126 మందితో టీడీపీ తొలి జాబితా | TDP Releases First List of Candidates for Andhra Pradesh Assembly | Sakshi
Sakshi News home page

126 మందితో టీడీపీ తొలి జాబితా

Published Fri, Mar 15 2019 2:18 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

TDP Releases First List of Candidates for Andhra Pradesh Assembly - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ 126 మందితో తమ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి విడత జాబితాను విడుదల చేసింది. ఎంపీ అభ్యర్థులతోపాటు 49 అసెంబ్లీ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఉండవల్లిలోని ప్రజావేదికలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు ఈ జాబితాను విడుదల చేశారు. ఎంపీలుగా పోటీ చేయించే ఉద్దేశంతో మంత్రులు కాల్వ శ్రీనివాసులు, శిద్ధా రాఘవరావు, ఆదినారాయణరెడ్డిలకు ఈ జాబితాలో చోటు కల్పించలేదు. ప్రకటించిన స్థానాల్లో 72 మంది ఓసీలు కాగా, 31 మంది బీసీలు, 17 మంది ఎస్సీలు, నలుగురు ఎస్టీ, ఇద్దరు మైనారిటీ అభ్యర్థులు ఉన్నారు. ఏడుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, ఐతాబత్తుల ఆనందరావు, పులపర్తి నారాయణమూర్తి, పీతల సుజాత, తెనాలి శ్రావణ్‌కుమార్, పాలపర్తి డేవిడ్‌రాజు, జయరాములుకు మొండిచేయి చూపి వారి స్థానాల్లో వేరే వారిని ఎంపిక చేశారు. 24 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మొదటి జాబితాలో చోటు దక్కకపోవడం విశేషం. తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో మంత్రి కేఎస్‌ జవహర్‌కు పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కొవ్వూరును కాదని కృష్ణా జిల్లాలోని తిరువూరు సీటును కేటాయించారు.

కొవ్వూరు సీటును విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కేటాయించారు. మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావును భీమిలికి బదులుగా విశాఖ నార్త్‌కు మార్చారు. ఆరుగురు సీనియర్ల వారసులకు టికెట్లు కేటాయించారు. ఆ మేరకు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్థానంలో ఆయన కుమారుడు కేఈ శ్యాంబాబు, మంత్రి పరిటాల సునీత స్థానంలో ఆమె కుమారుడు శ్రీరామ్, కిమిడి మృణాళినికి బదులు ఆమె తనయుడు నాగార్జున, గౌతు శ్యాంసుందర శివాజీ స్థానంలో ఆయన కూతురు శిరీష, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్థానంలో ఆయన తనయుడు శ్రీధర్‌రెడ్డి, జలీల్‌ఖాన్‌ స్థానంలో ఆయన కూతురు షబనా ఖాతూన్‌కు టికెట్లు కేటాయించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 22 మందిలో 13 మందికి టికెట్లు కేటాయించగా ముగ్గురిని పక్కన పెట్టారు. జాబితా విడుదలకు ముందు చంద్రబాబు పొలిట్‌బ్యూరో సమావేశం ఏర్పాటుచేసి జాబితాకు ఆమోదముద్ర వేయించారు. ఎంపీ అభ్యర్థులు, మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు. 

శ్రీకాకుళం  
ఇచ్ఛాపురం – బెందాళం అశోక్‌ 
పలాస – గౌతు శిరీష 
టెక్కలి – కింజరాపు అచ్చెన్నాయుడు  
పాతపట్నం – కలమట వెంకటరమణ 
శ్రీకాకుళం – గుండా లక్ష్మీదేవి  
ఆముదాలవలస – కూన రవికుమార్‌  
ఎచ్చెర్ల – కిమిడి కళా వెంకట్రావు  
నరసన్నపేట – బగ్గు రమణమూర్తి 
రాజాం – కొండ్రు మురళీ  

విజయనగరం 
కురుపాం – జనార్థన్‌ దాట్రాజ్‌ 
పార్వతీపురం – బొబ్బిలి చిరంజీవులు 
చీపురుపల్లి – కిమిడి నాగార్జున 
గజపతినగరం – కె.అప్పలనాయుడు 
ఎస్‌ కోట – కోళ్ల లలితకుమారి 
బొబ్బిలి – సుజయ్‌కృష్ణ రంగారావు 
సాలూరు – భాంజ్‌దేవ్‌ 

విశాఖపట్నం 
విశాఖ ఈస్ట్‌ – వెలగపూడి రామకృష్ణబాబు 
విశాఖ సౌత్‌ – వాసుపల్లి గణేష్‌కుమార్‌ 
విశాఖ నార్త్‌ – గంటా శ్రీనివాసరావు 
విశాఖ వెస్ట్‌ – పీజీవీఆర్‌ నాయుడు 
అరకు – కిడారి శ్రావణ్‌కుమార్‌ 
పాడేరు – గిడ్డి ఈశ్వరి 
అనకాపల్లి – పీలా గోవింద సత్యనారాయణ 
యలమంచిలి – పంచకర్ల రమేష్‌బాబు 
పాయకరావుపేట – డాక్టర్‌ బుడుమూరి బంగారయ్య 
నర్సీపట్నం – చింతకాయల అయ్యన్నపాత్రుడు 

తూర్పుగోదావరి 
తుని – యనమల కృష్ణుడు 
ప్రత్తిపాడు – వరుపుల జోగిరాజు(రాజా) 
కాకినాడ రూరల్‌ – పిల్లి అనంతలక్ష్మి 
పెద్దాపురం – నిమ్మకాయల చినరాజప్ప 
అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 
కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వరరావు 
రామచంద్రాపురం – తోట త్రిమూర్తులు 
ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు 
రాజోలు – గొల్లపల్లి సూర్యారావు 
పి గన్నవరం – నేలపూడి స్టాలిన్‌బాబు 
కొత్తపేట – బండారు సత్యానందరావు 
మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు 
రాజానగరం – పెందుర్తి వెంకటేష్‌ 
రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి భవానీ 
రాజమండ్రి రూరల్‌ – గోరంట్ల బుచ్చయ్యచౌదరి 
జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ 

పశ్చిమగోదావరి  
కొవ్వూరు – వంగలపూడి అనిత 
ఆచంట – పితాని సత్యనారాయణ 
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు 
భీమవరం – పులపర్తి రామాంజనేయులు 
ఉండి – వేటుకూరి వెంకట శివరామరాజు 
తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ 
తాడేపల్లిగూడెం – ఈలి వెంకట మధుసూదనరావు (నాని) 
దెందులూరు – చింతమనేని ప్రభాకర్‌ 
ఏలూరు – బడేటి కోట రామారావు(బుజ్జి) 
గోపాలపురం – ముప్పిడి వెంకటేశ్వరరావు 
చింతలపూడి – కర్రా రాజారావు 

కృష్ణా 
తిరువూరు – కేఎస్‌ జవహర్‌ 
నూజివీడు – ముద్దరబోయిన వెంకటేశ్వరరావు 
గన్నవరం – వల్లభనేని వంశీమోహన్‌ 
గుడివాడ – దేవినేని అవినాష్‌ 
కైకలూరు – జయమంగళ వెంకటరమణ 
మచిలీపట్నం – కొల్లు రవీంద్ర 
అవనిగడ్డ – మండలి బుద్ధప్రసాద్‌ 
పెనమలూరు – బోడె ప్రసాద్‌ 
విజయవాడ వెస్ట్‌ – షబనా ముసరాత్‌ ఖాతూన్‌ 
విజయవాడ సెంట్రల్‌ – బొండా ఉమామహేశ్వరరావు 
విజయవాడ ఈస్ట్‌ – గద్దె రామ్మోహన్‌ 
మైలవరం – దేవినేని ఉమామహేశ్వరరావు 
నందిగామ – తంగిరాల సౌమ్య 
జగ్గయ్యపేట – శ్రీరామ్‌ రాజగోపాల్‌(తాతయ్య) 

గుంటూరు  
పెదకూరపాడు – కొమ్మాలపాటి శ్రీధర్‌ 
తాడికొండ – శ్రీరామ్‌ మాల్యాద్రి 
మంగళగిరి – నారా లోకేష్‌ 
పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర 
వేమూరు – నక్కా ఆనంద్‌బాబు 
రేపల్లె – అనగాని సత్యప్రసాద్‌ 
తెనాలి – ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ 
ప్రత్తిపాడు – డొక్కా మాణిక్యవరప్రసాద్‌ 
గుంటూరు వెస్ట్‌ – మద్దాల గిరి 
గుంటూరు ఈస్ట్‌ – మహ్మద్‌ నసీర్‌ 
చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు 
సత్తెనపల్లి – కోడెల శివప్రసాదరావు 
వినుకొండ – జీవీ ఆంజనేయులు 
గురజాల – యరపతినేని శ్రీనివాసరావు 

ప్రకాశం 
యర్రగొండపాలెం – బుధల అజితారావు 
పర్చూరు – ఏలూరి సాంబశివరావు 
అద్దంకి – గొట్టిపాటి రవికుమార్‌ 
చీరాల – కరణం బలరామకృష్ణమూర్తి 
సంతనూతలపాడు – బి.విజయ్‌కుమార్‌ 
ఒంగోలు – దామచర్ల జనార్దన్‌ 
కందుకూరు – పోతుల రామారావు 
కొండెపి – జీబీవీ స్వామి 
మార్కాపురం – కందుల నారాయణరెడ్డి 
గిద్దలూరు – అశోక్‌రెడ్డి 

నెల్లూరు  
ఆత్మకూరు – బొల్లినేని కృష్ణయ్య 
కోవూరు – పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి 
నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ 
నెల్లూరు రూరల్‌ – ఆదాల ప్రభాకర్‌రెడ్డి 
సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి  
గూడూరు– పాశం సునీల్‌ 

వైఎస్సార్‌ కడప 
బద్వేల్‌ – ఓబులాపురం రాజశేఖర్‌ 
రాజంపేట – బత్యాల చెంగల్రాయుడు 
రాయచోటి – రెడ్డపగారి రమేష్‌కుమార్‌రెడ్డి 
పులివెందుల – సింగారెడ్డి వెంకట సతీష్‌రెడ్డి 
కమలాపురం – పుత్తా నరసింహారెడ్డి 
జమ్మలమడుగు – పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి 
మైదుకూరు – పుట్టా సుధాకర్‌ యాదవ్‌ 

కర్నూలు 
ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ 
శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్‌రెడ్డి 
పాణ్యం – గౌరు చరితారెడ్డి 
డోన్‌ – కేఈ ప్రతాప్‌ 
పత్తికొండ – కేఈ శ్యామ్‌బాబు 
ఎమ్మిగనూరు – బి.జయనాగేశ్వరరెడ్డి 
మంత్రాలయం – తిక్కారెడ్డి 
ఆదోని – మీనాక్షినాయుడు  
ఆలూరు – కోట్ల సుజాతమ్మ 

అనంతపురం  
రాప్తాడు – పరిటాల శ్రీరామ్‌ 
హిందూపురం – నందమూరి బాలకృష్ణ 
పెనుకొండ – బీకే పార్థసారథి 
పుట్టపర్తి – పల్లె రఘునాథరెడ్డి 
ధర్మవరం – గోనుగుంట్ల సూర్యనారాయణ 

చిత్తూరు 
పీలేరు – నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి 
పుంగనూరు – ఎన్‌.అనూషారెడ్డి 
చంద్రగిరి – పులివర్తి వెంకట మణిప్రసాద్‌(నాని) 
తిరుపతి – ఎం.సుగుణమ్మ 
శ్రీకాళహస్తి – బొజ్జల సుధీర్‌రెడ్డి 
నగరి – గాలి భానుప్రకాష్‌ 
పలమనేరు – ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి 
కుప్పం – నారా చంద్రబాబునాయుడు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement