
సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ రిటైర్మెంట్‌పై చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. బాబా సినిమా సమయంలోనే రిటైర్మెంట్‌పై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే రజనీ మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి రజనీ రిటైర్మెంట్ వార్తలు తెరమీదకు వచ్చాయి. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ సినిమాలో నటిస్తున్న రజనీ, తరువాత మరో రెండు సినిమాలు మాత్రమే చేయనున్నారట.
తనతో ఎన్నో సూపర్ హిట్స్ అందించిన కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా, వినోద్ దర్శకత్వంలో మరో సినిమా చేసి రిటైర్మెంట్ ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంపై రజనీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే రాజకీయ పార్టీని ప్రకటించిన రజనీ ఈ లోక్‌సభ ఎలక్షన్లకు దూరంగా ఉంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి నటనకు గుడ్‌బై చెప్పి పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నారు రజనీ కాంత్.