10 రోజులూ పేపర్లు, మొబైల్కు సీఎం దూరం | Kejriwal on 10-day Himalayan meditation course, no news or phone access | Sakshi
Sakshi News home page

10 రోజులూ పేపర్లు, మొబైల్కు సీఎం దూరం

Published Mon, Aug 1 2016 8:28 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

10 రోజులూ పేపర్లు, మొబైల్కు సీఎం దూరం

10 రోజులూ పేపర్లు, మొబైల్కు సీఎం దూరం

ధర్మశాల: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదిరోజుల పాటు మెడిటేషన్ కోర్సులో పాల్గొనేందుకు హిమాచల్ ప్రదేశ్కు వెళ్లారు.  కేజ్రీవాల్ ఈ పది రోజులు ఎవరినీ కలవరు. ఆయన భద్రత సిబ్బంది కూడా దూరంగా ఉంటారు.  కేజ్రీవాల్ న్యూస్ పేపర్లు, టీవీలకు దూరంగా ఉండటంతో పాటు మొబైల్ ఫోన్ కూడా వాడరు.

సోమవారం ధర్మశాలకు వచ్చిన కేజ్రీవాల్ కు ఆప్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ నెల 12 వరకు ఆయన ఇక్కడే గడపనున్నారు. ధర్మకోట్లోని హిమాచల్ విపాస్సన సెంటర్లో బస చేస్తారు. మెడిటేషన్ కోర్సు మంగళవారం ప్రారంభమై, ఈ నెల 11 వరకు కొనసాగుతోంది. ఆ మరుసటి రోజు కేజ్రీవాల్ ఢిల్లీకి తిరిగివెళతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement