హ్యాపీ టు బిగిన్‌ | Nivetha Thomas Completed Her Graduation | Sakshi

హ్యాపీ టు బిగిన్‌

May 30 2018 2:02 AM | Updated on May 30 2018 2:02 AM

Nivetha Thomas Completed Her Graduation - Sakshi

యాక్టింగ్‌ కెరీర్‌ను స్టార్ట్‌ చేసి రయ్‌ రయ్‌మంటూ దూసుకెళ్తున్న టైమ్‌లో ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన ‘జై లవ కుశ’ చిత్రం తర్వాత మరో సినిమాకు కథానాయిక నివేథా థామస్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు. దీంతో ఆమె పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని, లేదు లేదు చదువు కోసం సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారని మరికొన్ని వార్తలు ఇండస్ట్రీలో వినిపించాయి. సినిమాలకు ఆమె బ్రేక్‌ ఇచ్చిన మాట నిజమే కానీ అది శాశ్వతంగా కాదు. తాత్కాలికంగానే.

ఆర్కిటెక్చర్‌ గ్రాడ్యుయేషన్‌ను కంప్లీట్‌ చేయడం కోసం సినిమాలకు స్మాల్‌ బ్రేక్‌ ఇచ్చారు నివేథ. సక్సెస్‌ఫుల్‌గా స్టడీస్‌ను కంప్లీట్‌ చేసిన తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. కల్యాణ్‌రామ్‌ హీరోగా గుహన్‌ దర్శకునిగా పరిచయం అవుతున్న చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతోన్న ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారామె. ప్రస్తుతం ఈ చిత్రం నైట్‌ షూట్‌ జరుగుతోంది. ‘‘మళ్లీ సినిమాలు చేయడం హ్యాపీ. వెరీ హ్యాపీ టు బిగిన్‌’’ అన్నారు నివేథ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement