విలేకరులతో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి
బీజేపీ ప్రత్యర్థులు మోదీ, కేంద్రమంత్రులపై ఒక్క అవినీతి ఆరోపణ చేయలేకపోయారు
తాత్కాలిక ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఉచితాలు ఇచ్చింది
కేసీఆర్, కేటీఆర్ తప్పిదాలతోనే తెలంగాణకు నష్టం
సాక్షి, హైదరాబాద్: మోదీ ప్రభుత్వ అభివృద్ధి ఎజెండా ఆధారంగానే ప్రజలను ఓట్లు అడుగుతామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత పదేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తామని చెప్పారు. కేంద్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు పూర్తి భిన్నంగా నీతివంతమైన, ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను మోదీ అందించారన్నారు. బీజేపీ ప్రత్యర్థులు కూడా మోదీ, కేంద్ర మంత్రులపై ఒక్క అవినీతి ఆరోపణ చేయలేకపోయారంటే వాస్తవ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
సోమవారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2004–14 మధ్య కాంగ్రెస్ హయాంలో ‘పాలసీ పెరాలసిస్’ (పాలనాపర మైన వైఫల్యం) సాగిందని మండిపడ్డారు. ఆనాడు తాత్కాలిక ప్రయోజనాల కోసమే ప్రజలకు కాంగ్రెస్ ఉచితాలు ఇచ్చిందన్నారు. యూపీఏ (కాంగ్రెస్) పాలనలో అమలైన పథకాలు నినాదాలకే పరిమితమయ్యాయని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాలేకపోయాయని విమర్శించారు. గత పదేళ్ల మోదీ సర్కార్ పాలనలో మన దేశమే చాలా దేశాలకు చేయూతనందిస్తుందని, అనేక విష యాల్లో చేదోడువాదోడుగా నిలుస్తోందన్నారు.
రూ.34 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అందాయి
ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఓ ప్రభావవంతమైన ముందడుగు పడిందన్నారు. ఎన్నికల్లో గెలి చేందుకు ఉచితాలు ఇవ్వడం వంటి ఆలోచనల నుంచి బయటపడి, దీర్ఘకాలంలో సామాజికంగా లాభం చేకూర్చే కార్యక్రమాలను రూపొందించిందన్నారు. కులమతాలకు అతీతంగా రూ.34 లక్షల కోట్ల విలువ చేసే సంక్షేమ పథకాలను మోదీ ప్రభుత్వం అందించిందన్నారు. కేంద్రం తీసుకొచ్చి న సంస్కరణల వల్ల దేశవ్యాప్తంగా సరాసరి 22 గంటల విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.
అత్యంత తక్కువ సమయంలో బీఆర్‌ఎస్ అంతర్థానం
అత్యంత తక్కువ సమయంలో అంతర్థానం కాను న్న పార్టీ బీఆర్‌ఎస్ అని కిషన్‌రెడ్డి ఒక ప్రశ్నకు బదు లిచ్చారు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన పర్యటనపై స్పందించాల్సింది ఏమీ లేదని చెప్పా రు. రాష్ట్రంలో ఎన్‌టీపీసీ ప్లాంట్ శంకుస్థాపనకు వచ్చిన కేసీఆర్, ప్రారంభోత్సవానికి రాలేదన్నారు. రాష్ట్రాభివృద్ధికి వివిధ రూపాల్లో కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తే సీఎంగా కేసీఆర్ ఏ మాత్రం సహకారం అందించలేదని చెప్పారు. కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్య లపై ఆయన్ను చూసి మనమందరం జాలి పడాల్సి ఉందన్నారు. తాను సీఎం అయినట్టు కేటీఆర్ కలలు కన్నారని, చివరకు అవి విఫలం అయ్యా యని, కేసీఆర్, కేటీఆర్‌ల తప్పిదాల వల్లనే తెలంగాణకు తీరని నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment