నాని విలన్‌గా సిక్స్‌ ప్యాక్‌లో | Nani in Six pack look His Next Movie | Sakshi

నయా నాని

Aug 7 2019 10:14 AM | Updated on Aug 7 2019 10:26 AM

Nani in Six pack look His Next Movie - Sakshi

మైల్‌స్టోన్‌ మూవీస్‌ గుర్తుండిపోయేలా ఉండాలనుకుంటారు యాక్టర్స్‌. అందుకే కొన్నిసార్లు సేఫ్‌ గేమ్‌ ఆడాలని కూడా అనుకుంటారు. నాని మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. నాని 25వ సినిమా ‘వి’లో విలన్‌గా నటిస్తున్నారు. అంతేనా? ఇప్పటి వరకూ కనిపించనట్టుగా కొత్తగా కనిపిస్తారట. సుధీర్‌బాబు, నాని, అదితీరావ్‌ హైదరీ, నివేదా థామస్‌ ముఖ్య పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వి’. ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాని సిక్స్‌ ప్యాక్‌లో కనిపించనున్నారట. అందుకోసం ప్రస్తుతం జిమ్‌ చేస్తూ బరువు తగ్గించే పనిలో ఉన్నారట. నయా లుక్స్‌తో ఆడియన్స్‌ను షాక్‌ చేయాలనుకుంటున్నారని తెలిసింది. నానీని హీరోగా పరిచయం చేసిన మోహనకృష్ణ దర్శకత్వంలోనే నాని విలన్‌గా యాక్ట్‌ చేయడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement