
‘పటాస్’ మూవీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఎమ్మెల్యే, నా నువ్వేలాంటి సినిమాలు చేసినా.. ఆశించినంత ఫలితాన్నివ్వలేదు. మరోసారి సూపర్‌హిట్‌ను కొట్టేందుకు డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ.. టీజర్‌తో బాగానే ఆకట్టుకుంది.
ఈ మూవీలో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో అర్జున్‌రెడ్డి బ్యూటీ షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.తాజాగా ఈ సినిమాలోంచి చందమామే అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. షాలిని పాండే, కళ్యాణ్ రామ్‌ల కెమిస్ట్రీ బాగుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రం ఏమేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి. నివేదా థామస్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు. కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment