సాక్షి, న్యూఢిల్లీ :చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బంగారు కుటుంబసభ్యులు చేసినవన్నీ దొంగ దీక్షలేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. 33 శాతం రిజర్వేషన్లు అంటూ డిమాండ్ చేసి.. 3+3 కలిసి 6 సీట్లే మహిళలకు కేటాయించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.
‘ఇవేనా మీ బంగారు కుటుంబానికి వచ్చే లెక్కలు? ఇదేనా మహిళలకు మీరు చేయాలనుకున్న న్యాయం?’అంటూ పరోక్షంగా ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ప్రశ్నించారు. సోమ వారం బీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల ప్రక టన అనంతరం కిషన్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘బీఆర్‌ఎస్ పార్టీ విడుదల చేసిన జాబితా చూస్తుంటే.. మరోసారి అధికారంలోకి రాలేమని కేసీఆర్‌కు అర్థమైనట్లుగా తెలుస్తోంది.
రోజురోజుకూ ఎస్సీ, ఎస్టీలతో పాటు అన్ని వర్గాల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కేసీఆర్‌లో ఆందోళన మొదలైంది. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకోవడం ఆయనలో నెలకొన్న భయానికి నిదర్శనం..’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
దోస్తుకు కేసీఆర్ మద్దతు
‘మతోన్మాద మజ్లిస్ అభ్యర్థులను గెలిపించేందుకు, ఆ పార్టీ వ్యతిరేక ఓట్లు చీలేందుకు, ఆయా ప్రాంతాల్లో ఒవైసీ చెప్పిన అభ్యర్థులను బరిలో దించుతూ..కేసీఆర్ దోస్తుకు మద్దతుగా నిలుస్తున్నారు..’అని కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ ప్రాంతంలో బీఆర్‌ఎస్, మజ్లిస్ కలిసి 29 సీట్లు గెలవాలని కేసీఆర్ మీడియా సమావేశంలోనే ప్రకటించారని పేర్కొన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇవ్వడం ద్వారా.. కేసీఆర్ ఎన్నికల్లో ఓట మిని అంగీకరించారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment