V
-
భారత్‌లో ‘వీ’ నమూనా ఆర్థికాభివృద్ధి!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్న భారత్ ఆర్థిక వ్యవస్థ, తిరిగి ‘వీ’ (V) తరహా వృద్ధి రేటును చూస్తోందని ఆర్థికశాఖ నివేదిక పేర్కొంది. కోవిడ్–19పై సమరానికి అమలు చేసిన కఠిన లాక్డౌన్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారత స్థూల దేశీయోత్పత్తి మైనస్ 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ గురువారం విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ► ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఒక్క భారత ఆర్థిక వ్యవస్థే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా ప్రతికూల పరిస్థితే నెలకొంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ 33 శాతం, బ్రిటన్ 21.7 శాతం, ఫ్రాన్స్ 18.9 శాతం, స్పెయిన్ 22.1 శాతం, ఇటలీ 17.7 శాతం, జర్మనీ 11.3 శాతం నష్టపోగా. యూరో ప్రాంతం దాదాపు మైనస్ 15 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. జపాన్ విషయంలో ఈ క్షీణ రేటు 9.9 శాతంగా ఉంది. ► ఇక లాక్డౌన్ వల్ల ప్రయోజనాల విషయానికి వస్తే, కోవిడ్–19 ప్రతికూల పరిస్థితులపై ఈ కాలంలో ఒక స్పష్టమైన అంచనాలకు రాగలిగాం. మరణాల రేటు తగ్గడానికి తగిన చర్యలు తీసుకున్నాం. ప్రపంచంలో కోవిడ్–19 ప్రేరిత మృతుల రేటు (శాతాల్లో) భారత్‌లోనే తక్కువ ఉంది. ఆగస్టు 31 వరకూ చూస్తే, భారత్‌లో మృతుల రేటు కేవలం 1.78 శాతంగా ఉంటే, అమెరికాలో ఈ రేటు 3.04 శాతంగా ఉంది. బ్రిటన్‌లో ఈ రేటు ఏకంగా 12.35 శాతం. ఫ్రాన్స్‌లో 10.09 శాతం. జపాన్‌లో 1.89 శాతం. ఇటలీలో 13.18 శాతం. ► ప్రస్తుతం భారత్ ‘వీ’ (ఠి) తరహా వృద్ధి పురోగమనంలో ఉంది. ఇందుకు తగిన గణాంకాలు కనిపిస్తున్నాయి. ఆటో, ట్రాక్టర్, ఎరువుల అమ్మకాలు పెరుగుతున్నాయి. రైల్వే రవాణా పెరుగుతోంది. స్టీల్, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరుగుతోంది. ఈ– వే బిల్స్ బాగున్నాయి. జీఎస్టీ వసూళ్ల విషయంలో సానుకూలత కనిపిస్తోంది. రహదారులపై రోజూవారీ టోల్ వసూళ్లు మెరుగుపడుతున్నాయి. రిటైల్ ఫైనాన్షియల్ లావాదేవీలు, తయారీ పర్చేజింగ్ మేనుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ పరిస్థితి బాగుంది. మౌలిక రంగాలు సానుకూల సంకేతాలు ఇస్తున్నాయి. పెట్టుబడులు మెరుగుపడుతున్నాయ్. ఎగుమతులు వృద్ధి బాటలోకి వెళ్లే పరిస్థితులు నెలకొంటున్నాయి. వ్యవసాయ రంగంలో మంచి పురోగతి కనబడుతోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు చరిత్రాత్మక రికార్డు స్థాయిల్లో (ఆగస్టు 28వ తేదీతో ముగిసిన వారంలో చరిత్రాత్మక రికార్డు స్థాయి 541.431 బిలియన్ డాలర్లు)కొనసాగుతున్నాయి. 14 నెలలకుపైగా దిగుమతులకు ఇవి సరిపోతాయి. ► దేశంలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఎటువంటి ప్రతికూలతలూ లేకుండా కేంద్రం, ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ► అయితే ఇంకా కొన్ని కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాలు, మౌలిక రంగం, స్టార్టప్స్, మానవ వనరుల నైపుణ్యత, ఆరోగ్య భద్రత వంటి రంగాల్లో ఇంకా పురోగతి సాధించాల్సి ఉంది. భూ, న్యాయ, కార్మిక, క్యాపిటల్ మార్కెట్ విభాగాల్లో మరిన్ని వ్యవస్థాగత సంస్కరణలు అవసరం. నిరుద్యోగ సమస్యసహా సమస్యల పరిష్కారానికి కేంద్రం అధిక దృష్టి కేంద్రీకరించింది. రూపాయికి 33 పైసలు లాభం ఈక్విటీ మార్కెట్ భారీగా నష్టపోయినా, శుక్రవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 33 పైసలు బలపడి 73.14 వద్ద ముగిసింది. దీనితో వారం వారీగా రూపాయి 25 పైసలు లాభపడినట్లయ్యింది. రూపాయి వరుసగా నాలుగు వారాల నుంచీ బలపడుతూ వస్తోంది. ఈ నెల మొత్తం ఐపీఓల ద్వారా దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులు వస్తాయన్న అంచనాలే రూపాయి బలోపేతానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రిసెర్చ్ డిప్యూటీ హెచ్ దేవర్‡్ష వికెల్ అభిప్రాయపడుతుండడం గమనార్హం. 25 శాతం రెవెన్యూ వృద్ధి లక్ష్యంగా భారత్: వుయ్ వర్క్ కోవిడ్–19 తీవ్ర సవాళ్లు విసురుతున్నప్పటికీ, భారత్ ప్రస్తుత క్యాలెండర్ ఇయర్లో 25 శాతం రెవెన్యూ వృద్ధి లక్ష్యంతో ఉందని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న రియల్టీ సంస్థ– ఎంబసీ గ్రూప్ అనుబంధ విభాగం వుయ్ వర్క్ అంచనావేసింది. దీనిని సాధించే అవకాశాలు కూడా భారత్‌కు ఉన్నాయని అభిప్రాయపడింది. అయితే రాబడీ–వ్యయాలను చూస్తే 2019 కన్నా, 2020లో కొంత ప్రతికూలతలు తప్పవని తెలిపింది. -
నేను హ్యాపీ అని ‘దిల్’రాజు అన్నారు
నాని, సుధీర్‌బాబు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పలు విషయాలను పంచుకున్నారు. ► సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని దాదాపు ఐదు నెలలు ‘దిల్’ రాజుగారిని నేను, నాని బతిమాలి ఓ నాలుగునెలల పాటు లాక్కొచ్చాం. రాజుగారు ఓ రోజు ‘కరెక్ట్‌గా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఓ డేట్ చెప్ప’మన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనుచూపు మేరలో ఆ పరిస్థితి కనపడటంలేదు. అందుకనే ఈ సినిమాని డిజిటల్లో విడుదల చేయటానికి మొగ్గుచూపాం. ► ప్రతి విషయానికి పాజిటివ్, నెగిటివ్ ఉన్నట్లే ఈ సినిమాకు డిజిటల్ రిలీజ్ కూడా ప్లస్ అవుతుందనుకుంటున్నా. ఎందుకంటే ‘వి’ చిత్రాన్ని శుక్రవారం రాత్రి 12గంటలకు విడుదల చేస్తున్నాం. దాదాపు 200 దేశాల్లో ఈ సినిమా విడుదల కానుంది. జనరల్‌గా మా అమ్మగారు, అత్తగారు లాంటి 70 ఏళ్ల వయసున్నవారు థియేటర్లకు వచ్చి సినిమా చూడరు. నా సినిమాకు అలాంటివాళ్లందరూ ఎక్స్ట్రా ఆడియన్స్. మొదటివారం సినిమా చూసే ప్రేక్షకులంతా మొదటిరోజే చూస్తారు. శనివారం హాలిడే కాబట్టి అందరూ నైట్ పాప్‌కార్న్, కూల్‌డ్రింక్‌ను పక్కన పెట్టుకుని ఇంట్లో సినిమాని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఎటొచ్చీ ప్రేక్షకుల మధ్యలో కూర్చుని సినిమా చూడలేకపోతున్నామనే బాధ తప్ప మిగతా అన్నీ మంచి విషయాలే. కానీ, నాకు వ్యక్తిగతంగా థియేటర్ అంటేనే ఇష్టం. ఇదొక (ఒటీటీ) ఫేజ్ మాత్రమే అనుకుంటున్నా. ► ‘దిల్’ రాజుగారు ఈ సినిమాకు నిర్మాత అయినా ఆయన ఒక బయ్యర్, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఓటీటీలో రిలీజ్ చేయటం వల్ల ఆయనకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు. ‘సార్ మీరు హ్యాపీయా’ అని అడిగితే, ‘హ్యాపీ మోహన్’ అన్నారు. లేకపోతే ఆయన అంత తేలిగ్గా ఓటీటీలో రిలీజ్ అనే నిర్ణయం తీసుకోరు. ► నానీతో నా అనుబంధం పుష్కరకాలం. నానీకి ఈ కథ చెప్పినప్పుడు ఇది తనకు 25వ సినిమా అని నాకు తెలియదు. ఆ తర్వాత తెలిసింది. అప్పుడు నానీని ‘ఇది నీ 25వ సినిమా కదా. ఈ పాత్ర (విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్) ఏమైనా చేయడానికి ఇబ్బందా అంటే లేదన్నాడు. మొన్న సినిమా చూసిన తర్వాత ‘ఇది నా 25వది అయినందుకు, ఆ 25వ సినిమా మీతో చేసినందుకు హ్యాపీ’ అని నాని అన్నాడు. ► విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాలి. అది ఎప్పుడు అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పలేను. ఇద్దరు, ముగ్గురు నిర్మాతలకు ఓ సినిమా చేసి, మళ్లీ ‘దిల్’ రాజుగారితో సినిమా చేస్తాను. ► ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ అంటే క్రియేషన్ మీద పెట్టాల్సిన శ్రద్ధ శానిటేజషన్ మీద పెట్టాల్సి వస్తుందేమో. సెప్టెంబర్, అక్టోబర్లలో కొన్ని సినిమాల షూటింగ్‌ను ప్రారంభిస్తున్నారట. చూద్దాం.. ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. రానున్న ఐదారు నెలల్లో నిర్మాతలు, దర్శకులు, నటులు సరికొత్త చాలెంజ్‌లను ఎదుర్కొనే పరిస్థితి రాబోతుంది. -
ఆ గేమ్‌లోకి వెళ్లను
నాని, సుధీర్‌బాబు, అదితీ రావు హైదరీ, నివేదా థామస్‌లు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం నివేదా థామస్ చెప్పిన విశేషాలు. ► నిజానికి ఈ సినిమాని థియేటర్ రిలీజ్ కోసం తీశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనందరం పక్కనే ఉన్న షాప్‌కి వెళ్లటానికి కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయినా ప్రేక్షకులు వస్తారని గ్యారెంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదల సరైన నిర్ణయమే. ఒక మంచి సినిమాలో భాగం అయినందుకు ఆనందంగా ఉంది. ► ‘వి’ సినిమా చేయడం వెనక నా స్వార్థం కూడా ఉంది. నా పాత్ర నచ్చడం, నానీతో మూడోసారి సినిమా చేయడం, ఇంద్రగంటి సార్‌తో రెండో సినిమా, ‘దిల్’ రాజుగారి బేనర్లో కంటిన్యూస్‌గా సినిమాలు చేయడం.. ఇవన్నీ నేను ‘వి’ చేయడానికి కారణాలు. ఈ సినిమాలో నా పాత్ర పేరు అపూర్వ. తను క్రైమ్ థ్రిల్లర్స్ రాసే నవలా రచయిత. ఇప్పటివరకు నేను చేసిన మంచి పాత్రల్లో ఇదొకటి. ► స్వతహాగా నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను. ఫస్ట్ టైమ్ ఫ్యామిలీతో చాలారోజులు ఇంట్లో స్పెండ్ చేశాను. 17 ఏళ్లుగా మా నాన్న దుబాయ్‌లో వర్క్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడన్నా అలా వచ్చి ఇలా వెళ్లేవారు. కానీ ఆరు నెలలుగా ఆయనతో బెస్ట్ టైమ్ గడుపుతున్నాను. ఈ లాక్డౌన్లో ఎంతోమంది కొత్త దర్శకులు చెప్పిన కథలు విన్నాను. ప్రతి కథ ఒక కొత్త అనుభూతినిచ్చింది. కానీ ఫైనల్‌గా నాకు సూట్ అయ్యేవే ఎన్నుకుంటాను. ► వెబ్ సిరీస్‌లో నటించాలనుకోలేదు. మంచి క్యారెక్టర్ వస్తే చేస్తానేమో. ప్రస్తుతానికి నేను మంచి పొజిషన్లో ఉన్నాను. స్టార్డ్డమ్ అంటూ నంబర్ గేమ్‌లోకి రావటం నాకిష్టంలేదు. నేను ఆ బాక్స్‌లో ఉండను. స్టార్డమ్ కంటే కూడా ‘ఈ అమ్మాయి మంచి క్యారెక్టర్స్ చేస్తుంది’ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. -
పవర్ఫుల్ ఆఫీసర్
నువ్వా? నేనా? అని పోటీపడ్డారు నాని, సుధీర్‌బాబు. నాని నేచురల్ స్టార్ అని ఎప్పుడో అనిపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సుధీర్‌బాబు కూడా ఒక్కో సినిమాకి నిరూపించుకుంటూ మంచి నటుడు అనిపించుకున్నారు. ఈ ఇద్దరూ నువ్వా? నేనా? అంటూ ‘వి’ సినిమాలో పోటీపడి నటించారు. నానీతో ‘అష్టా చమ్మా, జెంటిల్‌మేన్’ వంటి హిట్ చిత్రాలను, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ వంటి హిట్ చిత్రాన్ని తీసిన ఇంద్రగంటి మోహనకృష్ణ ‘వి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించారు. నాని ఓ డిఫరెంట్ రోల్లో.. ఆ పాత్రకు దీటుగా ఉండే పవర్ఫుల్ ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్‌బాబు నటించారు. సోమవారం సుధీర్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని రూపొందించాం. ఇటీవలే షూటింగ్ పూర్తయింది. ఉగాది సందర్భంగా మార్చి 25న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: అమిత్ త్రివేది, కెమెరా: పి.జి.విందా. -
విగాదికి కలుద్దాం
హీరో నాని ఉగాది వేడుకలు ‘వి’సెట్లో జరిగాయి. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్‌బాబు నటించిన చిత్రం ‘వి’. నివేదా థామస్, అదితీరావు హైదరి కథానాయికలుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో సుధీర్ బాబు నటించగా, నాని విలన్ పాత్ర చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కెరీర్లో తొలిసారి నాని విలన్ పాత్ర పోషిస్తున్న చిత్రం ఇది. ‘‘సంక్రాంతి రోజున ముగిస్తున్నాము. ఉగాది రోజు మొదలెడదాము’’ అని పేర్కొన్నారు నాని. ‘‘వి’ చిత్రీకరణ ముగిసింది. ఓ మంచి భావోద్వేగంతో కూడిన ప్రయాణం ముగిసింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరు బాగా కష్టపడ్డారు. ఉగాదికి కౌంట్‌డౌన్ మొదలైంది. అతి త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాం’’ అని పేర్కొన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘వి’ చిత్రం ఉగాది సందర్భంగా ఈ ఏడాది మే 25న విడుదల కానుంది. -
ఈ ఉగాదికి హింసే!
‘‘ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు’ అన్నాడు షేక్స్పియర్. అదే నేనూ అంటున్నాను. శత్రువులందరూ జాగ్రత్తగా ఉండండి’’ అంటున్నారు నాని. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్‌బాబు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘వి’. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘వయొలెన్స్ (హింస) కావాలన్నారుగా. ఇస్తాను. ఉగాదికి సాలిడ్‌గా ఇస్తాను’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు నాని. ఈ సినిమాలో సుధీర్‌బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో, నాని విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇది నాని 25వ చిత్రం కూడా కావడం విశేషం. ఈ సినిమాకు సంగీతం: అమిత్ త్రివేది. -
మనాలీ పోదాం
ఫైట్ కోసం మనాలీలో మకాం వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు ‘వి’ టీమ్. సుధీర్‌బాబు, నాని ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నివేదా థామస్, అదితీరావ్ హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో పోలీసాఫీర్ పాత్రలో సుధీర్‌బాబు, విలన్ పాత్రలో నాని నటిస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్, థాయ్‌ల్యాండ్ లొకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ముఖ్యంగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరించారు. తర్వాతి షెడ్యూల్ మనాలీలో జరగనుంది. అక్కడ కూడా ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట చిత్రబృందం. ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. -
నాని విలన్‌గా సిక్స్ ప్యాక్‌లో
మైల్స్టోన్ మూవీస్ గుర్తుండిపోయేలా ఉండాలనుకుంటారు యాక్టర్స్. అందుకే కొన్నిసార్లు సేఫ్ గేమ్ ఆడాలని కూడా అనుకుంటారు. నాని మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. నాని 25వ సినిమా ‘వి’లో విలన్‌గా నటిస్తున్నారు. అంతేనా? ఇప్పటి వరకూ కనిపించనట్టుగా కొత్తగా కనిపిస్తారట. సుధీర్‌బాబు, నాని, అదితీరావ్ హైదరీ, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వి’. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాని సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నారట. అందుకోసం ప్రస్తుతం జిమ్ చేస్తూ బరువు తగ్గించే పనిలో ఉన్నారట. నయా లుక్స్‌తో ఆడియన్స్‌ను షాక్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. నానీని హీరోగా పరిచయం చేసిన మోహనకృష్ణ దర్శకత్వంలోనే నాని విలన్‌గా యాక్ట్ చేయడం విశేషం. -
ఎంట్రీ అప్పుడే
నాని, సుధీర్‌బాబు హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘వి’. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అదితీరావు హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సుధీర్‌బాబు వర్కౌట్స్ చేసి బరువు కూడా తగ్గారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ఇందులో సుధీర్‌బాబు పోలీసాఫీసర్‌గా కనిపిస్తారని, నానిది విలన్ పాత్ర అని టాక్. జూలై రెండోవారంలో నాని ఈ సినిమా షూటింగ్ లొకేషన్లో జాయిన్ అవ్వనున్నట్లు తెలిసింది. శ్రీవెంకటేశ్వర కియేషన్స్ పతాకంపై అనిత సమర్పణలో శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి.. నాని ప్రస్తుతం ఏం చేస్తున్నారు అంటే ‘గ్యాంగ్‌లీడర్’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 30న విడుదల కానుంది. -
వ్యూహమా? విక్టరీయా?
నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘అష్టా చమ్మా, జెంటిల్ మన్’ చిత్రాలు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే సుధీర్‌బాబు, ఇంద్రగంటి కలయికలో వచ్చిన ‘సమ్మోహనం’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్లో ‘వి’ పేరుతో ఓ సినిమా రూపొందనుంది. ‘వి’ అంటే విక్టరీ అని ఊహించవచ్చు. నాని, సుధీర్‌బాబు హీరోలుగా, అదితీరావు హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంలో 36వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అనిత సమర్పణలో శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రినాథరావు నక్కిన కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు శ్రీరామ్ వేణు క్లాప్ ఇచ్చారు. ‘ఎఫ్2’ డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. తనికెళ్ల భరణి, వి.కె. నరేష్, రోహిణి, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి పాటలు: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కెమెరా: పి.జి.విందా, సంగీతం: అమిత్ త్రివేది. -
వి అంటే అతనేనా?
‘ప్యారులో పడిపోతే పరేషానురా..’ అని ‘ధృవ’లో ఒక పాట ఉంది. కరెక్టే.. ప్యారులో పడితే పరేషానే. ఎవరికీ వినిపించకుండా దొంగచాటుగా ఫోన్లు మాట్లాడుకోవడం, కనిపించకుండా తిరగడం.. అబ్బబ్బ... అంతా పరేషాన్. ఇప్పుడు నయనతార–దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ పరేషాన్లోనే ఉన్నారని చెన్నై టాక్. ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్త ప్రచారంలోకొచ్చినప్పటి నుంచి ఔత్సాహికరాయుళ్లు తమ దృష్టినంతా వాళ్ల మీదే పెట్టారు. ఇద్దరూ కలసి తిరిగితే.. స్మార్ట్ ఫోన్లో చాలా స్మార్ట్‌గా ఫొటోలు తీస్తున్నారు. చేతులు, మెడ.. ఇలా కంటికి కనిపించే శరీర భాగాల్లో ఏమైనా పచ్చబొట్లు ఉన్నాయా? అని అదే పనిగా వెతకడం మొదలు పెట్టారు. అలా వెతికిన ఓ రెండు కళ్లకు నయనతార చెవికి ఉన్న కమ్మలు కనిపించాయి. ‘వి’ ఆకారంతో అగుపించిన ఆ ఇయర్ రింగ్స్ గురించే ఇప్పుడు హాట్ టాపిక్. ‘వి’ అంటే ఏంటి? అనడిగితే ‘వ్యాన్’ అని చిన్నపిల్లలు చెబుతారు. విజయాల బాటలో దూసుకెళుతున్నవాళ్లు ‘విక్టరీ’ అంటారు. కానీ, ‘వి ఫర్ విఘ్నేష్ శివన్’ అన్నది కొందరి ఓపీనియన్. ప్రియుడి పేరు వచ్చేట్లుగా నయన ఇయర్ రింగ్స్ సెలక్ట్ చేసుకున్నారని అంటున్నారు. మరి.. ‘వి అంటే అతనేనా?’ నయనతారే చెప్పాలి. -
ఈ దేశం మనది!
‘‘మన సమస్యలను మనమే పరిష్కరించు కోవాలి. సమాజంలోని అందరూ ఈ దేశం మనది అనే భావనతో ఉన్నప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది’’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘వి’. ‘పార్శిల్’ చిత్రం ఫేం సిరాజ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీవీ సత్యనారాయణ నిర్మించారు. అలీషా కథానాయిక. నిర్మాత మాట్లాడుతూ- ‘‘సెప్టెంబర్‌లో ఆడియో, అక్టోబర్‌లో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సిరాజ్ దర్శకత్వం వహించ డంతో పాటు సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘యాక్షన్ కలగలసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది’’ అని సిరాజ్ పేర్కొన్నారు. -
10 రోజులూ పేపర్లు, మొబైల్‌కు సీఎం దూరం
ధర్మశాల: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదిరోజుల పాటు మెడిటేషన్ కోర్సులో పాల్గొనేందుకు హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. కేజ్రీవాల్ ఈ పది రోజులు ఎవరినీ కలవరు. ఆయన భద్రత సిబ్బంది కూడా దూరంగా ఉంటారు. కేజ్రీవాల్ న్యూస్ పేపర్లు, టీవీలకు దూరంగా ఉండటంతో పాటు మొబైల్ ఫోన్ కూడా వాడరు. సోమవారం ధర్మశాలకు వచ్చిన కేజ్రీవాల్ కు ఆప్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ నెల 12 వరకు ఆయన ఇక్కడే గడపనున్నారు. ధర్మకోట్లోని హిమాచల్ విపాస్సన సెంటర్లో బస చేస్తారు. మెడిటేషన్ కోర్సు మంగళవారం ప్రారంభమై, ఈ నెల 11 వరకు కొనసాగుతోంది. ఆ మరుసటి రోజు కేజ్రీవాల్ ఢిల్లీకి తిరిగివెళతారు. -
బజాజ్ కొత్త టూ వీలర్ బ్రాండ్ ‘వి’..
♦ ఫిబ్రవరి 1న ఆవిష్కరణ ♦ ఐఎన్ఎస్ విక్రాంత్ మెటల్‌తో తయారీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న బజాజ్ ఆటో... ద్విచక్ర వాహన విభాగంలో ‘వి’ పేరుతో కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరిస్తోంది. ఫిబ్రవరి 1న దేశానికి ఈ బ్రాండ్‌ను పరిచయం చేయనున్నట్లు బజాజ్ ఆటో మోటార్‌సైకిల్ బిజినెస్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. భారత దేశ తొలి విమాన వాహక నౌక అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి సేకరించిన లోహంతో ఈ బ్రాండ్ బైక్‌లను తయారు చేశారు. తొలి మోడల్ 150 సీసీ సామర్థ్యంతో రానున్నట్టు సమాచారం. 5 గేర్లు ఉండే అవకాశం ఉంది. రౌండ్ హెడ్ ల్యాంప్, సింగిల్ సీట్, అలాయ్ వీల్స్, సీటును కలుపుతున్నట్టుగా ఫ్యూయల్ ట్యాంక్ వంటి ఫీచర్లు అదనపు ఆకర్షణలు. దేశానికి విశేష సేవలందించిన ఐఎన్ఎస్ విక్రాంత్ భారత సైనిక సామర్థ్యానికి నిదర్శనమని ఎరిక్ వాస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఐఎన్ఎస్ విక్రాంత్ స్ఫూర్తి, వారసత్వాన్ని కొత్త బ్రాండ్ కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని మోడళ్లు వస్తాయి? ధర ఎంత? వంటి వివరాలను ఫిబ్రవరి 1నే వెల్లడిస్తామన్నారు. ఇదీ ‘వి’ బ్రాండ్ నేపథ్యం.. భారత నేవీలోకి 1961లో ప్రవేశించిన ఐఎన్ఎస్ విక్రాంత్... 1961లో గోవా స్వాతంత్య్ర సమయంలో, 1971లో భారత్-పాక్ యుద్ధంలో విశేష సేవలందించింది. 1997లో సేవలకు స్వస్తి చెప్పి మ్యూజియంగా మారిపోయింది. 2014 నవంబరులో నౌకను తుక్కుగా మార్చారు. దీన్ని బజాజ్ ఆటో కొనుగోలు చేసింది. ఈ స్క్రాప్‌ను ప్రాసెస్ చేసి కొత్త బ్రాండ్ వాహనాల్లో వాడారు. -
అన్నదాతకు ఆదాయ భద్రత అక్కర్లేదా?
ద్రవ్యోల్బణాన్ని బట్టి ఉద్యోగుల జీతాలు పెరుగుతున్నా.. మద్దతు ధరలు పెరగటం లేదు. ప్రభుత్వం ప్రకటించిన అరకొర మద్దతు ధర కూడా దక్కక 93% రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఆత్మహత్యల పాలవుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు చట్టబద్ధమైన ఆదాయ భద్రత అక్కర్లేదా? అంటూ పాలకులు, మేధావులను సూటిగా ప్రశ్నిస్తున్నారు ఎం వీ ఎస్ నాగిరెడ్డి. వ్యవసాయమే ప్రధానమైన మన దేశానికి ఆహార భద్రతనందిస్తున్న రైతు కుటుంబాలు అంతకంతకూ అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయన్నది ఎంతో ఆవేదన కలిగించే వాస్తవం. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఈ మధ్యనే విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 52% మంది రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో 93%, తెలంగాణలో 89% మంది రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. జూలై 2012- జూన్ 2013 మధ్యలో దేశవ్యాప్తంగా 35 వేల కుటుంబాలపై ఎన్ఎస్ఓఓ సర్వే చేసి ఈ నివేదికను వెలువరించింది. పది మందికీ పనికల్పించే రైతుల్లో 40% మంది ఉపాధి పనికి వెళ్లి పొట్టపోసుకుంటున్నారని కూడా ఈ నివేదిక చెబుతోంది. రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎంతటి దుర్భరంగా ఉందో చెప్పడానికి ఈ గణాంకాలు చాలు. అప్పుల ఊబికి విధానాలే మూలం ఈ నివేదిక ప్రకారం.. 65 ఏళ్ల స్వతంత్ర భారతంలో 40% రైతు కుటుంబాలు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్నాయి. 11% రైతులకు మాత్రమే ప్రభుత్వ విస్తరణ సేవలందుతున్నాయి. దళారీలకు, ప్రైవేటు వ్యాపారులకే ఉత్పత్తులను రైతులు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితులున్నాయి. వాస్తవంగా క్షేత్రస్థాయిలో రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఈ నివేదిక చెబుతున్న దానికంటే చాలా ఎక్కువ ప్రమాద భరితంగా ఉంది. వ్యవసాయ సంక్షోభానికి కారణం రైతు పంట పండించలేక కాదు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో రైతు సంతోషంగా ఉన్నాడు. ఎక్కడా రైతుల ఆత్మహత్యల్లేవు. 1950 నుంచి 2012 నాటికి దేశ జనాభా 3.5 రెట్లు పెరిగితే ఆహార ధాన్యాల ఉత్పత్తి 7 రెట్లు, పాల ఉత్పత్తి పది రెట్లు, ఆక్వా ఉత్పత్తులు 13 రెట్లు పెరిగాయి. అయినా, ప్రభుత్వ విధానాల మూలంగానే రైతు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి.. ఆత్మాభిమానం చంపుకోలేక కుటుంబ సభ్యులను అనాథలను చేస్తూ ఆత్మహత్యలపాలవుతున్నారు. ఎవరు దీనికి బాధ్యులు? పాలకవర్గాలు, శాస్త్రవేత్తలు కేవలం దిగుబడి పెంపుదల మీదే దృష్టిపెట్టారు. రైతు లాభదాయకత గురించి ఏమాత్రం ఆలోచించలేదు. పెరుగుతున్న పెట్టుబడులకనుగుణంగా మద్దతు ధరలు పెంచకపోవడం ఒక సమస్య. గిట్టుబాటే కాని ఆ మద్దతు ధరలకన్నా తక్కువకే రైతు తెగనమ్ముకుంటుంటే చోద్యం చూస్తున్నాం. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు రెండూ రైతుల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తుండడమే ఈ సంక్షోభానికి కారణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరి, పత్తి ప్రధాన పంటలు. ఉత్పత్తి వ్యయం దేశంలోనే ఎక్కువయ్యే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. కనీస మద్దతు ధరలు నిర్ణయించేటప్పుడు అన్ని రాష్ట్రాల ఉత్పత్తి ఖర్చును కలిపి సరాసరి ధరను నిర్ణయిస్తున్నారు. దీని వల్ల మన వరి రైతులే ఎక్కువగా నష్టపోతున్నారు. రాష్ట్రం క్వింటాలు ధాన్యం ఉత్పత్తి వ్యయం రూ. 1,708 అని చెబుతుంటే.. కేంద్రం రూ. 1,360 మద్దతు ధరగా ప్రకటించింది! రాష్ట్రంలో ధాన్యం ధర కేంద్ర ప్రభుత్వ బియ్యం సేకరణ మీదే ఆధారపడి ఉండడటం, సేకరణ విధానంలో లోపం మూలంగానే పెట్టుబడిని కూడా రాబట్టుకోలేక రైతు నష్టపోతున్నాడు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. క్వింటా పత్తి ఉత్పత్తి ఖర్చు రూ. 5 వేలు. కేంద్రం మద్దతు ధర రూ. 4,050 అయితే రూ.3,700కే రైతులు అమ్ముకోవాల్సి వస్తున్నది. పత్తి మార్కెట్‌కు రాకముందే ఎగుమతి అనుమతులు ఇస్తే రైతుకు ధర వస్తుంది. కానీ, అమ్మకాలు పూర్తయ్యాక ఇవ్వడం వల్ల వ్యాపారులకే లబ్ధి కలుగుతోంది. వేరుశనగ, శనగ, మినుము, ఫంగస్ చేపల రైతుల పరిస్థితీ ఇంతే. ఎగుమతులు, దిగుమతులు రైతులకు నష్టం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మీద ఏ మాత్రం వత్తిడి పెట్టని మన రాష్ట్ర పాలకులే నేడు 90%పైగా రైతాంగం అప్పుల ఊబిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండటానికి కారణం. ద్రవ్యోల్బణం నుంచి రైతును రక్షించనక్కర్లేదా? గత కొంతకాలంగా వస్తువుల ధరలు 100-200% పెరిగితే వ్యవసాయోత్పత్తుల ధరలు 20-30% మాత్రమే పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పెంచుకుంటూ.. వ్యవసాయోత్పత్తులకు ఈ సూత్రాన్ని వర్తింపచేయకపోవటమే రైతును అప్పుల ఊబిలోకి దింపుతున్నది. ఉద్యోగుల వేతన సంఘ నివేదికలనైతే వచ్చీ రాగానే అమలు చేస్తున్నాం. రైతులకు ఆదాయ భద్రత కల్పించాలంటూ స్వామినాథన్ కమిషన్ నివేదిక ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అతీగతీ లేదు. రైతు ముఖంలో చిరునవ్వు చూడాలంటే దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పినట్లుగా వ్యవసాయ వృద్ధి రేటును ఉత్పత్తిని బట్టి కాకుండా.. రైతు ఇంటికి తీసుకెళ్లే నికర లాభాన్ని బట్టి మాత్రమే పరిగణించాలి. నిరుపేదల కోసం ఉపాధి హామీ చట్టం, ఆహార భద్రతా చట్టం తెచ్చాం. కానీ, 120 కోట్ల జనాభాకు తిండిపెడుతున్న రైతు కుటుంబాలకు కనీస ఆదాయ భద్రతనిచ్చే చట్టం చేయాల్సిన అవసరం లేదా? పాలకులారా, మేధావులారా ఆలోచించండి. (వ్యాసకర్త వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షులు మొబైల్: 98480 43377)