AP CM Jagan Daughter Harsha Completes Her Masters With Distinction in INSEAD - Sakshi
Sakshi News home page

CM Jagan Tweet: డియర్‌ హర్ష.. గర్వంగా ఉంది

Published Sat, Jul 2 2022 7:18 PM | Last Updated on Sun, Jul 3 2022 7:10 AM

CM Jagan Daughter Harsha Completes her Masters With Distinction - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన కుమార్తె హర్ష గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్యారిస్‌లో జరిగిన ఇన్‌సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కుమార్తెపై తనకున్న ప్రేమను ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ ట్వీట్‌కు గ్రాడ్యుయేషన్‌ పట్టాతో ఉన్న హర్షతో సతీసమేతంగా దిగిన తన ఫొటోను సీఎం జతచేశారు.

అంతేకాక.. ‘‘డియర్‌ హర్ష.. నీ అద్భుతమైన ఎదుగుదలను చూస్తే ఎంతో గర్వంగా ఉంది. నీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ మెండుగా ఉంటాయి. ఈరోజు ఇన్‌సీడ్‌ ((INSEAD) బిజినెస్‌ స్కూల్‌ నుంచి డిస్టింక్షన్‌లో పాస్‌ కావడమే కాకుండా డీన్స్‌ లిస్ట్‌లో నీ పేరు చూసి గర్వపడుతున్నాను. భవిష్యత్తులో భగవంతుడు నీకు అన్ని విధాలుగా తోడుగా నిలవాలని కోరుకుంటున్నా’’.. అంటూ జగన్‌ ట్వీట్‌ చేశారు.  

చదవండి: (CM YS Jagan: ఆదోని పర్యటనకు సీఎం జగన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement