Harish Rao Feels Happy After His Son Archisman Get Graduation Certificate From Colorado University - Sakshi
Sakshi News home page

డియర్‌ అచ్చూ కంగ్రాట్స్‌! మురిసిపోయిన మంత్రి హరీశ్‌ రావు

Published Sat, May 13 2023 3:33 AM | Last Updated on Sat, May 13 2023 9:44 AM

Global Engagement Award to harishrao son - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/సిద్దిపేట జోన్‌: అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు కుమారుడు అర్చిష్మాన్‌ పట్టభద్రుడయ్యాడు. భారత కాలమానం ప్రకారం గురువారం యూనివర్సిటీలో జరిగిన పట్టా ప్రదానోత్సవంలో అర్చిష్మాన్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ పట్టా అందుకున్నాడు. పట్టా ప్రదానోత్సవానికి హాజరైన మంత్రి హరీశ్‌ రావు తన సంతోషాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.

‘నా కుమారుడు అర్చిష్మాన్‌ కొలరాడో యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పట్టాతో పాటు గ్లోబల్‌ ఎంగేజ్మెంట్‌ అవార్డును కూడా అందుకున్నాడు’ అని పేర్కొన్నారు. డియర్‌ అచ్చూ.. కంగ్రాట్స్‌ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.  తన కుమారుడి ప్రతిభకు గర్వపడుతున­ట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని హరీశ్‌ ఆకాంక్షించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement