ఇడియట్‌తో జూలియట్‌! | Director Sukumar will release the first look poster of Juliet Lover of Idiot | Sakshi
Sakshi News home page

ఇడియట్‌తో జూలియట్‌!

Published Tue, Jun 27 2017 12:14 AM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM

ఇడియట్‌తో జూలియట్‌!

ఇడియట్‌తో జూలియట్‌!

నవీన్‌చంద్ర, నివేదా థామస్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌’. దర్శకుడు సుకుమార్‌ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన అజయ్‌ వోధిరాల దర్శకత్వంలో అనురాగ్‌ ప్రొడక్షన్స్‌పై కొత్తపల్లి ఆర్‌. రఘుబాబు, కేబీ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను దర్శకుడు సుకుమార్‌ విడుదల చేశారు. ‘‘అజయ్‌ కథ నచ్చడంతో సినిమా రంగంలోకి వచ్చాం.

లాజిక్, మ్యాజిక్‌ ఉన్న సున్నితమైన ప్రేమకథా చిత్రమిది. షూటింగ్‌ చివరి దశలో ఉంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులూ జరుగుతున్నాయి. త్వరలో ట్రైలర్, ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేసిన సుకుమార్‌గారికి ధన్యవాదాలు. లాజికల్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నా. నవీన్‌ చంద్ర, నివేదాల సహజ నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్థర్‌ ఎ. విల్సన్‌–గిరీష్‌ గంగాధరన్, సంగీతం: రతీష్‌ వేగ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రవితేజ, లైన్‌ ప్రొడ్యూసర్‌: సురేష్‌ కొండవీటి, సమర్పణ: కొత్తపల్లి అనురాధ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement