
గుంటూరు, సాక్షి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పలు చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. పులివెందులలో వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు.
హిందూపురం పార్లమెంట్ స్థానంలో శాంతమ్మ ఆధిక్యంలో ఉన్నారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్ ముందంజలో ఉన్నారు. దర్శి, రాజంపేట, బద్వేల్, పత్తికొండ, కడప,తుని, మైలవరం అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment