విగాదికి కలుద్దాం | Nani wraps up shooting for V | Sakshi
Sakshi News home page

విగాదికి కలుద్దాం

Published Fri, Jan 17 2020 5:27 AM | Last Updated on Fri, Jan 17 2020 5:27 AM

Nani wraps up shooting for V - Sakshi

నాని

హీరో నాని ఉగాది వేడుకలు ‘వి’సెట్‌లో జరిగాయి. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్‌బాబు నటించిన చిత్రం ‘వి’. నివేదా థామస్, అదితీరావు హైదరి కథానాయికలుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌ పాత్రలో సుధీర్‌ బాబు నటించగా, నాని విలన్‌ పాత్ర చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

కెరీర్‌లో తొలిసారి నాని విలన్‌ పాత్ర పోషిస్తున్న చిత్రం ఇది. ‘‘సంక్రాంతి రోజున ముగిస్తున్నాము. ఉగాది రోజు మొదలెడదాము’’ అని పేర్కొన్నారు నాని. ‘‘వి’ చిత్రీకరణ ముగిసింది. ఓ మంచి భావోద్వేగంతో కూడిన ప్రయాణం ముగిసింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరు బాగా కష్టపడ్డారు. ఉగాదికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. అతి త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాం’’ అని పేర్కొన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘వి’ చిత్రం ఉగాది సందర్భంగా ఈ ఏడాది మే 25న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement