Architecture college
-
ఆన్లైన్ ఆట.. ఉపాధికి బాట
ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో టెక్నాలజీకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.. చిన్నపిల్లవాడు మొదలు పెద్దల వరకు అందరి చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్లు, గ్యాడ్జిట్లు దర్శనమిస్తున్నాయి. ఇందులో మరింత వేగంగా దూసుకువస్తున్న రంగం ఆన్లైన్ గేమ్స్. కోట్లాది రూపాయల టర్నోవర్లతో వీడియో గేమ్స్ నడుస్తున్నాయంటే ఈ రంగం ప్రాధాన్యత అర్థమవుతోంది. ఇందులో నైపుణ్యం సాధిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఢోకా ఉండదనేది నిపుణుల మాట. అంతటి ప్రాధాన్యత కలిగిన గేమ్ టెక్నాలజీని కడప నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో బీటెక్ గేమ్ డిజైన్ టెక్నాలజీస్ పేరుతో నూతనంగా కోర్సును ఏర్పాటు చేశారు. ఏఎఫ్‌యూ (వైవీయూ): కడప నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో బీటెక్ గేమ్ డిజైన్ టెక్నాలజీస్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుత డిజిటల్ టెక్నాలజీ యుగంలో నూతన ఆలోచనలు, ఆవిష్కరణలకు అవకాశం కల్పించేలా రూపుదిద్దుకున్న ఈ కోర్సు ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న రంగంగా నిపుణులు పేర్కొంటున్నారు. పెద్దపెద్ద నగరాలకే పరిమితమైన ఈ అరుదైన కోర్సు కడపలో ఏర్పాటు చేయడం విశేషం. కేవలం పిల్లలను సెల్ఫోన్లకే పరిమితం చేసే గేమ్స్ కొన్ని ఉన్నప్పటికీ ఎంతో ఉపయోగకరమైన అంశాలను కూడా ఈ టెక్నాలజీ ద్వారా చిన్నారులకు అందించే అవకాశం ఉంది. చిన్నారుల్లో ఏకాగ్రతను, మేధోశక్తిని పెంపొందించడంలో ఈ సాంకేతికత దోహదపడుతుంది. అయితే సృజనాత్మకంగా ఆలోచించగలిగే వారికి ఇందులో చక్కటి అవకాశాలు లభిస్తాయి. కోర్సులో ఏమి నేర్పుతారంటే.. బీటెక్ గేమ్ డిజైన్ టెక్నాలజీలో విద్యార్థులకు అత్యాధునిక టెక్నాలజీని అందిస్తారు. జావా, యూనిటీ, బ్లెండర్, మాయ, ఫొటోషాప్, 3డీ మోడలింగ్, ఆగ్మెంటేడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, పోస్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్ వంటి వినూత్న అంశాలు ఈ కోర్సులో నేర్పుతారు. మల్టీ టాస్కింగ్, టెక్నికల్, ప్రొఫెషనల్ స్పెషలైజ్డ్ కోర్సుగా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన కోర్సు ప్రభుత్వ ఫీజులతో విద్యార్థులకు అందుబాటులో ఉంది. ప్రవేశం ఎలా.. 10 ప్లస్ 2 (ఎంపీసీ) చదివిన విద్యార్థులకు ఇందులో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వం ఈ యేడాది నుంచి ప్రారంభించిన ఏపీ ఈఏపీసెట్–2021 ద్వారా ఇందులో ప్రవేశం పొందవచ్చు. ఈ కోర్సు నాలుగు సంవత్సరాలు. ఇందులో ప్రవేశం పొందే విద్యార్థులకు ప్రభుత్వం అందించే జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెనలు వర్తిస్తాయి. అవకాశాలు ఇలా.. గేమ్ టెక్నాలజీస్‌లో ప్రవేశం పొంది కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సినిమా రంగం, మల్టీమీడియా, సాఫ్ట్వేర్, యానిమేషన్, మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గేమింగ్ టెక్నాలజీపై పట్టు సాధించిన వారికి లక్షల్లో వేతనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవకాశాల వెల్లువ-– సి. శ్రీలక్ష్మి, అధ్యాపకురాలు, డాక్టర్ వైఎస్ఆర్ ఏఎఫ్‌యూ, కడప గేమింగ్ అన్నది కేవలం వినోదాత్మకంగానే కాకుండా ఇప్పటి ఆధునిక ప్రపంచంలో బ్యాంకింగ్ రంగంలో మార్కెటింగ్ కోసం, విద్యారంగంలో పిల్లల ఐక్యూను పెంపొందించేందుకు దోహదపడుతుంది. రాబోయే తరాలకు మొబైల్ గేమింగ్, ఐఫోన్ గేమింగ్, సోషల్ గేమింగ్ ఒక దిక్చూచిగా నిలవనుంది. రానున్న రోజుల్లో గేమ్ ఆర్ట్, గేమ్ టెస్టర్, గేమ్ డిజైనర్లకు అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం - – టి. భారతి, అధ్యాపకురాలు, డాక్టర్ వైఎస్ఆర్ ఏఎఫ్‌యూ, కడప ప్రపంచవ్యాప్తంగా యేడాదికి 2.5 బిలియన్ గేమర్లతో నూతన టెక్నాలజీలతో గేమింగ్ పరిశ్రమ శక్తివంతంగా, వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుకూలమైన కోర్సు. ఈ కోర్సును పూర్తి చేయడం ద్వారా తక్కువ కాలంలోనే ఆకర్షణీయమైన వేతనాలతో కెరీర్ ప్రారంభించవచ్చు. చదవండి : నిషేధం ఉన్నా.. నిశ్శబ్దంగా విస్తరిస్తున్నాయ్ -
‘నాటా’తో ఆర్కిటెక్చర్లో ప్రవేశాలు
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సులో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే నేషనల్ ఆప్టి ట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) ద్వారా ప్రవేశాలు కల్పించనున్నాం.. ఈఏడాది నిర్వహించే నాటా పరీక్షకు మరో రెండురోజులు (ఆగస్టు 16 వరకు) గడువు ఉందని.. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య దురైరాజ్ విజయ్‌కిశోర్ కోరారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయ పనుల ప్రగతి, ప్రవేశాల ప్రక్రియ గురించి ‘సాక్షి’ పలుకరించగా పలు విషయాలు పంచుకున్నారు. వైవీయూ : బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సులో ప్రవేశాల కోసం నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) ద్వారా వచ్చే ర్యాంకు ఆధారంగా సీటు కేటాయిస్తారు. మన రాష్ట్రంలో 13 జిల్లాల విద్యార్థులు ఇక్కడ సీటును కోరుకోవచ్చు. నాటాకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో పాటు డిప్లొమా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రెండు దఫాలుగా నిర్వహిస్తారు. మొదటి పరీక్ష ఈనెల 29న నిర్వహించనుండగా, రెండోసారి నాటా నిర్వహించే పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఈ యేడాది కోవిడ్ నేపథ్యంలో ఇంటి నుంచే వర్చువల్ విధానంలో టెస్ట్‌కు హాజరుకావచ్చు. ఇప్పటి వరకు డ్రాయింగ్ టెస్ట్ సిలబస్ స్కిల్స్‌ను పరీక్షించేదిగా ఉండేది. ప్రస్తుతం దాన్ని అవగాహనను పరీక్షించేదిగా మార్చారు. ఈ విధానంలో అభ్యర్థి బొమ్మలు గీయాల్సిన పనిలేదు. కంప్యూటర్ ముందు కూర్చుని సమాధానాలు ఇస్తే సరిపోతుంది. బీ.ఆర్క్ కోర్సు చేయడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కొలువులు లభిస్తాయి. నవీన నిర్మాణాల్లో ఆర్కిటెక్చర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు. దీంతో పాటు ఎంసెట్ ర్యాంకు ఆధారంగా బీటెక్ ప్లానింగ్, డిజిటల్ టెక్నాలజీ, ఫెసిలిటీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాం. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో 5 రకాల కోర్సులు ఉన్నాయి. స్కూల్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్లో 5 రకాలకోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ ద్వారా సీట్లను భర్తీ చేస్తాం. మొత్తం మీద రెండు విభాగాల్లో కలిపి 500 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగిన ప్రత్యేక కోర్సులు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. విశ్వవిద్యాలయ ఏర్పాటు.. పనుల ప్రగతి.. 2020–21 విద్యాసంవత్సరం నుంచి వైఎస్ఆర్ ఏఎఫ్‌యూను ప్రారంభించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చక్కటి తోడ్పాటు ఇస్తోంది. ఇందులో భాగంగా జిల్లా ప్రజాప్రతినిధులు విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా అధికారులు సైతం సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. దీంతో కడప నగర పరిధిలోని చలమారెడ్డిపల్లె వద్ద దాదాపు 140 ఎకరాల మేర స్థలాన్ని గుర్తించి అప్పగిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మేము మరో 50 ఎకరాలు కావాలని కోరుతున్నాం. డిసెంబర్ నాటికి టెండర్ల దశకు వెళ్లి నూతన విశ్వవిద్యాలయాల భవన పనులను ప్రారంభించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని విజయకిశోర్ తెలిపారు. తరగతుల నిర్వహణ.. ప్రారంభం.. కోవిడ్–19 నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను అనుసరించి తరగతులు ప్రారంభిస్తాం. బహుశా అక్టోబర్ చివరినాటికి తరగతులు ప్రారంభించే అవకాశాలున్నాయి. అత్యుత్తమ బోధకులను తీసుకువచ్చి నాణ్యమైన విద్యను అందిస్తాం. తొలుత తాత్కాలిక భవనాల్లో తరగతులు ప్రారంభిస్తాం. విద్యార్థులకు అంతర్జాతీయస్థాయిలో వసతులు, సౌకర్యాల కల్పన చేస్తాం. దీనికి సంబంధించిన సిలబస్ రూపకల్పన, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో శాశ్వత నిర్మాణాలు పూర్తిచేసి శాశ్వత భవనాల్లోకి వెళ్తాం. రానున్న రోజుల్లో డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయం రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతాం. -
తుక్కుతో మెప్పు
సాక్షి, అమరావతి బ్యూరో / ఏఎన్‌యూ: ఇంట్లో తుప్పుపట్టిన పాత ఇనుప సామాను ఉంటే కేజీల లెక్కన అమ్మేస్తాం. కానీ కాదేది కళారూపాలకు అనర్హం అన్నట్లు ఆ పాత ఇనుముతోనే అద్భుత కళాఖండాలకు ప్రాణం పోస్తున్నారు కొందరు. అలాంటి వారిలో ఏఎన్‌యూ(ఆచార్య నాగార్జున యూనివర్సిటీ) ఆర్కిటెక్చర్ కళాశాల అధ్యాపకుడు పడకండ్ల శ్రీనివాస్ ఒకరు. తనలోని కళాజిజ్ఞాసతో వాహనాల్లోని పాత ఇనుమును కరిగించి, పనికిరాని విడిభాగాలు సేకరించి అందరి మెప్పు పొందేలా అందమైన వస్తువుల్ని సజీవ రూపాలుగా తీర్చిదిద్దుతున్నారు. తనతో పాటు మరో పదిమందిని సమీకరించి చెత్తతో స్క్రాప్ మెటల్ ఆర్ట్‌కు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో.. శ్రీనివాస్ బృందం తయారు చేసిన కళాకృతులు గుంటూరు, విజయవాడతో పాటు దేశ వ్యాప్తంగా పలు ప్రముఖ పట్టణాలు, నగరాల్లో సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. గుంటూరులోని బస్టాండ్ సమీపంలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ దగ్గర, విజయవాడలోని పాత బస్టాండ్ రోడ్డులో, తాడేపల్లి కృష్ణా కెనాల్ రైల్వేస్టేషన్ ఎదుట, విజయవాడ రైల్వేస్టేషన్ ఎదుట, మల్డీ డిసిప్లినరీ శిక్షణా కేంద్రంలో, విజయవాడ రైల్వేస్టేషన్ సెల్ఫీ పాయింట్‌తో పాటు ఏపీలోని అనంతపురం, కర్నూలులో శ్రీనివాస్ బృందం రూపొందించిన కళాకృతులు దర్శనమిస్తాయి. మధురై, తిరునల్వేలి, ట్యుటికొరిన్, తూత్తుకుడి ప్రాంతాల్లో కూడా పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. చెన్నై అడయార్‌లో కూడా ఈ బృందం పనులు ప్రారంభిస్తోంది. ఆర్కిటెక్చర్ విద్యార్థులకు శిల్పకళపై అనేక మెలకువలు నేర్పుతున్నాను. పాత విద్యార్థులకు స్క్రాప్ మెటల్ ఆర్ట్‌లో శిక్షణ ఇస్తున్నాను. నాలో ఉన్న జిజ్ఞాసతో ఈ రంగం వైపు అడుగులు వేశాను. మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా.. ఇప్పుడు నా కళకు ప్రాచుర్యం రావడంతో ఎంతో ఆనందంగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. - శ్రీనివాస్, ఏఎన్‌యూ ఆర్కిటెక్చర్ అధ్యాపకుడు ఎలా రూపొందిస్తారు? ఈ ఆర్ట్‌లో మొదట కళాకృతి సైజును నిర్ధారించుకుని.. పేపర్‌పై గీసి ఏ భాగం ఎంత సైజు ఉండాలో కొలతలు రాసుకుంటారు. అనంతరం కరిగించిన పాత ఇనుముతో పునాది (బేస్) తయారు చేస్తారు. ఆ తర్వాత ఇనుప పైపుల్ని వెల్డింగ్ చేస్తూ అనుకున్న రూపానికి తీసుకొస్తారు. దానిపై వాహనాల గేర్ వీల్స్, షాక్ అబ్జర్వర్స్ అమర్చి వెల్డింగ్ చేసి అందంగా మలుస్తారు. ఆ రూపాన్ని డీజిల్, కిరోసిన్‌తో శుభ్రపరుస్తారు. డ్యూకో పెయింట్‌తో అనుకున్న రంగు వచ్చే వరకు రెండు, మూడు సార్లు పెయింట్ వేస్తారు. చివరికి అద్భుత కళాకృతి ఆవిష్కృతమవుతుంది. శ్రీనివాస్ బృందం విజయవాడ కేంద్రంగా వీటిని రూపొందిస్తుంది. పాత బస్టాండ్ సమీపంలోని ఒక కర్మాగారంలో బృందంగా వీటిని తయారుచేస్తున్నారు. ఈ కళారూపాలకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు పురస్కారాలు లభించాయి. విద్యార్థి దశ నుంచే ఆసక్తి స్క్రాప్ మెటల్ ఆర్ట్‌పై శ్రీనివాస్‌కు విద్యార్థి దశ నుంచే ఆసక్తి. 1998లో బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి శిల్పకళలో పీజీ చేశారు. 2010 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్‌లో అకడమిక్ అసోసియేట్‌గా పనిచేస్తున్నారు. అయితే స్క్రాప్ మెటల్ ఆర్ట్‌పై ఉన్న మక్కువ ఆయన్ను కుదురుగా ఉండనీయలేదు. ఫైన్ ఆర్ట్స్ మాజీ విద్యార్థులు 20 మందితో వర్క్‌షాప్ ఏర్పాటు చేసి పాత ఇనుము, వాహనాల విడిభాగాలతో కళాఖండాలు రూపొందిస్తున్నారు. -
హ్యాపీ టు బిగిన్
యాక్టింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేసి రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తున్న టైమ్‌లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘జై లవ కుశ’ చిత్రం తర్వాత మరో సినిమాకు కథానాయిక నివేథా థామస్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఆమె పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని, లేదు లేదు చదువు కోసం సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టారని మరికొన్ని వార్తలు ఇండస్ట్రీలో వినిపించాయి. సినిమాలకు ఆమె బ్రేక్ ఇచ్చిన మాట నిజమే కానీ అది శాశ్వతంగా కాదు. తాత్కాలికంగానే. ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేషన్‌ను కంప్లీట్ చేయడం కోసం సినిమాలకు స్మాల్ బ్రేక్ ఇచ్చారు నివేథ. సక్సెస్‌ఫుల్‌గా స్టడీస్‌ను కంప్లీట్ చేసిన తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. కల్యాణ్‌రామ్ హీరోగా గుహన్ దర్శకునిగా పరిచయం అవుతున్న చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతోన్న ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారామె. ప్రస్తుతం ఈ చిత్రం నైట్ షూట్ జరుగుతోంది. ‘‘మళ్లీ సినిమాలు చేయడం హ్యాపీ. వెరీ హ్యాపీ టు బిగిన్’’ అన్నారు నివేథ. -
యూనివర్సిటీకి త్వరలో మాస్టర్ ప్లాన్
తెయూ(డిచ్పల్లి) : అందుబాటులో ఉన్న 577 ఎకరాల స్థలాన్ని సద్విని యోగం చేసుకునే దిశగా తెలంగాణ యూనివర్సిటీ యంత్రాంగం మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సిద్ధమైంది. ఈ మేరకు జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ అండ్ అర్కిటెక్చర్ యూనివర్సిటీ నిపుణుల బృందం ఇటీవల క్యాంపస్‌లోని సువిశాల స్థలాన్ని పరిశీలించింది. ఈ బృందానికి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ నేతృత్వం వహించారు. తెయూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, ఏయే స్థ లంలో కళాశాల భవనాలు నిర్మించాలి, గెస్ట్‌హౌస్,ఫ్యాకల్టీ హౌసింగ్,హెల్త్ సెం టర్, హాస్టల్ భవనాలు, స్టేడియం, ఆడిటోరియం ఇతర మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలనే విషయాలపై శాస్త్రీయంగా మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తారు. నిపుణుల బృందం ఇచ్చిన సూచనలు, ప్రాథమిక రిపోర్ట్‌ను దృష్టిలో ఉంచుకుని బుధవారం డీన్లు, ప్రిన్సిపాళ్లతో వర్సిటీ రిజిస్ట్రార్ లింబా ద్రి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాబోయే కాలంలో వర్సిటీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉం చుకుని ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు. నిపుణుల క మిటీ బృందం చేసిన సూచనల గురిం చి సమావేశంలో విపులంగా చర్చిం చారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు ఎమ్.యాదగిరి, కనకయ్య, సత్యనారాయణచారి, జయప్రకాశ్‌రావు, ఎ ల్లోసా, బిల్డింగ్ డివిజన్ ఇంజనీర్లు పాల్గొన్నారు.