తీరని కోరిక అంటున్న హీరోయిన్! | at least finish graduation is my priority, says Sonam Kapoor | Sakshi
Sakshi News home page

తీరని కోరిక అంటున్న హీరోయిన్!

Published Wed, Sep 7 2016 1:43 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

తీరని కోరిక అంటున్న హీరోయిన్! - Sakshi

తీరని కోరిక అంటున్న హీరోయిన్!

చిన్పప్పుడు స్కూలుకు వెళ్లాలంటే పిల్లలు ఎవరైనా కాస్త బద్దకంగా కనిపిస్తారు. అదే కాస్త అలవాటు పడితే వారే స్కూలు జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా అతీతులు కాదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ముక్కుసూటిగా మాట్లాడుతుందన్న పేరు కూడా సోనమ్ సొంతం. తాను అనుకున్న విషయంపై నేరుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే కొంత మంది హీరోయిన్లలో సోనమ్ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీలకు కూడా చదువు కష్టాలు తప్పవని బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ అంటోంది. తన జీవితంలో ఇప్పటివరకూ తీరని కోరికల గురించి సోనమ్ మీడియాతో కొన్ని విషయాలు పంచుకుంది.

ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో చేయలేకపోయానే అనే వెలితి ఉంటుంది కదా.. తనకు కూడా అలాంటి విషయం ఒకటుందని సోనమ్ చెప్పింది. చదువు తనకు సమస్యగా మారిందని అభిప్రాయపడింది. కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలన్నది తన కల అని, అయితే ఇంటర్ తర్వాత చదువు సాగలేదని వివరించింది. యూనివర్సిటీకి వెళ్లి కనీసం గ్రాడ్యుయేషన్ ఐనా పూర్తి చేయాలని ప్రస్తుతం ఆ పనిలో ఉన్నానని ముప్పై ఏళ్ల సోనమ్ చెప్పుకొచ్చింది. అయినా తనకు అప్పుడే  వయసు మించిపోలేదంటూ చిన్నగా నవ్వేసింది సోనమ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement