వాషింగ్టన్: జాతీయవాదిగా, వలసలను వ్యతిరేకించే నాయకుడిగా పేరుగాంచిన అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ధోరణి మార్చుకున్నారు. అమెరికాలో చదువుకొనే విదేశీ విద్యార్థులకు తీపి కబురు చెప్పారు. తాజాగా ఆల్–ఇన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. అమెరికా కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విదేశీ విద్యార్థులకు అటోమేటిక్‌గా గ్రీన్ కార్డులు అందించే విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిన అవసరం ఉండదని, అమెరికాలోనే ఉండొచ్చని వెల్లడించారు. జూనియర్ కాలేజీల్లో చదువుకున్నవారికి సైతం గ్రీన్‌కార్డులు ఇస్తామన్నారు. ఇండియా, చైనా దేశాల విద్యార్థులు అమెరికా కాలేజీల్లో చదువుకొని, స్వదేశాలకు తిరిగివెళ్లి మల్టీ బిలియనీర్లుగా పైకి ఎదుగుతున్నారని, పరిశ్రమలు స్థాపించి, వేలాది మందికి ఉపాధి కలి్పస్తున్నారని చెప్పారు. వారు ఇక్కడే ఉండేలా చేస్తే అమెరికాకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థగా ట్రంప్ మరోసారి బరిలోకి దిగుతుండటం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment