
‘దర్బార్’లో రజనీకాంత్
సినిమా ఫస్ట్‌లుక్ విడుదల కాకముందే తమ అభిమాన హీరో లుక్స్ కొన్నింటిని ఫ్యాన్స్ రెడీ చేసి సంబరపడుతుంటారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి సందడి చేస్తుంటారు. ఈ విషయం గురించి ఆలోచించినట్లున్నారు ‘దర్బార్’ చిత్రబృందం. అందుకే కొన్ని పోస్టర్స్‌ను డిజైన్ చేసే అవకాశాన్ని ఫ్యాన్స్‌కే వదిలేశారు. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది.
ఇందులో ఐïపీఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు రజనీ. ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్టు చేసినప్పటికీ ఈ సినిమా లొకేషన్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటితో కొన్ని ఫ్యాన్‌మేడ్ పోస్టర్స్ రెడీ అవుతున్నాయి. దీంతో చిత్రబృందమే రెండు హై క్వాలిటీ ఫొటోస్‌తో పాటు తమిళ, ఇంగ్లీష్ వెర్షన్ టైటిల్స్ లోగోలను రిలీజ్ చేసింది. వాటితో క్రియేటివ్ పోస్టర్ డిజైన్ చేయమనే బంపర్ ఆఫర్ ఫ్యాన్స్‌కి ఇచ్చారు. నచ్చిన పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేస్తామని ఏఆర్ మురుగదాస్ వెల్లడించారు. అభిమానులూ.. రెడీయా!
Comments
Please login to add a commentAdd a comment