ఎంట్రీ అప్పుడే | Sudheer Babu underwent a couple of months intense training for v | Sakshi
Sakshi News home page

ఎంట్రీ అప్పుడే

Published Sun, Jun 9 2019 3:17 AM | Last Updated on Sun, Jun 9 2019 3:17 AM

Sudheer Babu underwent a couple of months intense training for v - Sakshi

నాని, సుధీర్‌బాబు హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘వి’. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అదితీరావు హైదరీ, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సుధీర్‌బాబు వర్కౌట్స్‌ చేసి బరువు కూడా తగ్గారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ మొదలైంది. ఇందులో సుధీర్‌బాబు పోలీసాఫీసర్‌గా కనిపిస్తారని, నానిది విలన్‌ పాత్ర అని టాక్‌. జూలై రెండోవారంలో నాని ఈ సినిమా షూటింగ్‌ లొకేషన్‌లో జాయిన్‌ అవ్వనున్నట్లు తెలిసింది. శ్రీవెంకటేశ్వర కియేషన్స్‌ పతాకంపై అనిత సమర్పణలో శిరీష్, లక్ష్మణ్, హర్షిత్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి.. నాని ప్రస్తుతం ఏం చేస్తున్నారు అంటే ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 30న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement