వి అంటే అతనేనా? | nayan's ear ring confirms relationship | Sakshi
Sakshi News home page

వి అంటే అతనేనా?

Published Mon, Jan 9 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM

వి అంటే అతనేనా?

వి అంటే అతనేనా?

‘ప్యారులో పడిపోతే పరేషానురా..’ అని ‘ధృవ’లో ఒక పాట ఉంది. కరెక్టే.. ప్యారులో పడితే పరేషానే. ఎవరికీ వినిపించకుండా దొంగచాటుగా ఫోన్లు మాట్లాడుకోవడం, కనిపించకుండా తిరగడం.. అబ్బబ్బ... అంతా పరేషాన్‌. ఇప్పుడు నయనతార–దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ ఈ పరేషాన్‌లోనే ఉన్నారని చెన్నై టాక్‌. ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్త ప్రచారంలోకొచ్చినప్పటి నుంచి ఔత్సాహికరాయుళ్లు తమ దృష్టినంతా వాళ్ల మీదే పెట్టారు. ఇద్దరూ కలసి తిరిగితే.. స్మార్ట్‌ ఫోన్‌లో చాలా స్మార్ట్‌గా ఫొటోలు తీస్తున్నారు. చేతులు, మెడ.. ఇలా కంటికి కనిపించే శరీర భాగాల్లో ఏమైనా పచ్చబొట్లు ఉన్నాయా? అని అదే పనిగా వెతకడం మొదలు పెట్టారు.

అలా వెతికిన ఓ రెండు కళ్లకు నయనతార చెవికి ఉన్న కమ్మలు కనిపించాయి. ‘వి’ ఆకారంతో అగుపించిన ఆ ఇయర్‌ రింగ్స్‌ గురించే ఇప్పుడు హాట్‌ టాపిక్‌. ‘వి’ అంటే ఏంటి? అనడిగితే ‘వ్యాన్‌’ అని చిన్నపిల్లలు చెబుతారు. విజయాల బాటలో దూసుకెళుతున్నవాళ్లు ‘విక్టరీ’ అంటారు. కానీ, ‘వి ఫర్‌ విఘ్నేష్‌ శివన్‌’ అన్నది కొందరి ఓపీనియన్‌. ప్రియుడి పేరు వచ్చేట్లుగా నయన ఇయర్‌ రింగ్స్‌ సెలక్ట్‌ చేసుకున్నారని అంటున్నారు. మరి.. ‘వి అంటే అతనేనా?’ నయనతారే చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement