డుమ్‌ డుమ్‌ డుమ్‌ | darbar audio second song release | Sakshi
Sakshi News home page

డుమ్‌ డుమ్‌ డుమ్‌

Published Fri, Dec 27 2019 12:21 AM | Last Updated on Fri, Dec 27 2019 12:21 AM

darbar audio second song release - Sakshi

నయనతార, రజనీకాంత్

‘డుమ్‌ డుమ్‌ డుమ్‌  గట్టి మేళం మోగేట్టు...’  అంటూ సాగే పెళ్లి పాటను ‘దర్బార్‌’ చిత్రబృందం గురువారం విడుదల చేసింది. రజనీకాంత్, నయనతార జంటగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్‌’. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించింది. ఈ సినిమాలోని రెండో పాట (డుమ్‌ డుమ్‌..)ను గురువారం రిలీజ్‌ చేశారు. కృష్ణకాంత్‌ రచించిన ఈ పాటను నకాష్‌ అజీజ్‌ పాడారు.

అనిరుధ్‌ సంగీత దర్శకుడు. గేయరచయిత కృష్ణకాంత్‌ మాట్లాడుతూ – ‘‘రజనీకాంత్‌గారికి పాట రాసే అవకాశం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. ఇదంతా ఓ కలలా ఉంది. సినిమాలో ఓ యువ జంటకు పెళ్లయ్యే సందర్భంలో వచ్చే పెళ్లి పాట ఇది. భార్యాభర్తల అన్యోన్యతకు సంబంధించి చిన్న ఫిలాసఫీ ఉన్న పాట. ఈ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అని పేర్కొన్నారు. జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: సంతోష్‌ శివన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement