లో ఏయే సామాజికవర్గాల ప్రభావం ఉంటుందని, ఫలానా సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని కూడా జిల్లా అధ్యక్షులను ప్రశ్నించినట్లు సమాచారం. ముగ్గురు, నలుగురు పేర్లున్న చోట ఒక వ్యక్తికి టికెట్ ఇస్తే మిగిలిన వారికి ఎలాంటి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ, నామినేటెడ్, పార్టీ పోస్టు ఇచ్చి సరిపెట్టవచ్చా అని ప్రశ్నించారు. పార్టీలో గ్రూపు తగాదాలుంటే ఎలా సమన్వయం చేయాలి? జిల్లా రాజకీయ పరిస్థితులేంటి అనే అంశాలపై కూడా స్క్రీనింగ్ కమిటీ జిల్లా పార్టీ అధ్యక్షులను ఆరా తీశారు. సీట్లు కోరిన అనుబంధ సంఘాలు పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధి బృందాలతో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ముందుగా యూత్కాంగ్రెస్తో ప్రారంభించి ఎన్ఎస్యూఐ, సేవాదళ్, మహిళా కాంగ్రెస్, బీసీ సెల్ ప్రతినిధులతో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ సభ్యులు వారి నుంచి వివరాలు రాబట్టారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని అన్ని అనుబంధ సంఘాలు కోరగా, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద నేతృత్వంలోని మహిళా కాంగ్రెస్ నేతలు తాము అడుగుతున్న నియోజకవర్గాలు, అభ్యర్థుల జాబితాను కమిటీకి అందజేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారితో సహా 27 చోట్ల మహిళలకు అవకాశం కల్పించాలని కోరారు. ఇందులో మహేశ్వరం, గద్వాల, జహీరాబాద్, నర్సాపూర్, కోదాడ, ఆర్మూర్, ములుగు, పరకాల, సికింద్రాబాద్, కరీంనగర్, జుక్కల్, చేవెళ్ల, నకిరేకల్, మహబూబాబాద్, బోథ్, ఇల్లెందు, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆదిలాబాద్, చొప్పదండి నియోజకవర్గాలున్నట్లు సమాచారం. బీసీ సెల్ నేతలు కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 2 స్థానాల చొప్పున వెనుకబడిన వర్గాలకు కేటాయించాలని, పొత్తుల్లో ఇతర పార్టీలకు ఇవ్వాల్సి వచ్చినా కనీసం 28 సీట్లకు తగ్గకుండా బీసీలకు అవకాశం ఇవ్వాలని చిత్తరంజన్‌దాస్, పి.వినయ్‌కుమార్ బృందం కోరింది. టీపీసీసీ సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్దన్‌రెడ్డి నేతృ త్వంలోని బృందం కూడా సేవాదళ్‌కు మూడు సీట్లు ఇవ్వాలని కోరింది.