తెయూ(డిచ్‌పల్లి) : అందుబాటులో ఉన్న 577 ఎకరాల స్థలాన్ని సద్విని యోగం చేసుకునే దిశగా తెలంగాణ యూనివర్సిటీ యంత్రాంగం మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సిద్ధమైంది. ఈ మేరకు జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ అండ్ అర్కిటెక్చర్ యూనివర్సిటీ నిపుణుల బృందం ఇటీవల క్యాంపస్‌లోని సువిశాల స్థలాన్ని పరిశీలించింది. ఈ బృందానికి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ నేతృత్వం వహించారు. తెయూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, ఏయే స్థ లంలో కళాశాల భవనాలు నిర్మించాలి, గెస్ట్‌హౌస్,ఫ్యాకల్టీ హౌసింగ్,హెల్త్ సెం టర్, హాస్టల్ భవనాలు, స్టేడియం, ఆడిటోరియం ఇతర మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలనే విషయాలపై శాస్త్రీయంగా మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తారు.
నిపుణుల బృందం ఇచ్చిన సూచనలు, ప్రాథమిక రిపోర్ట్‌ను దృష్టిలో ఉంచుకుని బుధవారం డీన్లు, ప్రిన్సిపాళ్లతో వర్సిటీ రిజిస్ట్రార్ లింబా ద్రి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాబోయే కాలంలో వర్సిటీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉం చుకుని ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు. నిపుణుల క మిటీ బృందం చేసిన సూచనల గురిం చి సమావేశంలో విపులంగా చర్చిం చారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు ఎమ్.యాదగిరి, కనకయ్య, సత్యనారాయణచారి, జయప్రకాశ్‌రావు, ఎ ల్లోసా, బిల్డింగ్ డివిజన్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
యూనివర్సిటీకి త్వరలో మాస్టర్ ప్లాన్
Published Fri, May 1 2015 5:36 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM
Advertisement
Advertisement