
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ ఎండీ, సీఈవో రాణా కపూర్ ఈ నెలాఖరులో తప్పుకోనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో నియమించే అవకాశం ఉన్న అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో అభ్యర్థుల పేర్లను ఖ రారు చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు బ్యాంక్ తెలియజేసింది.
కొత్త సీఈవో, ఎండీ నియామకానికి గురువారం ఆర్‌బీఐ ఆమోదం కోరనున్నట్లు వివరించింది. అయితే, షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. రాణా సారథ్యంలో యస్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఆయన్ను మరో దఫా ఎండీ, సీఈవోగా కొనసాగించడానికి రిజర్వ్ బ్యాంక్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో జనవరి 31తో ఆయన తప్పుకోవాల్సి వస్తోంది.