లవ కుశలు కమింగ్‌ సూన్‌! | NTR's 'Jai Lava Kausa' Teaser will be released in the first week of june. | Sakshi
Sakshi News home page

లవ కుశలు కమింగ్‌ సూన్‌!

Published Thu, Jun 22 2017 12:50 AM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

లవ కుశలు కమింగ్‌ సూన్‌!

లవ కుశలు కమింగ్‌ సూన్‌!

జై–లవ–కుశ... ముగ్గురూ అన్నదమ్ములా? స్నేహితులా? శత్రువులా? ఈ ప్రశ్నలకు సమాధానం దసరాకి దొరుకుతుంది. ఈ ముగ్గురూ ఎలా ఉంటారు? అనడిగితే.. ‘జై’ మాత్రం ఇలా ఉంటాడు అని టకీమని చెప్పేయొచ్చు. ఈ మధ్యే కదా జై జోరుగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. జై సై్టలిష్‌ లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు.

మరి ‘లవ’, ‘కుశ’ లుక్స్‌ ఎలా ఉంటాయి? అనే చర్చ ఫిల్మ్‌నగర్‌లో జోరుగా సాగుతోంది. వాళ్లిద్దరూ కూడా ఆన్‌ ది వే. జస్ట్‌ పది, పదిహేను రోజుల్లో ఈ ఇద్దరి లుక్స్‌ తెలిసిపోతాయి. ‘జై’గా ఎన్టీఆర్‌ మాస్‌గా కనిపించి మార్కులు కొట్టేశారు. లవ్‌ అలియాస్‌ ఎన్‌. లవకుమార్‌  గవర్నమెంట్‌ ఎంప్లాయ్‌ అట. ఆ గెటప్పూ బాగుంటుందని ఊహించవచ్చు. మరి.. కుశ ఏం చేస్తాడు? అనుకుంటున్నారా? ఫిల్మ్‌నగర్‌ టాక్‌ ప్రకారం కుశ డ్యాన్స్‌ మాస్టర్‌ అట.

ఈ గెటప్పూ అదిరిపోయేలా ఉంటుందట. ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న ‘జై లవ కుశ’ టీజర్‌ వచ్చే నెల మొదటి వారంలో విడుదల కానుంది. కేయస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. హీరోయిన్‌ నందిత ఓ కీ రోల్‌ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు. ఈ ఏడాది దసరాకు సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement