
‘పటాస్’ చిత్రంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు నందమూరి కళ్యాణ్‌రామ్. అయితే అప్పటినుంచీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేక మళ్లీ వెనుకబడ్డాడు. అయినా సరే ఎలాగైనా విజయం సాధించాలని.. కొత్తగా ట్రై చేసి తమన్నాతో కలిసి ‘నా నువ్వే’ అంటూ ప్రేక్షకులను పలకరించాడు. కానీ అదికూడా సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.
అయితే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కళ్యాణ్‌రామ్ సిద్దమవుతున్నాడు. సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందబోతున్న ఈ చిత్రం టైటిల్‌ను సోమవారం రివీల్‌చేశారు. ‘118’ గా రాబోతోన్న ఈ చిత్రంలో నివేదా థామస్, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కెవి గుహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయనున్నారు.
Here we go.. #118 is the title of our next with @NANDAMURIKALYAN and KV Guhan.. A slick and suspenseful action thriller your way. #NKR16 pic.twitter.com/kS0vuMglvj
— East Coast Prdctns (@EastCoastPrdns) December 3, 2018
Comments
Please login to add a commentAdd a comment