‘లీకుల ఇచ్చేది బీజేపీ.. వార్తలు రాయించేది బీజేపీ’ | Balka Suman Slams On BJP Kishan Reddy Alliance In Telangana | Sakshi
Sakshi News home page

‘సమస్యలు లేనట్టు సీఎం రేవంత్‌ ఢిల్లీకి చెక్కర్లు’

Feb 19 2024 9:37 PM | Updated on Feb 19 2024 9:38 PM

Balka Suman Slams On BJP Kishan Reddy Alliance In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పొత్తుల గురించి ఎవరు మాట్లాడారు? అని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ప్రశ్నించారు. తాము కిషన్‌రెడ్డితో ఏమైనా.. ఎప్పుడైనా పొత్తుల గురించి ఉసెత్తమా? అని అన్నారు. సోమవారం బాల్క సుమన్‌ మీడియాతో మాట్లాడారు. ‘బండి సంజయ్, లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి ఎందుకు ఎగిరి పడుతున్నారు. బీఆర్‌ఎస్‌ ఒక సెక్యూలర్ పార్టీ మా నాయకుడు సెక్యులర్ నాయకుడు. లీకుల ఇచ్చేది బీజేపీ.. వార్తలు రాయించేది బీజేపీ. 

.. గడిచిన 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. అక్కడ ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తున్నా.. మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. యూట్యూబ్ ఛానెల్‌లు, మేధావులకు ఈ విద్యార్థినీల ఆత్మహత్యలు కనిపించడం లేదా?. మేధావులు స్పందించాలి. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే.. రాష్ట్రంలో సమస్యలు లేనట్టు ఢిల్లీకి చెక్కర్లు కొడుతున్నారు’ అని బాల్క సుమన్‌ విమర్శలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement