► నామినేషన్లు ఓకే
► నేడు అభ్యర్థుల జాబితా
► కోర్టుకు ‘అమ్మ’
► వేలిముద్ర వ్యవహారం
ఉప ఎన్నికల రేసులో నిలబడిన ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం లభించింది. పరిశీలన ప్రక్రియ ముగియడంతో శుక్రవారం తుది జాబితా ప్రకటించనున్నారు. ఇక, అన్నాడీఎంకే అభ్యర్థుల బీ ఫామ్‌లో అమ్మ వేలి ముద్ర వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది.
సాక్షి, చెన్నై : తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రం అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం బుధవారంతో ముగి సిన విషయం తెలిసిందే. పంచముఖ సమరంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన గురువారం జరిగింది. ఆ మేరకు తంజావూరులో డీఎంకే, అన్నాడీఎంకేల అభ్యర్థులో పాటు 29 మంది, తిరుప్పర గుండ్రంలో 37 మంది, అరవకురిచ్చిలో 59 మంది నామినేషన్లను పరిశీలించారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు ఆమో దం లభించింది. అరవకురిచ్చిలో మా త్రం డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులకు వ్యతిరేకంగా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వ్యతిరేకత వ్యక్తం చేసినా, చివరకు అధికారుల వివరణతో ఆమోద ముద్ర పడింది. పుదుచ్చేరిలో సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ స్వామి, అన్నాడీఎంకే అభ్యర్థి ఓం శక్తి శేఖర్‌లతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించారు. అన్నాడీఎంకే, ఎన్‌ఆర్ కాంగ్రెస్‌లు ఏకమైనా, తన విజయానికి ఢోకా లేదని నారాయణ స్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఎన్‌ఆర్ కాంగ్రెస్ నేత రంగస్వామి, అన్నాడీఎంకే అభ్యర్థి ఓం శక్తి శేఖర్ ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు.
నేడు జాబితా: శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉప సంహరణ ప్రక్రియ సాగనుంది. తదుపరి సాయంత్రం ఐదున్నర, ఆరు గంటల సమయంలో రేసులో నిలబడే అభ్యర్థులు తుది జాబితాను ప్రకటించనున్నారు. గెలుపు లక్ష్యంగా అభ్యర్థులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇంటింటా తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇక, మదురైలో తనిఖీలు ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. బుధవారం నగదు, నగలు పట్టుబడగా, గురువారం జరిగిన తనిఖీల్లో రూ.46 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిపిన తనిఖీల్లో డెబ్బై లక్షల మేరకు నగదు, కోటి రూపాయలకుపైగా వస్తువుల్ని అధికారులు స్వాధీనం చేసుకుని ఉన్నారు.
కోర్టుకు అమ్మ వేలి ముద్ర: అన్నాడీఎంకే అభ్యర్థుల బీ-ఫామ్ వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. ఆ పార్టీ అధినేత్రి జయలలిత ఆసుపత్రిలో ఉన్న విషయం తెలిసిందే. తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రంలతో పాటు పుదుచ్చేరినెల్లితోపు బరిలో ఉన్న అన్నాడీఎంకే అభ్యర్థులు ఎన్నికల యంత్రాంగానికి సమర్పించిన బీ-ఫామ్‌లో జయలలిత సంతకంకు బదులుగా వేలి ముద్ర ఉండడం చర్చకు దారి తీసి ఉన్న విషయం తెలిసిందే. ఈ వేలి ముద్రను ఎన్నికల యంత్రాంగం పరిగణలోకి తీసుకుంది. అరుుతే, ఇది చట్ట విరుద్ధంగా పేర్కొంటూ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి గురువారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వేలి ముద్ర విషయంగా ఎన్నికల యంత్రాంగానికి లేఖ రాసినట్టు, వారి నుంచి సమాధానం లేని దృష్ట్యా, కోర్టులో పిటిషన్ వేసినట్టు వివరించారు. అన్నాడీఎంకే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నారుు.
ఎన్నికల్లో వీరప్పన్ బంధువు
ఉప ఎన్నికల బరిలో చందనపు దొండ వీరప్పన్ బంధువు నిలబడిఉన్నారు. ధర్మపురి జిల్లా పెన్నాగరం సమీప గ్రామానికి చెందిన అగ్ని శ్రీరామచంద్రన్(36)చివరి రోజు బుధవారం చివరిక్షణంలో తన నామినేషన్ సమర్పించి ఉన్నాడు. ఇతడు చందనపు స్మగ్లర్ వీరప్పన్ బంధువు. తంజావూరునియోజకవర్గం ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్టు, తన మామ వీరప్పన్ అభిమానులు తనకు అండగా నిలబడాలని అగ్ని శ్రీరామచంద్రన్ మీడియా ద్వారా పిలుపు నివ్వడం గమనార్హం.
ఆమోదం
Published Fri, Nov 4 2016 4:08 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
Advertisement
Advertisement