అప్పుడే ఎంతో ఫన్ అంటోంది నటి నివేదా థామస్. ఈ మలయాళ చిన్నది ఒక పక్క హీరోయిన్‌గా నటిస్తూనే, స్టార్ హీరోలకు వెండితెర కూతురిగా మారిపోతోంది. అలా మలయాళంలో మోహన్‌లాల్‌కు, తమిళంలో కమలహాసన్, రజనీకాంత్‌లకు ముద్దుల కూతురిగా మారిపోయింది. లక్కీగా ఈ మూడు చిత్రాలు నివేదా థామస్‌కు మంచి పేరు తెచ్చి పెట్టాయి, ముఖ్యంగా దర్బార్‌లో రజనీకాంత్‌కు కూతురుగా కీలక పాత్రను పోషించి మెప్పించింది. ఇంకా చెప్పాలంటే దర్బార్ చిత్రంలో హీరోయిన్ నయనతార పాత్ర కంటే నివేదా పాత్రకే అధిక ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా నటిగా నివేదా థామస్ అనుభవాలను చూద్దాం.
చదువుకునే రోజుల్లోనే నటిగా రంగప్రవేశం చేశాను. అయినా నటనతో పాటు చదువుకు ప్రాముఖ్యతనిచ్చాను. అలా గత ఏడాదే చదువులో ఆర్కిటెక్చర్ పూర్తి చేశాను. దర్బార్ చిత్రంలో రజనీకాంత్‌తో నటించిన అనుభవం గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ఆ చిత్ర షూటింగ్‌కు ముందే ఏవీఎం స్టూడియోలో ఫొటో షూట్ నిర్వహించారు. అప్పుడే రజనీకాంత్‌ను దగ్గరగా చూశాను. అదీ ఆదిత్య అరుణాచలం (దర్బార్ చిత్రంలోని పాత్ర) గెటప్‌లో చూశాను. అప్పుడే ఆయన సూపర్‌స్టార్ కంటే కూడా ఒక తండ్రిగా నా మనసులో నిలిచిపోయారు. ఇక దర్బార్ చిత్ర షూటింగ్‌లో కామెడీ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో రజనీకాంత్‌లో ప్రత్యేక ఎనర్జీని చూశాను. ఆయన్ని ఆట పట్టించే సన్నివేశాల్లో నటించడానికి నటుడు యోగిబాబు చాలా సంకటపడ్డారు. అప్పుడు రజనీ సార్‌ను చూడొద్దు. స్క్రిప్ట్‌లో ఉన్నది నువ్వు చెయ్యి కన్నా అని ఆయన ఎంకరేజ్ చేశారు.
కామెడీ సన్నివేశాల్లో తమతో జాలీగా ఎంగేజ్ అయి చాలా సూచనలిచ్చేవారు. దాన్ని అవుట్‌పుట్ చూస్తే వేరే లెవల్‌గా ఉండేది. నిజం చెప్పాలంటే దర్బార్ చిత్ర షూటింగ్‌లో చాలా ఖుషీగా ఉన్నాను. కారణం పాపనాశం తరువాత చాలా గ్యాప్ తరువాత తమిళంలో మాట్లాడి నటించాను. అంతగా తమిళ చిత్రాలను మిస్ అయ్యాను. నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధం. కథానాయకిగా మాత్రమే నటిస్తానని, పలాన భాషలోనే నటిస్తానని నిబంధనలు లేవు. రజనీకాంత్‌లో కామెడీ సెన్స్ నాకు చాలా ఇష్టం. అలాంటి సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ఆయన ఖుషీ అవుతూ మమ్మల్ని జాలీ పరిచేవారు. ఇకపోతే కమలహాసన్‌ను తొలిసారిగా పాపనాశం చిత్రంలో నాన్న గెటప్‌లోనే చూశాను. చిత్రం బాగా రావాలని ఆయన చూపే సిన్సియారిటీ నాకు చాలా నచ్చింది.
అదే విధంగా విజయ్ కెమెరా వెనుక చాలా ప్రశాంతంగా ఉంటారు. అదే కెమెరా ముందుకు వచ్చే ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. నాకు సినిమా చేయాల్సింది ఇంకా చాలా ఉంది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో చాలా చిత్రాల్లో నటించాలి. భాషను నేర్చుకోవడం అంటే నాకు చాలా ఆసక్తి. ఏ భాషనైనా చాలా త్వరగా సెట్ అయిపోతాను. అందుకే ఇతర భాషా చిత్రాల్లోనూ నటించాలని కోరుకుంటున్నాను. ఇక సినిమాలో మరచిపోలేని అనుభవం అంటే తెలుగులో నటించిన జెంటిల్‌మెన్ చిత్రమే. ఆ చిత్రం కోసం ఒక సారి కంటిన్యూగా రెండు రోజులు విరామం లేకుండా నటించాను. షూటింగ్ పూర్తి అయిన తరువాత 16 గంటల పాటు నిద్రపోయాను. ఆ సంఘటన ఎప్పటికీ మరచిపోలేను. డబ్బు మాత్రమే సంతోషాన్నివ్వదన్నది నమ్మే వ్యక్తిని నేను. ఖాళీ సమయం లభిస్తే నేను ఉండేది ఇంట్లోనే. అమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేస్తాను.
Comments
Please login to add a commentAdd a comment