
క్యూట్ లుక్స్‌తో, న్యాచురల్ యాక్టింగ్‌తో కుర్ర హృదయాలను కొల్లగొట్టారు నివేదా థామస్. జెంటిల్‌మెన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దు గుమ్మ.. నిన్నుకోరి, జై లవకుశలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఆ మధ్య చదువు కోసం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన నివేదా.. ఇటీవలె పలు ప్రాజెక్ట్‌లతో బిజీ అయ్యారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నివేదా.. తాజాగా ఓ వీడియోను పోస్ట్‌చేశారు. ఇందులో నివేదా డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప్రభుదేవా హీరోగా వచ్చిన గులేభకావలి సినిమాలోని సాంగ్‌కు.. నివేదా వేసిన స్టెప్స్ అదిరిపోయాయని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. తన సోదరులతో కలిసి ఆడిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘మీరు పార్టీని ఎలా ఎంజాయ్ చేస్తారు?.. మీ హీల్స్‌ను విసిరేయండి..వెళ్లి డ్యాన్స్‌చేయండి’ అంటూ కామెంట్‌తో పాటు వీడియోను పోస్ట్ చేశారు. నిఖిల్ హీరోగా చేస్తోన్న‘శ్వాస’ సినిమాలో నివేదా హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment