
రజనీకాంత్
ముంబైలోని మాఫియాను గడగడలాడించడానికి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా మారారు రజనీకాంత్. ప్రజలను భయపెడుతున్న గ్యాంగ్‌స్టర్స్‌కు తూటాతో సమాధానం చెబుతున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత రజనీకాంత్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అందులోనూ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించబోతున్నారట రజనీ.
అలాగే ఈ సినిమాలో ఆయన రెండు పాత్రలు చేస్తున్నారని ప్రచారం జరగుతోంది. ఇటీవల ముంబైలో మొదలైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. ముఖ్యంగా ముంబైలోని ఓ కాలేజీలో వేసిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ రూమ్ సెట్‌లో రజనీకాంత్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలిసింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ 29న స్టార్ట్ చెన్నైలో మొదలవుతుందని తెలిసింది. బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ ‘దర్బార్’లో ఓ విలన్‌గా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త.