
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దర్బార్. పేట సినిమాతో సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రజనీ ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార రజనీ సరసన కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాపై లీకు వీరులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.
ఇప్పటికే రజనీ లుక్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా రజనీతో పాటు నయనతార ఉన్న ఫొటో ఒకటి నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. దీంతో చిత్రయూనిట్ లీకులను ఆపేందుకు చర్యలు తీసుకుంటోంది. సెట్‌లోకి విజిటర్స్ రాకుండా నిషేదం విదించటంతో పాటు సెల్‌ఫొన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌ల వాడకం పై ఆంక్షలు విదిస్తున్నారు. మరి ఈ చర్యలతో అయిన లీకులు ఆగుతాయేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment